శ్రీమాత్రేనమః *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*
*41వ నామ మంత్రము*
*ఓం ఐం హ్రీం శ్రీం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభి జంఘికాయై నమః*ఎర్రని రంగులో ఉన్న ఆరుద్ర పురుగులచే చుట్టూ చెక్కబడిన మన్మథుని అమ్ములపొదుల బోలిన జంఘికలు (పిక్కలు) గలిగిన జగదాంబకు నమస్కారముశ్రీలలితా సహస్ర నామావళి యందలి *ఇంద్రగోప స్మరతూణాభి జంఘికా* అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం ఐం హ్రీం శ్రీం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభి జంఘికాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ పరమేశ్వరుని పూజించు భక్తులకు అనంతమైన సుఖసంతోషములు, భౌతికానందముతో బాటు బ్రహ్మానందమును ప్రాప్తించునుమోక్షమునిచ్చి రక్షించేది మరియు స్మరణ మాత్రముచే కోరికలను పూరించు ప్రకాశావిర్భావము గలిగినది శ్రీమాత శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో 83వ శ్లోకంలో అమ్మ జంఘికలను ఇలా చెప్పారు
*పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే*
*నిషజ్గౌ జజ్ఘే తే విషమవిశిఖో బాఢమకృత||*
*యదగ్రే దృశ్యంతే దశ శరఫలాః పాదయుగళీ*
*నఖాగ్ర చ్ఛద్మాన స్సురమకుటశాణైకనిశితా ||83||*
గిరిసుతా! ఈశ్వరుని గెలుచుట కొఱకు మన్మధుడు నీ పిక్కలను పదేసి బాణములున్న అమ్ముల పొదులుగా చేసికొనెను. (ఎందుకంటే మన్మధుని దగ్గర ఉన్న ఐదే బాణాలు చాలవని). వాని చివరల నీ గోటికొనలనెడు బాణాగ్రములు (ములుకులు) కనుపించుచున్నవి. ఆ బాణాగ్రములు (అమ్మవారి పాదములకు మ్రొక్కుచున్న) దేవతల కిరీటములచే పదునుపెట్టబడియున్నవి.
ఇంద్రగోప (ఆరుద్ర పురుగులచే), పరిక్షిప్త (చుట్టును అమర్చబడిన) స్మర - తూణ (మన్మథుని అమ్ములుపొదుల వంటి), జంఘిగా (పిక్కలు గలిగిన తల్లీ)వర్షాకాలములో ఆరుద్ర కార్తెయందు వ్యవసాయ భూములలో ఆరుద్ర పురుగులు పుట్టుకొస్తుంటాయి. అవి ఎర్రగా ముక్కమల్లు గుడ్డవలె చిన్నవిగా ఉంటాయి. వర్షంలో ఆవి చావకుండా వర్షాధిపతి ఇంద్రుడు కాపాడుతాడనియు, అందుకనే వీటికి ఇంద్రగోపములనియు పిలుస్తారు. అటువంటి ఎర్రని ఇంద్రగోపములు మన్మథుని బాణతుణీరమునకు చుట్టూ అమర్చబడి అందంగా ఉంటాయట. అటువంటి అమ్ముల పొదులను బోలి అందముగా శ్రీమాత జంఘికలు (కాలి పిక్కలు) అని వశిన్యాదులు వర్ణించారుపరమేశ్వరి వరుణ తేజముతో ఆవిర్భవించెను. ఇంద్రగోపములు అనగా మంత్రములోని బీజాక్షరములు అని రహస్యార్థము. తూణము (తూణీరము) అనగా మంత్ర సముదాయము. తూణమునందు ఉండే బాణములచే మంత్రములు సూచితమైనవి. దేవి జంఘికలు మహావర్ణ సంపుటికలు అని తెలియదగును. స్మర శబ్దము సగుణ బ్రహ్మయు, ప్రపంచ సృష్టికర్తయు అయిన పరమేశ్వరునకును - తూణా శబ్దము మాయా శక్తికిని బోధకములు అగునుశ్రీమాతకు నమస్కరించునపుడు *ఓం ఐం హ్రీం శ్రీం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభి జంఘికాయై నమః* అని అనవలెనుఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* అనుగ్రహముతో, వారి విరచితమైన *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ* అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనదినేడు గురు (బృహస్పతి) వారము🔯🔯🔯గురువారమునకు అధిష్టాన దేవత గురుడు (బృహస్పతి) అందుకే గురువారమును బృహస్పతివారముగురువారమునకు పసుపురంగు మంగళప్రదం🔯🔯🔯గురువారం లక్ష్మీప్రీతికరం గనుక గురువారాన్ని లక్ష్మివారం అనికూడా అంటారుశుక్రవారంకూడా లక్ష్మీప్రీతికరమే ఎందుచేతనంటే శుక్రవారానికి అధిదేవత శుక్రుడుశుక్రుడు భృగువంశస్థుడు అదేవిధంగా లక్ష్మీదేవి కూడా భృగువంశమునకు చెందినది గనుక శుక్రవారము కూడా లక్ష్మీప్రీతికరముఇదేరోజున సాయినాథుని అర్చించుతాము అలాగే శ్రీగురు దత్తాత్రేయ స్వామిని కూడా ఆరాధిస్తాము🕉🕉🕉ఓం శ్రీగురు దత్తాత్రేయ స్వామినే నమఃఓం శ్రీ సద్గురు సాయినాథాయ నమః🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి 7702090319
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి