🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
*శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర - 10*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
బాగుగా ఆలోచించిన వెనుక, బ్రహ్మ శివుడుండు వెండికొండకు వెడలినాడు బ్రహ్మరాకకు శంకరుడానందమును వ్యక్తమొనర్చుచు, ఆయనకు సకల మర్యాదలు చేసి, గౌరవించి, ఉచితాసన మలంకరింపజేసి
‘విధాతా! విశేషములేమైన నున్నచో నెఱిగించెదవా! అనెను.
అనగానే ‘‘శంకరా! భక్తవశంకరా! లక్ష్మీదేవి ఎడబాటు వలన శ్రీమహావిష్ణువు భూలోకమున శేషాచలమును చేరి ఒక పుట్టలో నివసించడము ప్రారంభించాడు. నిద్రాహారములు లేక శుష్కించి, శ్రీమన్నారాయణుడా పుట్టలో నున్నాడు.
ఉపవాసములతో ఆయన దినదినమునూ కృశించుచున్నట్లు నారదుని వలన తెలిసినది. కనుక మనమీ దశలో నారాయణునకు ఉపకారము చేయవలసియున్నది.
మన మిరువురమూఆవు యొక్క దూడయొక్క రూపములు ధరించి నారాయణుడున్నటువంటి పుట్టను చేరి ఆయనకు ఆహారముగా పాలనిచ్చిన, కొంతలో కొంత ఆయన కుపకారము చేసినవారమగుదుము’’ అనినాడు బ్రహ్మదేవుడు.
అది విని శంకరుడు ‘‘విధాతా! అంతకన్న మనకు కావలసినదేమున్నది? ఆపదయందున్నవారి నాదుకొనుటకన్న గొప్ప యగునదేమున్నది? అదియును గాక నారాయణుని పట్ల ఆ మాత్రము వ్యవహరించుట మనకు విధిగా నెంచుట తగును. నీ వనినట్లే చేయుదుము’’ అన్నాడు.
మన కార్యములు సాధించుటకు సంధానము చేయు వారలు ఎప్పుడూ కావలసియే వుండును గదా! అందువల్లనే బ్రహ్మ, శివుడూ యిద్దరూ సరాసరి భూమండలానికి వెళ్ళి కొల్లాపురము చేరినారు.
అచ్చట తపస్సు చేసుకొనుచున్న రమాదేవిని దర్శించి ‘‘అమ్మా కోపము చాలా చెడు వస్తువు సుమా! చూడు నీవు విష్ణువు పై కోపగించి భూతలానికి వచ్చేసిన కారణముగా పండంటి మీ సంసారములో కలతల అగ్ని కణాలు రేగాయి,
అవి మీ సంతోషాన్ని దహించివేశాయి. విష్ణువు విషయము నీకు తెలిసిందా అమ్మా ఆయన యిప్పుడు మునుపటివలె కళాకాంతులతో చిరునవ్వులు చిందించే విష్ణువు కాదు. దైన్యదశలోనున్నాడు.
నీకై క్షణమొక యుగముగా భూతలమునకు వచ్చి వెదకుచూ వెదకి వెదకి వేసారి శేషాద్రిచేరి, అక్కడున్న ఒక పుట్టలో తలదాచుకొని నిద్రాహారములు లేక దిగాలు పడి శుష్కించి శుష్కించి వున్నాడు.
ఆయన కెట్లయిననూ ఆహారము నందించవలెననీ మా కోరిక, ఇందుకై నీవు చేయవలసిన ఉపకారము ఒకటి లేకపోలేదు. మేము ముగ్గురము ఆనందించవలెననీ మా కోరిక, ఇందుకై నీవు చేయవలసిన ఉపకారము ఒకటి లేకపోలేదు. మేము యావుదూడల రూపములు ధరించెదము నీవు గొల్లభామ వేషం ధరించి ఆవు దూడలమయిన మమ్ము తోలుకొని చోళరాజునకు అమ్మవలెను.
ప్రతిదినమూ ఆ చోళరాజు యొక్క మందతో కలసివెళ్ళి మేము పుట్టలో నున్న శ్రీమహా విష్ణువునకు క్షీరాహారము నిచ్చుట ప్రారంభించెదము,
కనుక మా కోరిక మన్నించవలెనని అన్నారు. విధాత, శంకరుల మాటలకు లక్ష్మీదేవి వెనువంటెనే సమ్మతించినది.
*అనాధ రక్షక గోవిందా, ఆపద్భాంధవ గోవిందా, కరుణాసాగర గోవిందా,* *శరణాగత నిదే గోవిందా; |*
*గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా* *గోవిందా* .||10||
*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం 🙏*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి