ఉత్తములకే కష్టాలు ఎందుకు వస్తాయి.
మానవుడికి అతడి మొత్తం జన్మల రూపం సంచిత కర్మ...
అందులో ఒక జన్మ కి కేటాయించిన కర్మ ప్రారబ్ధ కర్మ.
మనకు సందేహం వస్తుంది మనకి ఇంకా ఎన్ని జన్మలున్నాయి ..అని..గతంలో చేసుకున్న కర్మల కారణంగా , ఆ కర్మలన్నీ తీరి పోవడానికి మరొక 100 జన్మలు అవసరం అవుతాయని అనుకుందాము.
అతడి కర్మలను బట్టి, ఈ రాబోయే జన్మల సంఖ్య ఒక్కో మానవుడికి ఒక్కో విధంగా ఉంటుంది..
రాబోయే జన్మ ల సంఖ్య లెక్క ఇప్పటి వరకు నిర్ధారించబడింది..ఆంటే. ఇప్పటి వరకు ఉన్న రుణాలు కొన్ని నిర్ధారితం జన్మలలో తీరుతాయి అని అర్ధం...
ఆంటే అది Bank loan Installment భాషలో ఇన్ని EMI లు ఉన్నాయి అని అర్ధం.
ఇక నుండి మనం కొత్త కర్మలు లేదా కొత్త రుణాలు చేయకపోతే.!
వ్యాధులు బాధలు కష్టాలు, శత్రుత్వాలు అప్పులు అన్నీ కర్మ ఋణాలే. ఇవన్నీ సహజంగా కాలగతి లో సమయాన్ని అనుసరించి వచ్చి , తీరిపోతాయి.
వీటిని భరించలేక మనం చేసే ప్రయత్నాల వలన కర్మలు అనుభవించవలసిన కాలం పెరిగి, ఆంటే మన జన్మ ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది..ఆంటే EMI లు పెరుగుతాయి.
భగవంతుడిని ప్రార్ధించి కొన్ని వ్యాధులు కొన్ని కర్మలని సమయం కన్నా ముందే పోగొట్టుకోవలనే తీవ్ర ప్రయత్నం వలన , ఆ కర్మలు ప్రస్తుత జన్మ లో అదృశ్యం అయి , తిరిగి వచ్చే జన్మలో నిర్ధారత సమయం వరకు వేధిస్తాయి..
ఈ కారణంగానే జ్ఞానులు, యోగులు. ఉత్తములు, కర్మలను త్వరగా అనుభవించేయాలని చూస్తారు..
ఇంక ఎన్నాళ్ళు మరో జన్మ ? "ఇంక జన్మ వద్దు మోక్షం కావాలి " అనుకునే వారు, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి, నేను ఎవరూ అనే విచారణ చేయాలి, దానికన్నా ముందుగా కర్మ అంటే ఏమిటో తెలుసుకుందాం!కర్మ అంటే ‘విధి’ కాదు. karma is not fate!ఈ రెండిటికీ చాలా తేడా ఉంది. కర్మ అనేది ఒక పని.అది మనంతట మనం కల్పించుకున్నదే!అది మంచిది కావచ్చు లేదా చెడ్డది కావచ్చు! అంటే కర్మ వేరు, కర్మ ఫలం వేరు. కర్మ అంటే మనం ఉదయం లేచిన దగ్గరనుండి రాత్రి పడుకునే వరకు మనం చేసే పనులన్నీ కర్మలే.కర్మ సిద్ధాంతం గురించి చెప్పేటప్పుడు గత జన్మ ఒకటుందని,మరణించిన తర్వాత మరొక జన్మ ఉంటుందని నమ్మి తీరాల్సిందే!అయితే,నేను దీన్ని గురించి ఇంకా డోలాయమాన పరిస్థితిలోనే ఉన్నాను.ఇంకా నాకు ఒక నిశ్చితమైన అభిప్రాయం ఏర్పడలేదు.అందుకే నా కొన్ని వ్యాసాల్లో భిన్నమైన అభిప్రాయాలు కనపడుతుంటాయి. అర్ధం చేసుకున్నవారు accept చేస్తారు. అర్ధం చేసుకోనివారు నిలకడలేని మనిషిగా నన్ను భావిస్తుంటారు. నిజానికి నేను కోరుకునేది కూడా ఈ నిలకడలేని స్థితినే! మనం వృక్షాలలాగో, కొండలలాగో ఒకేచోట ఉండలేం,ఉండకూడదు కూడా! మానవ జీవితం నిత్యం ప్రవహించే ఒక చైతన్య స్రవంతి లాగా ఉండాలి. దానితో పాటు మనం కూడా అన్ని చోట్లా తిరుగుతూ నిత్యం ప్రవహించాలి. అప్పుడే జీవితం చైతన్యవంతం అవుతుంది.ఎన్నో విషయాలు అనుభవంలోకి వస్తాయి.సందర్భం వచ్చింది కనుక ఇదంతా చెప్పక తప్పలేదు.మరణానంతరం జీవితం ఉందా, లేడా అనే సందేహం నన్ను కొంతవరకు పీడిస్తుంది. ఈ రెండు భిన్నమైన అభిప్రాయాల ఘర్షణలో మనసు తీవ్రమైన అన్వేషణ ప్రారంభించింది. ఈ అన్వేషణలోనే నాకు ఏది సత్యమో బోధపడుతుందని నా విశ్వాసం. అది నా అంతట నేను తెలుసుకోవలసిన సత్యమే!దీన్ని గురించి ఎవరో చెప్పింది నమ్మటానికి ఇష్టపడను.ఎందుకంటే అది వారి నమ్మకం మాత్రమే,అది సత్యం కాకపోవచ్చు!నమ్మకాలు సత్యాలు కావు. సత్యాన్ని ఎవరికి వారే అన్వేషించి కనుక్కోవాలి!నాలో పేరుకుపోయిన కొన్ని నమ్మకాలు కొన్నిటిని నమ్మటానికి అంగీకరించటం లేదేమో!ముందుగా ఆ నమ్మకాలనుండి నేను విముక్తుడిని కావాలి. దీనికి సాధన అవసరం. కర్మ సిద్దాంతము ప్రకారము జీవుడు పుట్టడానికి మునుపు ఆ జీవి కొంత కర్మ చేసుండొచ్చు, ఆ కర్మఫలం అతను ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తాడు. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మ లాగే మరో జన్మని కూడా పొందొచ్చు!కర్మ సిద్దాంతాన్ని నాస్తికులు, భౌతిక వాదులు నమ్మరు.అబ్రహమిక్ మతాల (యూదు మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం) ప్రకారం మనిషి చేసే ప్రతిచర్య భగవంతుని సంకల్పాలే. భగవంతుడే వారి చేత చేయించాడని వారి నమ్మకం. విధిరాతనే వారు
కర్మగా భావిస్తారు.హిందూ మతం ప్రకారం మనిషి ఆధీనంలో కర్మ మరియు భగవంతుని ఆధీనంలో కర్మ ఫలం ఉంటాయి. ఈ వ్యత్యాసం ఎరుగక కొందరు కర్మని విధి నిర్ణయం (fate) గా పొరబడతారు.మనం పుట్టిన దగ్గర నుండి చనిపోయేవరకు కర్మలు చేస్తూనే ఉంటాం! చేసే ప్రతి కర్మకు ఫలితం వస్తుంది. మనం చేసే ప్రతి కర్మ కూడ ఏదో ఒకనాడు ఫలితాన్నిస్తుంది.మనిషి చేసిన కర్మలకి అనుభవించే ఫలితాన్ని కర్మఫలం అంటారు.పాప పుణ్యాలు చేసేది మనుషులే! అందరూ అనుకున్నట్లుగా దేవుడు వాటిని చేయించడు. దేవుడు కేవలం కర్మ ఫలాన్ని మాత్రమే నిర్ణయిస్తాడు. మనము చేసే ప్రతి కర్మకు ఫలితమనేది ఉంటుంది. మంచి పనిచేసినంత మాత్రాన మంచి ఫలితం రాకపోవచ్చు. అది ఎలానంటే ,నోములు నోచి సంతానాన్ని పొందితే ,ఆ పుట్టిన కొడుకు దుర్మార్గుడు కావచ్చు!మంచి పని చేస్తేనే దుష్ఫలితం వస్తే, ఇక చెడ్డ పని చేస్తే వచ్చే ఫలితాన్ని గురించి చెప్పేదేముంది! కొందరికి మంచి సంతానం కలుగుతుంది, కొందరికి బిడ్డలు చనిపోతారు, కొందరికి సంతానమే ఉండదు! ఇలాంటి తేడాలు, తారతమ్యాలకు కారణం ఈ కర్మ సిద్దాంతమేనని చెప్పవచ్చు.అన్ని ప్రాణులు,మనుషులు జీవించటానికి ప్రాణమే మూలం . అది అన్నింటిలో సమానంగా ఉంటుంది, కానీ చూడటానికి అవి భిన్నంగా గోచరిస్తాయి. అయితే బాహ్యంగా అవి భిన్నంగా ఎందుకున్నాయి?ఆయా జీవుల సంచిత కర్మ ఫలాన్ని బట్టి జీవులు ఒకరికొకరు భిన్నంగా అనిపిస్తారు. ఆ దేహాలకు తగినట్లుగానే వాటి (వారి) లక్షణాలు ఉంటాయి. పులి మాంసం తింటుంది, పంది అమేద్యం తింటుంది. మనిషి రుచికరమైన ఆహారాన్ని తీసుకుంటాడు.జీవుల దేహ స్వభావమే అంత. ‘జీవి’ ఏ శరీరంలో ఉంటే దానికి ఆ లక్షణం వస్తుంది. ఇది సృష్టి ధర్మం. దీన్ని దేహ ప్రారబ్ధం అంటారు. దేహప్రారబ్ధ ఫలమే జన్మకు కారణం. ఈ దేహ ప్రారబ్ధమును అనుభవించకుండా ఎవరూ తప్పించుకోలేరు. అందుకే ప్రాణులు జనన మరణ చక్రంలో పడి తిరుగుతుంటాయి . కొన్ని కారణాలు కలిసి ఒక కార్యం జరుగుతుంది.మట్టిని సేకరించే పనినుండి,ఆ మట్టి నుండి కుండ తీసేవరకూ జరిగినదంతా కర్మే. కుండ ఏర్పడ్డాక , ఆ కుండను నిర్మించడానికి అవసరమైన ఏ కారణంతో ఆ కుండకు పనిలేదు. అంటే, కుండ ఏర్పడ్డంతోనే ఆ పని పూర్తయింది.
ఉత్తములు తమ కోరిక కి అనుగుణంగా, వారు మోక్షానికి వెళ్లి పోవడానికి, వారికి రాబోయే జన్మలన్నింటి కర్మలని ఇప్పుడే ఆనుగ్రహిస్తారు..
ఆత్మజ్ఞానం కలగాలంటే 3 మెట్లు ఎక్కాలి ...
1, భక్తి మార్గం,
2, కర్మ మార్గం,
3, జ్ఞాన మార్గం ...
ఈ ప్రయాణం లో, ముఖ్యంగా వైరాగ్యముతో, నిష్కామ ఖర్మలను ఆచరిస్తూ ఉండాలి.
విపరీతంగా వ్యాధులు, అవమానాలు తిరస్కారాలు అప్పులు,ఇంట, బయట దుర్భరస్థితి ఏర్పడుతుంది.
మీరు గమనించవచ్చు...ప్రపంచం లో మహాత్ములందరికీ ఇదే స్థితి....
రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, జ్ఞానదేవ్ మహరాజ్, బుద్ధుడు, మీరాబాయి, వివేకానందుడు ... ఇలా ఎవరి చరిత్రలు చూసినా మనకు అర్థం అవుతుంది...
వీరంతా త్వరగా మోక్షం ఇప్పించు ప్రభు..అని వేడుకున్న వారే...
వీరు భగవంతుడిని నిరంతరం మనస్సులో నిలిపుకుని...
ఆవేదనలు అనుభవించారు, సక్కుబాయి
తుకారామ్ ,మీరా, ఎవరైనా ఇలాగే కర్మలు త్వరగా అనుభవించారు...
మీరు. "ఈ కష్టాలు బాధలు అనుభవించడం మా వల్ల కాదు " అన్నారో. మన జన్మల EMI లు పెరిగిపోతాయి. మహాత్ములు భక్తులు యోగులు ఎక్కువగా కష్టాలు పడటానికి కారణం ఇదే..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి