5, జూన్ 2024, బుధవారం

05.06.2024. బుధవారం

 *జై శ్రీరాం..శుభోదయం🌷🌹*


05.06.2024.       బుధవారం


*శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు*


సుప్రభాతం......


ఈరోజు వైశాఖ మాస బహుళ పక్ష *చతుర్దశి* తిథి రా.07.54 వరకూ తదుపరి వైశాఖ *అమావాస్య* తిథి, *కృత్తిక*  నక్షత్రం రా.09.16, తదుపరి *రోహిణి* నక్షత్రం, *సుకర్మ* యోగం రా.12.36 వరకూ తదుపరి *ధృతి* యోగం, *భద్ర (విష్ఠీ)* కరణం ఉ.08.56 వరకూ *శకుని* కరణం రా.07.54 వరకూ తదుపరి *చతుష్పాద* కరణం  ఉంటాయి.

*సూర్య రాశి*: వృషభం ( రోహిణి నక్షత్రంలో)

*చంద్ర రాశి*: వృషభ రాశిలో.

*నక్షత్ర వర్జ్యం*: ఉ.09.55 నుండి ఉ.11.26 వరకూ

*అమృత కాలం*: రా.07.00 నుండి రా.08.31 వరకూ


( హైదరాబాద్ ప్రాంతం వారికి)

*సూర్యోదయం*: ఉ.05.41

*సూర్యాస్తమయం*: సా.06.49

*చంద్రోదయం*: రా.రే. తె.05.07

*చంద్రాస్తమయం*: సా.05.48

*అభిజిత్ ముహూర్తం*: లేదు

*దుర్ముహూర్తం*: ప.11.49 నుండి మ.12.41 వరకూ.

*రాహు కాలం*: మ.12.15 నుండి మ.01.53 వరకూ

*గుళిక కాలం*: ఉ.10.36 నుండి మ.12.15 వరకూ

*యమగండం*: ఉ.07.19 నుండి ఉ.08.58 వరకూ.


 ఈ రోజు *వాజసనేయీ అమావాస్య*. శుక్ల యజుర్వేద, వాజసనేయి శాఖ వారు ఈరోజు పితృ దేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తిస్తారు.


ఈరోజు *మాస కృత్తికా వ్రతం*. శైవ భక్తులు ప్రతి నెలా వచ్చే కృత్తికా నక్షత్రం రోజు ఉపవాసం ఉండి, సాయంత్రం కార్తీక దీపం పేరుతో నూనె దీపారాధన లు చేస్తారు.


ఈరోజు *శివ నక్త వ్రతం*. ఈరోజు భక్తులు పగటి పూట ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత దీపారాధన చేసి పారణ చేస్తారు.


*సర్వార్థ సిద్ది యోగం* ఈరోజు పూర్తి గా ఉంటుంది.(బుధవారం మరియూ కృత్తిక,రోహిణి నక్షత్రం కలయిక). ఈ సమయం లో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికీ, క్రొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం.


శివ స్మరణం తో......సమస్త సన్మంగళాని భవంతు..శుభమస్తు..నమస్కారం.....సభక్తికం గా.....మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్.

ఫోన్ నెంబర్: 6281604881.

కామెంట్‌లు లేవు: