5, జూన్ 2024, బుధవారం

సత్సంబంధాలు

 *భార్య పెంచుకుంటున్న పిల్లి అంటే సుబ్బారావుకు పరమ చిరాకు. ఒక రోజు దాన్ని ఎలాగైనా వదిలించుకోవాలని, ఓ పది వీధుల అవతల వదిలిపెట్టి వచ్చాడు. ఇంటికి వచ్చే సరికి అది ఇంట్లో ఉంది ఆశ్చర్యంగా !! ఈసారి పిల్లిని ఇరవై వీధుల అవతల వదిలి వచ్చాడు.*


*ఇంటికి వచ్చేసరికి మళ్ళీ అది ఇంట్లో ఉంది.*


*ఎంత దూరం తీసుకెళ్లినా, ఎన్ని దారులు మార్చినా మళ్ళీ ఇంటికి వచ్చేస్తూనే ఉంది.*


*చివరికి వీధుల్లో రకరకాలుగా తిప్పి, వంతెనలెక్కించి ఎక్కడో దూరంగా వదిలేసాడు. ఇంక పిల్లి ఇంటికి రాదని నిర్ధారణ చేసుకొని గంట తర్వాత భార్యకు ఫోన్ చేసి అడిగాడు 'పిల్లి వచ్చిందా' అని. 'ఒచ్చింది గానీ మీరెక్కడ తగలడ్డారు.' నిస్పృహతో "ఫోన్ దానికివ్వు. నేను దారి తప్పి పోయాను. ఇంటికి ఎలా రావాలో దాన్నే అడగాలి." (ఎవరినైనా మనం తీవ్రంగా అయిష్ట పడవచ్చు, కానీ ఏదో ఒక సమయంలో మనకు వారి అవసరం పడవచ్చు. కాబట్టి మిమ్మల్ని ఎంతమంది ఇష్టపడకపోయినా పట్టించుకోవద్దు. మీకు సంబంధించిన వారందరితో*


*సత్సంబంధాలు కలిగి ఉండండి.*

కామెంట్‌లు లేవు: