6, ఆగస్టు 2023, ఆదివారం

🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 3*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 3*


దుడుకు, అల్లరి  బాలుడు నరేంద్రుడు. అతడిలో సదా చిలిపితనం చిందులాడేది. ఒకింతసేపు కూడా అతడు ప్రశాంతంగా ఉండేవాడు కాడు. అతణ్ణి అదుపులో ఉంచడం అసాధ్యం. ఎలాంటి గదమాయింపుతోను అతణ్ణి శాంతింపజేయడం కుదరనిపని. 


భువనేశ్వరి విసిగివేసారి "సాక్షాత్తు పరమేశ్వరుడే నాకు కుమారునిగా జన్మించాలని వరం కోరుకొంటే, ఆయన తన భూతగణాలలో ఒకదాన్ని పంపించాడు" అని వాపోవడం కద్దు. అతణ్ణి శాంతింప జేయడానికి ఒక్కటే దారి! 'శివ శివ' అంటూ తలమీద చన్నీరు కుమ్మరించడమే! మరుక్షణమే అతడి అల్లరి అణగిపోయేది. 


అతడి అల్లరితో విసిగిపోయే భువనేశ్వరి ఒక్కోసారి, "ఇదుగో చూడు బిలే! ఇలా అల్లరి పిల్లవాడిగా తయారయ్యావంటే పరమేశ్వరుడు నిన్ను కైలాసానికి రానివ్వడు" అని బెదిరించగానే నరేంద్రుడి అల్లరి మటుమాయమయ్యేది. 


అంతేగాక, "పరమేశ్వరా! ఇకమీదట ఇలా ప్రవర్తించను.ఈ ఒక్కసారికి మాత్రం క్షమించు" అని పరమేశ్వరుణ్ణి ప్రార్థించేవాడట.అతణ్ణి చూసుకోవడానికి ఇద్దరు దాదులను నియమించిన అల్లరి అట్లే కొనసాగేది.


తల్లి ఒడిలోనే బిడ్డ విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టబడుతుంది. తల్లి పాలు పాటు ఆమెలోని సద్గుణాలూ, ఉన్నతాదర్శాలూ గ్రోలడమే బిడ్డకు విద్యాభ్యాసం పరిణమిస్తుందనడం అతిశయోక్తి కాదు. తల్లి తన బిడ్డను పెంచే తీరు అతడి భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రధానపాత్ర వహిస్తుంది. నరేంద్రుడి తల్లి అతడికి గరపిన సాటిలేనిది. "జీవితంలో నేను సాధించినవన్నింటికీ ఋణపడివున్నాను" అనేవారు కాలాంతరంలో స్వామి వివేకానంద. 


భారతీయ సంస్కృతిలోని దేవీదేవతల, ఋషుల, వారి త్యాగమయ జీవితాల, ఇతిహాస నాయకులను గూర్చి కథల ద్వారా, పాటల ద్వారా భువనేశ్వరీదేవి నుండి నరేంద్రుడు విన్నాడు. ముఖ్యంగా ఆమె చెప్పిన రామాయణ, మహాభారతం కథలు అతడి హృదయంలో చెరిగిపోని ముద్రవేశాయి. తన బామ్మ, ఆమె వద్ద అనేక భాగవత కథలు కూడా నరేంద్రుడు విన్నాడు.


రోజూ ఇంట్లో మధ్యాహ్నంపూట రామాయణ మహాభారతాలు పారాయణ చేసేవారు. ఆ సమయాల్లో కూడా తన చిలిపిచేష్టలు కట్టిపెట్టి నరేంద్రుడు ప్రశాంతంగా కూర్చుని వినేవాడు.🙏

*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: