అరుణతార.
ఎర్రసూరీడు వాలిపోయాడు
గొంతు మూగబోయేను
నల్ల గొంగళి జారి పోయేను
చేతి కర్ర పట్టు జారేను
నేలన మాయమయ్యే
విప్లవ తార నింగి జేరే
పోరాటం కానరాకనే
పాట,ఆట కన్నీరయ్యే.
పిక్కటిల్లే స్వరం ఆగే
యుద్ధనౌక కనుమరుగై
పీడిత ప్రజల ధైర్యం పోయే
ఎర్ర చుక్క గగనాన చేరే..
ఉద్యమ గొంతు ఆగిపోయింది
హక్కుల గానం మాయమైంది
ఎర్రని సూరీడు కనుమరుగై
గానం, రాగం ఇక నిద్రించే..
పోరుకి సరికొత్త రూపు
వెలుగు నడిచిన తీరు
పోరాట చుక్కల చేరు
ఆట, పాటే అతని పేరు.
నల్ల గొంగళి ధరించి
చేత కర్ర పట్టి
స్వరం పిక్కటిల్లే
అడుగు వేసే..
అన్యాయం రాజ్యమేలే చోట
అకృత్యం బరితెగించిన వేళ
నిస్పృహాన కన్నీటీ మనిషికి
నేనున్నా అనే ఎర్ర బావుటా.
అతడే "గద్దర్"!.
గద్దర్ మరణం
సమాజానికి, బాధిత పీడిత వర్గాలకు తీరని లోటు.
అశృతర్పణాలతో అరుణతారకు అంతిమ వీడ్కోలు..
అశోక్ చక్రవర్తి. నీలకంఠం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి