నేను ఉన్నాను అనే ఎరుక ఉంటుంది..ఈ నేను అనే ఎరుకను తెలుసుకోవడానికి నేను ఎన్నో జన్మలు ఎత్తాల ? చిత్రం ఏమిటంటే
" నేను " అన్నప్పుడు వెంటనే ఒక రూపం,నామం(పేరు) ఇవే నేనుగా అనిపిస్తాయి..ఈ నామ రూపాలు అసలైన నేను ను
మరుగు పరుస్తాయి..ఇక జీవుడు(మనం) ఏమి చేస్తాడు అంటే ఆ నామ, రూపాల పైన అభిమానాన్ని పెంచుకొని " అవి నేనే " అనే అహంకారంగా మారిపోతాడు..
ఇలా..నేను అనే ఎరుక నుండి, నేనే అనే అహంకారంగా జీవుడు మారి ఇక కర్మలు చేస్తూ ఉంటాడు,సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు, మళ్ళీ పుట్టి మళ్ళీ చస్తూ ఉంటాడు..ఈ తలనొప్పి అంతా ఎందుకు వచ్చిందో తెలుసా..నేను ఉన్నాను అనే నిజమైన ఎరుకను మరచిపోవడం వల్ల.. నేను ఇలా ఉన్నాను,అలా ఉన్నాను,ఇక్కడ ఉన్నాను,అక్కడ లేను అనే భ్రాంతి జ్ఞానంతో జీవించడం వల్ల జీవుడు సంసారంలో ఇరుక్కుపోతున్నాడు..
మరి జీవుడు విడుదల పొందాలి అంటే ఏం చేయాలి..తన నిజమైన ఎరుకను గుర్తించాలి..అంతే..అదే మోక్షం..ఈ నిజమైన ఎరుకకే ఆత్మ అని,పరమాత్మ అని,మహా చైతన్యం అని పేర్లు ఉన్నాయి..తన నిజమైన ఎరుకను గుర్తించిన వాడు మృత్యుంజయుడు..అతడికి మృత్యు భయం ఉండదు.
❤️❤️❤️❤️❤️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి