ఆస్తిక మహాశయులారా
గత కొద్దీ కాలంనుండి మనం ఈ బ్లాగులో అనేకమైన ధార్మిక విషయాలను గురించి సమాచారాన్ని పొందుపరుస్తూ వున్నాము. ఒక రకంగా చెప్పాలంటే హిందూ ధర్మ ప్రచారమే ద్యేయమగా ఈ బ్లాగు నడుపుతున్నాము. దీనికి దేశ విదేశాలనుండి అనేకమంది ప్రేక్షకులు చూస్తున్నారని అందరి ఆధరణే ఈ బ్లాగుకు శ్రీరామరక్ష అనే భావనతో మనం ముందుకు పోతున్నాము. తరచుగా మన బ్లాగును తిలకించే ప్రేక్షకులకు కూడా ఈ బ్లాగులో భాగస్వామ్యం కలిపించాలని భావించి మీరు బ్లాగులో ప్రచురించదలచిన విషయం అది ఏదైనా కానీయండి మన హిందూ ధర్మానికి చెందినది, లేక లోక శ్రేయస్సుకు చెందినది కానీయండి లేక ఆస్తికజనాకర్షకమైనది అయితే ఇక్కడ అందరి ఉపయోగార్ధము ప్రచురించ సంకల్పించాము. కానీ ఈ సరికి ఒక్కరు కూడా స్పందించక పోవటం విచారకరం. అంతే కాకుండా ఈ బ్లాగుని ఇంకా మంచిగా తీర్చి దిద్దటానికి మీ వంతు సహాయం చేయమని కోరటం జరిగింది. కానీ ఇంతవరకు ఒక్కరు కూడా స్పందించకపోవటం కడా జరిగింది. మిత్రులకు తెలియచేయునది ఏమిటంటే మీరు ఈ బ్లాగు చూసి మీకు నచ్చిన విషయాలమీద మీ స్పందనను సవిమర్శనాత్మకంగా తెలియచేయండి. మూర్ఖపు కామెంటులను దయచేసి పెట్టకండి. ఇది ధార్మికమైన బ్లాగు అని మరువ వద్దు.
'శ్రేయాంసి బహు. విఘ్నాని" అన్నట్టు ఈ రోజుల్లో నీచ విమర్శలు చేసే వారు అనేకులు సమాజ శ్రేయస్సుకోసం చేసే ప్రతి కార్యాన్ని భగ్నపరచ ప్రయత్నిస్తున్నారు. అంతా కలి మహత్యం అని మనం ఊరుకోలేము కదా. మనవంతు భాద్యతగా అటువంటి వారిని త్రిప్పికొడితేనే కానీ మన ధర్మం నిలపడదు.
సమాజంలో హిందుత్వంలో పుట్టిన అనేకులు ఇతర మతాల ప్రభావం వలన నాస్తికులుగా మరియు హిందూ ధర్మ విమర్శకులుగా మారుతున్నారు. వారి నందరను చేరదీసి మన ధర్మం గొప్పదనాన్ని తెలియచేసి వారిని మన ధర్మం వైపు నడిపించవలసిన అవసరము ఎంతైనా వుంది. ఈ కార్యానికి హిందువు ఐన ప్రతి ఆస్తికవాది నడుము కట్టాలి.
ధర్మ ప్రచారంలో భాగంగా మనం మన బ్లాగులో అనేక హిందూ ధార్మిక విషయాలను పొందుపరుస్తూ ముందుకు వెళుతున్నాము. ఇది కేవలము నిష్ఫలాపేక్ష కార్యాక్రమం అయినప్పటికీ మనకు డబ్బు యొక్క అవసరము వున్నది కదా. ఈ రోజుల్లో అడుగుతీసి అడుగు వేయాలన్నా డబ్బుతోటె పని పడుతున్నది. కాబట్టి ఆస్తిక మహాశయులను వారి శక్తానుసారంగా విరాళాలు ఇచ్చి ఈ బ్లాగును ముందుకు తీసుకొని వెళ్ళుటకు తమ వంతు సాయం అందించవలసిందిగా పలుమార్లు కొరతమైనది. కానీ ఇంతవరకు ఎవ్వరు ఆర్థిక సాయము చేయుటకు ముందుకు రాలేదు. వీక్షక మిత్రులను కోరేది ఏమిటంటే బ్లాగును నడుపుటకు మీవంతు సాయంగా
1) బ్లాగులో ప్రచురించుటకు విషయాలను అంటే మీ రచనలను తెలుగు, ఇంగ్లిష్ లేక హిందీ భాషలలో పంపగలరు. , భక్తి వేదాంత పరమైనవి హిందుత్వ వికాసానికి తోడ్పడే వాటికి ప్రాధాన్యత ఇచ్చి ప్రచురించగలము. అంతేకాక మీ సొంత రచనలు, కథలు, కథానికలు, వ్యాసాలు, కవితలు, పద్యాలను కూడా పంపవచ్చు. మీరు తీసిని అందమైన ప్రక్రుతి ఫోటోలను కూడా పంపవచ్చును. మీరు బ్లాగులో ప్రచురించదలచిన విషయాలను "బ్లాగులో ప్రచురణార్ధం" అని కాప్షన్ వ్రాసి 9848647145 కు వాత్సపు చేయగలరు
2) బ్లాగుకు మీ వంతు సహాయంగా ద్రవ్యాన్ని కూడా పంపవచ్చు. మీరు పంపే ద్రవ్యాన్ని9848647145 కు ఏదైనా UPI యాపు ద్వారా పంపవచ్చు. మీ సహాయ సహకారాలను అపేక్షిస్తూ ఉంటాము.
సదా హిందూధర్మ ప్రచారంలో
మీ
బ్లాగరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి