5, జూన్ 2024, బుధవారం

శనీశ్వర జయంతి

 *శనీశ్వర జయంతి + అమావాస్య + పంచగ్రహ కూటమి*

జూన్ 6 వైశాఖ అమావాస్య.  శనీశ్వర జయంతి మరియు పంచగ్రహ కూటమి. చాలా శక్తివంతమైన రోజు. ఆరోజు ఏ రాశి వారైనా ఏ జాతకం వారైనా శని భగవానునికి తైలాభిషేకం మరియు ఇతర గ్రహములు అందరికీ అభిషేకములు అర్చనలు చేయించుకోవడం వల్ల జాతక రీత్యా, గ్రహచార రీత్యా ఉన్న గ్రహ దోషములన్నీ తగ్గి అనుకూల శుభ ఫలితాలు కలగజేస్తాయి. 


ఏటా వైశాఖ అమవాస్య తిథినాడు శనీశ్వరుడి జయంతి నిర్వహిస్తారు. ఈ సంవత్సరం 06-06-2024 గురువారం రోజున వచ్చింది. ఈ రోజు శనీశ్వరుడిని ఈ క్రింది రాశుల వారు అర్చన, అభిషేకం చేయించుకోవటం మంచిది. జాతక చక్రములో ఏలినాటి, అర్ధాష్టమ, అష్టమ శని ఇలా మన జాతకంలో ఏ దోష ప్రభావం ఉన్నా దాని నుంచి కొంత ఉపశమ నం పొందాలంటే శనీశ్వరుడి అనుగ్రహాన్ని పొందడమే ఏకైక మార్గం. ఇందుకోసం శాస్త్రాల్లో పేర్కొన్న చిన్నపాటి తరుణోపాయాలను తప్పక పాటించాలి.

1. కుంభ రాశి వారికి ఏలినాటిశని కొనసాగుతోంది. 

ఇంకా 4 ఏళ్ళపాటు ఉంటుంది

2. మీన రాశి వారికి  ఏలినాటి శని జరుగుతున్నది.

3. మకర రాశి వారికి  2025 వరకు ఏలినాటి శని ఉంటుంది.

4. వృశ్చిక రాశికి  అర్ధాష్టమ శని 2025 మార్చి వరకు.

5. కర్కాటక రాశివారికి  అష్టమ శని 2025 మార్చివరకు .


నవగ్రహాలలో అత్యంత ప్రధానమైన గ్రహాం అందర్నీ ఎక్కువగా అనుగ్రహించే గ్రహం ఎక్కువగా భయపెట్టే గ్రహం కూడా శని భగవాన్ ఆయన యొక్క జయంతి మహోత్సవం వైశాఖ అమావాస్య.. శని భగవానుడు దయా హృదయుడు పిలవకుండానే వాలిపోతాడు. ఒక్కసారి ఎంట్రీ ఇస్తే పూర్తి కావాల్సిందే మనందరికి తెలుసు పిలవకుండానే వచ్చే దేవుడు గా ప్రతీతి శని దేవుడు. అటువంటి స్వామిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసా.నువ్వులంటే స్వామికి చాలా ఇష్టం చిటికెడు నువ్వుల నూనెకే పరవశించి పోతాడట శనిదేవుడు.అలానే పితృ దేవతలను స్మరించి వారి గుర్తుగా అన్నం పెడితే కరుణ చూపుతాడట *శని భగవానుడు నాడు పట్టెడన్నం పెడితే చాలు ఏలినాటి శని ప్రభావం దరి చేరదని పెద్దల మాట*, ఇంత చక్కటి అవకాశం జూన్ 6 వ తారీఖు మనందరికి కలగనున్నది అమావాస్య తో కూడుకున్న రోజు కావడం చాలా విశేషం అవకాశం ఉంటే శని జయంతి నాడు తైలాన్ని దానం చేద్దాం, ఇంకోమాట చెప్పాలంటే మనం దానం చేసే తైలం ఎన్ని గుళ్ళల్లో దీపాలు వెలిగించునున్నదో ఎంతటి అదృష్టమో మనం పరోక్షంగా గుడిలో దీపం పెట్టే అదృష్టాన్ని భగవంతుడు మనకు ఈవిధంగా కల్పించడం.అవకాశం ఉన్నంత వరకు శని దేవునికి ఇష్టమైన తైలాన్ని అందిద్దాం, పితృదేవతలకు ప్రీతిగా అన్న ప్రసాదం అందిద్దాం, శని దేవుని సంపూర్ణ అనుగ్రహానికి పొందుదాం.


 శని ప్రభావం తగ్గడానికి ఇదొక విశేషమైన శుభదినం.. ఈరోజు ప్రత్యేక శనీశ్వర హోమం మరియు నవగ్రహ హోమాన్ని నిర్వహిస్తున్నాము ఈ హోమంలో పాల్గొనేవారు 9347080055 నెంబర్ కు మీ గోత్రనామాల్ని పంపించగలరు


అదేవిధంగా శని జయంతి రోజు నువ్వుల నూనె దానం  ఏదైనా దేవాలయంలో దీపారాధనకు ఇది ఉపయోగించే లాగా ఇవ్వడం చాలా మంచిది


శని భగవాన్ అర్చన,అభిషేకం, పాశుపత అభిషేకం,దీపారాధనకు 1116, ఒక లీటర్ నువ్వుల నూనె 216


మనం సమర్పించే ఈ నువ్వుల నూనె తెలుగు రాష్ట్రాల్లో కనీసం ధూపదీప నైవేద్యాలకు నోచుకోలేని ఎన్నో ఆలయాలకి మనం దీపారాధనకు నువ్వుల ఇవ్వడం జరుగుతుంది..

కామెంట్‌లు లేవు: