5, జూన్ 2024, బుధవారం

శ్రీమన్నారాయణ మూర్తి

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝   *దద్యా ద్దయానుపవనో ద్రవిణాంబుధారాం*

        *అస్మిన్న కించన విహంగశిశౌ విషణ్ణే*

        *దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం*

        *నారాయణ ప్రణయినీ సయనాంబువాహః* (08)


               { _/  *కనకధారా స్తవం* _/ } 


తాత్పర్యం: చాతకపక్షిపిల్ల ఎండవేడిమికి తాళలేక తల్లడిల్లగా వాయుప్రేరితమై మేఘం వర్షించి ఆ పక్షికూన తాపంబాపి, వాన చినుకులచే దప్పికదీర్చి, తృప్తి కల్గించిన విధంగా, శ్రీమన్నారాయణ మూర్తి ప్రియురాలైన ఇందిరాదేవి యొక్క కటాక్షమనే కారుమబ్బు కారుణ్యమనే గాలిచే ప్రేరితమై బహుకాలార్జితమైన *దుష్కర్మ అనే తాపాన్ని దవ్వులకు తరిమి, ధనమనే వానగురిసి నేను అనే చాతక శిశువుకు సంతృప్తి కల్గించుగాక*!

కామెంట్‌లు లేవు: