కందిపప్పు రేటు విని గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు.
డెత్ సర్టిఫికెట్లో చావు కారణం ఇలా వ్రాసారు *"పల్స్ రేటు ఎక్కువయి"*
ఒక గుడిలో ఒక గాడిద ఉండేది ... జనాలు దేవుడికి పూజలు చేయడం చూసి ఇది కూడా మొదలెట్టింది ....
దీని పుజలకి మెచ్చి దేవుడు ప్రత్యక్షం అయ్యాడు ..
*దేవుడు :* ఎమ్ కావాలో కోరుకో ?
*గాడిద :* తర్వాత జన్మలో కూడా నన్ను గాడిద లానే పుట్టించు సామీ .....
*దేవుడు :* రెండు జన్మల్లో ఒకేలా పుట్టించడం కుదరదు ..ఇంకేదైనా కోరుకో ...
*గాడిద :* సరే నన్ను ' భర్త ' గా పుట్టించు....
*దేవుడు :* ఎదవ తెలివితేటలు చూపించమాకు నా దగ్గర ... ఒకేలా రెండు సార్లు పుట్టించడం కుదరదని చెప్పానా........
నెలరోజుల కోసం పుట్టింటికెళ్లిన రమ్య మూడ్రోజుల్లోనే తిరిగొచ్చి తలుపు తట్టింది..
తలుపు తీసిన భర్త సుబ్బారావు..పకపకా నవ్వుతుండడం చూసి ఆశ్చర్యంగా అడిగింది.
"దేనికలా నవ్వుతున్నావ్..?"
"ఏం లేదు..మన పెద్దలు చెబుతుంటారుగా..భయంకరమైన సమస్య వచ్చినప్పుడు నవ్వుతూ ఎదురెళ్ళాలని.. అందుకే."
వైఫ్ షాక్..హస్బెండ్ రాక్..
ఓ వ్యక్తి ఓ రోజు భార్యతో కలిసి షాపింగ్‌కు వెళ్లాడు. అక్కడ ఓ అమ్మాయి అతన్ని చూసి హల్లో చెప్పింది.
అప్పుడు భార్యాభర్తల మధ్య సంభాషణ ఇలా సాగింది.
*భార్య:* ఆమె ఎవరు...
*భర్త:* మాట్లాడకు.. వింటే ఇబ్బంది.. ఆమె కూడా అదే ప్రశ్న వేస్తుంది..
అత్త "శివగామి" Vs కొత్త కోడలు"దేవ సేన"
అత్త "శివగామి".... ఇంట్లో వాళ్ల అలవాట్లూ .. జాగ్రత్తలు కొత్తకోడలుకి .... చెబుతోంది
"ఇదిగో చూడు కోడలా.... పకోడీలు వేసేటప్పుడు.... ఒక్కొక్క పకోడీ వేసి వేయించాలి .... అప్పుడే మీ మావ గారికి ఇష్టం!!!
" బెండకాయలు తరిగే ముందు.... ఒక్కొక్క బెండకాయా బాగా కడగాలి.... అప్పుడే కూర బాగుంటుంది !!!
" కొత్తిమీర ... ఒక్కొక్క ఆకూ కోసాక ... బాగా కడిగి ... వెయ్యాలి ... అప్పుడు కూర రుచిగా వుంటుంది "
అలా రెండు మూడు రోజులు కోడలు ... ఈ అత్త నసని ఓపికగా విన్నది .... ఓపిక పట్టింది!!!
నాలుగో రోజు...
"అత్తా....కొంచెం కూర చూస్తూ వుండండి ... తలస్నానం చేసి వస్తాను" అని బాత్రూమ్ లోకి దూరింది !!
కూర తయారయ్యింది ......
సాంబార్ తయారయ్యింది .....
చట్నీ చెయ్యడం తయారయ్యింది.....
కానీ కోడలు "దేవసేన" మటుకు ఇంకా బాత్ రూమ్ నుండి బయటకు రాలేదు!!!
అత్త "శివగామి" లో సహనం చచ్చిపోయింది!!!
బాత్రూమ్ దగ్గరకు వెళ్లి....
"ఎం!? ఇంకా స్నానం చేస్తున్నావా .... లేక నిద్ద్రోతున్నావా? " అంటూ గట్టిగా ఓ అరుపు అరిచింది!!
కోడలు దేవసేన అమాయకంగానూ వినయంగానూ "అయ్యో రామా ... స్నానం చేస్తున్నాను అత్తయ్యా ... తలమీద ... ప్రతి వెంట్రుకా జాగర్తగా విడదీసి తీసి .... షాంపూ పెడుతున్నాను... ఇలా స్నానం చేస్తే మంచిదని .... మీ అబ్బాయి చెప్పారు మరి"!!
అత్త షాక్ ...కోడలు రాక్...
బ్యాంక్ లో గోడకి ఒక సూచన తగిలించారు ...
" వేలిముద్ర వేసేవాళ్లు , ముద్ర వేసిన తరువాత ఆ సిరాను తుడుచుకోవడానికి గోడను ఉపయోగించరాదు " అని ...
అక్కడ నాలాంటి తింగరోడు ప్రతిస్పందన ...
" ఓరి సన్నాసుల్లారా ..! అది చదవడమే వస్తే , వేలిముద్రలు ఎందుకు వేస్తార్రా ..!? " అని ...
" Point to be noted " కదా ...
*పేషంట్:* ‘’ డాక్టరు గారూ,నేనుఎప్పుడూ అతి సంతోషంతో ఉంటాను.నిద్ర బ్రహ్మాండంగా పడుతుంది.అన్ని పనులూ చాలా శ్రధ్ధగా మనసు పెట్టి చేస్తుంటాను. మిగతా వాళ్ళను చూస్తుంటాను. అందరూ ఏ పని చెయ్యాలన్నా ఎంతో ఆదుర్దా పడిపోతుంటారు. అనవసర భయాలు పడుతుంటారు.
నేను మాత్రం ఎటువంటి ఆందోళనా పడను. ఎంతో ఉత్సాహంగా ఉంటాను. నేనే ఎందుకలా ఉంటాను?ఇదేమీ జబ్బు కాదు కదా? ‘’
*డాక్టరు:*’’మీ పరిస్థితి అర్ధం చేసుకున్నాను.మీకు జీవితంలో విటమిన్ ‘’SHE’’ తక్కువైంది. అది పడితే మీరూ మిగతావాళ్లలాగే నార్మల్ అయిపోతారు.
ప్రతీది వాట్సాప్ లో పోస్ట్ చేయడం కామెంట్స్ కోసం ఎదురు చూడడం ఫ్యాషన్ అయిపోయింది........
ఆ మధ్య ఒకాయన ఓ పోస్టుపెట్టి కాసేపటితర్వాత *''డిలీట్''* చేసాడు.కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఆయన పెట్టిన పోస్టు ఏమిటో తెలుసా?
''గత నెలలో వారింట్లో జరిగిన రెండు తద్దినాల తాలూకు ఫోటోలు''
ఓ గంట తర్వాత వచ్చిన కామెంట్స్ చూసి చిర్రెత్తు కొచ్చి పోస్టు తొలగించేశాడు. ఏం కామెంట్స్ వచ్చాయో ఓసారి చూద్దాం.
1.హేపీ తద్దినం.
2.తద్దినం శుభాకాంక్షలు.
3.నిత్యం మీ ఇల్లు తద్దినాలతో కళకళలాడాలని ఆకాంక్షిస్తున్నా.
4.మీ ఇంట్లో తద్దినం మా కెంతో ఆనందం.
ఇవన్నీ చూసి చిరాకుతో పోస్టు తొలగించేశాడు.
ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి ప్రముఖ సైకియాట్రిస్ట్ విచ్చేసారు ఒక వార్డ్ లోకి వెళ్ళారు.
అక్తడ ఒక పేషేంట్ చిరిగిన బట్టలు, చింపిరిజుట్టుతో ''ప్రియా!! ప్రియా!! అని అరుస్తున్నాడు.
డాక్టర్ తన అసిస్టెంట్ ని అడిగారు.
ఇతని ప్రాబ్లం ఏంటి? అని
అసిస్టెంట్: సార్ ఇతను ప్రియా అనే అమ్మాయి ప్రేమించుకున్నారు.
కాని ప్రియకి వేరేవాడితో పెళ్ళయ్యింది అందుకే పిచ్చోడై ఇలా అరుస్తున్నాడు.
మల్లీ డాక్టర్ ఇంకో వార్డ్ లోకి వెళ్ళారు.
అక్కడ ఇంకో పేషేంట్ చిరిగిన బట్టలు చింపిరిజుట్టుతో
''ప్రియా!! ప్రియా!! అని అరుస్తున్నాడు.
డాక్టర్ : ఇదేంటి తనూ ప్రియా అనే అరుస్తున్నాడు.
అసిస్టెంట్: ప్రియని పెళ్ళి చేసుకుంది ఇతనే సార్.
ఒక చోట ఆడవాళ్లంతా లైన్లో నుంచుని ఓ ముష్టివాడికి అన్నం, డబ్బులు వేస్తూ అతనికి ఫోన్ నెంబర్లు ఇస్తున్నారు.
అటుగా వెళ్తున్న సోము.. ఆ లైన్లో తన భార్య కూడా ఉండటం చూసి, ఏం జరుగుతుందే అక్కడ అని భార్య వాసవిని అడిగాడు.
వాసవి : అబ్బే, ఏం లేదండి.. ఈ రోజు దానం చేసేవాడికి మన ముష్టేషు కొత్త పథకం పెట్టాడు.
సోము : ముష్టివాడు కొత్త పథకం ఏమిటే, మతి పోయిందా?
వాసవి : అవునండి, మనం ముష్టి వేసి.. ఫోన్ నెంబరు ఇస్తే,
రేపు లక్కీ డ్రా తీస్తాడట. అందులో ఎవరు ఫోన్ నెంబరు వస్తుందో వారికి రైస్ కుక్కర్ బహుమతిగా ఇస్తాడట.
సోము : ఆ!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి