.
॥ రవివర్ణనమ్ ॥
-97- శ్లోకము :
ద్వీపే యోఽస్తాచలోఽస్మిన్భవతి
ఖలు స ఏవాపరత్రోదయాద్రి-
ర్యా యామిన్యుజ్జ్వలేందుద్యుతి
రిహ దివసోఽన్యత్ర తీవ్రాతపః
సఃయద్వశ్యౌ దేశకాలావితి నియమ యతో నో తు యం దేశకాలా-
వవ్యాత్సస్వప్రభుత్వాహిత
భువన హితో హేతురహ్నామినో వః ॥
-97- మత్తేభము :
ఎది యీ దీవిని గ్రుంకుమెట్ట యది
వేర్ద్వీపంబునన్ బొడ్పుగ
ట్టెది జాబిల్లి వెలుంగు రేయిటనదే
యింకొక్కచోనుండు మం
డుదినంబెవ్వడు దేశకాలముల
నేఁడున్ లోఁచు లోఁగాకహ
మ్మొదవన్ హేతువు లోకభద్రకరుఁడా
యుష్ణాంశుడేలున్ మిమున్✋️🤚
టీకా :
[ ఇందు కవి గారు
సూర్యభగవానుని దేశ కాలము
లకు అతీతునిగా
చెప్పుచున్నారు..]
ఎ(..ఏ)ది , యీ , దీవి ని = ద్వీపము పై , (గ్రుం)క్రుంకు = అస్తమించు , మెట్ట =
కొండయో , (య)అది , వేర్ = వేరొక ,
+ ద్వీపంబునన్ , (బొ)పొడ్పు = ఉదయించు , గట్టు = కొండ ;
+ ఎ(..ఏ)ది ,
< జాబిల్లి వెలుంగు రేయి > = చంద్రకాంతి తో వెన్నెల రాత్రి , + ఇటన్ =
ఇక్కడనో , + అదే ,
< (యిం)ఇకొక్క చో(..ట)న్ , + ఉండు , మండు దినంబు > = ఇంకొక చోట
ఎండలో మండునట్టి పగలు ;
+ ఎవ్వడు , (ఈ రీతిగా వేరు వేరుగా తోచు ఆ యా ..) దేశ కాలములన్ = దేశము , కాలములను ,
+ ఏడు న్ = (కాలమునకు సంకేతమైన ..) సంవత్సరము (..పొడవునా క్రమము తప్పక ) ,
లోఁచు = (తన..) అధీనమున నుంచుకొనుచు , ( వాటికి తాను..) లోఁగాక = అధీనుడు కాకుండా ,
+ అహమ్ము = పగలు / దినము ,
+ ఒదవన్ = అగుటకు , హేతువు =
కారణము (..అయిన) , లోక(..మునకు) , భద్రకరుఁడు = శుభము గూర్చువాడు ,
+ ఆ , (యు)ఉష్ణ = వేడి ,
+ అంశుడు = కిరణములవాడు - సూర్యుడు , +[ఏలున్ ] , మిమున్ , ఏలున్ = కాచును గాక ..✋️🤚
భావము :
[ ఇందు కవి గారు
సూర్యభగవానుని దేశ కాలము
లకు అతీతునిగా
చెప్పుచున్నారు..]
ఏది యీ ద్వీపమున అస్తమించు కొండయో - అది వేరొక
ద్వీపంబున ఉదయించు కొండ ;
ఏది యిక్కడ చంద్రకాంతితో వెన్నెల రాత్రియో - అదే ఇంకొక చోట
ఎండలో మండునట్టి పగలు ;
ఎవ్వడు ఈ రీతిగా వేరు వేరుగా
తోచు ఆ యా దేశము , కాలములను సంవత్సరము పొడవునా క్రమము తప్పక
తన అధీనమున నుంచుకొనుచు - వాటికి తాను అధీనుడు కాకుండా ..
పగలు అగుటకు
కారణమయినవాడో ..
లోకమునకు శుభము గూర్చువాడు -
వేడి కిరణములవాడు - ఆ సూర్యుడు మిమ్ములను కాచును గాక ..✋️🤚
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి