6, ఆగస్టు 2023, ఆదివారం

విద్యా మిత్రం

 శ్లోకం ☝️

విద్యా మిత్రం ప్రవాసేషు భార్యా మిత్రం గృహేషు చ 


వ్యాధితస్యౌషధం మిత్రం ధర్మోమిత్రం మృతస్య చ


Meaning:


Knowledge is a friend during travel in foreign places. Wife is a friend in home. Medicines are the friends during illness and our good deeds (Dharma) are friends after death by which others remember us fondly!


తాత్పర్యం:


విదేశాలలో ఉన్నప్పుడు తన విద్యయే మిత్రుడు. ఇంటిలో ఉండే మంచి మిత్రురాలు తన భార్యయే, రోగం తో బాధపడే వానికి సరియైన ఔషధమే మిత్రుడు, చనిపోయిన వానికి అతని ధర్మమే అతనికి మిత్రము.


ప్రవాసాలలో ఉండే వారికి, విదేశాలలో ప్రయాణాలు చేసే వారికి నిజమైన స్నేహితుడు,  వారి యొక్క చదువు,  ఆ చదువు ద్వారా సమకూడిన జ్ఞానము, ఆ విద్యా సంపత్తితో వచ్చిన వినయ విధేయతలు మాత్రమే నిజమైన స్నేహితుడు. విద్య అనే ఆ మిత్రుడే అన్ని విధాలా సహాయకారి కాగలడు.


ఆచార వ్యవహారాలలోనూ, గృహకార్యాలలోనూ, కుటుంబ బాధ్యతలని సక్రమముగా నిర్వర్తించుటలోనూ కుటుంబ యజమాని అయిన భర్తకి  సర్వ విధాలా చేదోడు వాదోడుగా ఉండే భార్య, సర్వదా అన్నిటా ఇంటిలో ఉండే మిత్రుడు భార్య మాత్రమే.


వ్యాధిగ్రస్తుడైన వానికి ఆ వ్యాధి నివారణని చేయగలిగే మంచి ఔషధమే సరియైన మిత్రుడు.


జాతస్య మరణం ధృవం. పుట్టిన ప్రతి మనిషీ కూడా చనిపోవలసిన వాడే. అయితే, ఆ మనిషితో కూడా వెళ్ళగలిగేవి ఈ ప్రాపంచికమైన ఏ సంపదా కూడా కాదు. బంధుమిత్రాదులు, స్నేహితులూ ఎంతమాత్రమూ కాదు. తాను బ్రతికి ఉండినప్పుడు చేసిన ధర్మకార్యాలూ, మానవాళికి చేసిన ఇతరత్రా మంచి పనులు, తోటి జీవ జాలానికి చేసిన సహాయ సహకారాలూ మాత్రమే ఆ వ్యక్తిని కలకాలం గుర్తుపెట్టుకునేలా చేస్తాయి.


ఆ ధర్మం మాత్రమే అతని నిజమైన స్నేహితుడు, చనిపోయిన తరువాత తనతో కూడా వచ్చే మిత్రుడు.

కామెంట్‌లు లేవు: