23, జులై 2020, గురువారం

*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*


శ్రీమాత్రేనమః  *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*
*618వ నామ మంత్రము*

*ఓం ఐం హ్రీం శ్రీం పరమాయై నమః*🙏🙏🙏సర్వోత్కృష్టమైన (అన్నింటికి మిన్నయై) విరాజిల్లు పరమేశ్వరికి నమస్కారము🌹🌹🌹శ్రీలలితా సహస్ర నామావళ యందలి *పరమా* అను మూడక్షరముల (త్ర్యక్షరి) నామ మంత్రమును *ఓం ఐం హ్రీం శ్రీం పరమాయై నమః* అని ఉచ్చరించుచూ శ్రీమాతను ఉపాసించు సాధకుని అమ్మవారు కరుణించి అతని జ్ఞానసంపదలను వృద్ధిజేసి  అతనికి ప్రవేశమందున్న న్యాయ బద్ధమైన విద్యలందు సర్వోత్తమునిగా ఉద్ధరించి ఎనలేని కీర్తిప్రతిష్టలు ప్రాప్తింపజేయును🌸🌸🌸సర్వోత్తమమైన కార్యకారణములకన్నా వేరైనది. నిత్య, శుద్ధ, ముక్తస్వరూపమై విరాజిల్లుచున్నది. బ్రహ్మకు నాలుగు రూపములుండును. దానిలో మహోత్కృష్టమైనది పరదేవతా స్వరూపము. ఆదిమధ్యాంతములందు ఉండియు అన్నిటికీ పరిపూర్ణత్వం గలిగి, నిరాధార, నిరాశ్రయ, నిరపేక్షమైసది పరదేవతా తత్ప్వం. *పరమే వ్యోమన్ ప్రతిష్ఠితా* (తైత్తరీయము). వ్యోమన్ అనగా ఆకాశమునకు పరమైనది. ఆది మధ్యాంతరములందు ఉంటుంది. *తద్విష్ణో పరమంపదమ్ బ్రహ్మవిధాప్నోపరమ్* (శ్రుతి). పరమేశ్వరి పరబ్రహ్మ స్వరూపిణియై *పరమా* అనబడును🌺🌺🌺ఎండిపోయిన పదార్థములకును దాని జీవకాల వికాసన రూపమునకు తారతమ్యతయే *పరమా* అనబడును. విశ్వమునందంతటికినీ చైతన్యవంతము జేయు తత్త్వమే పరమా అని భావము🌹🌹🌹శ్రీమాతకు నమస్కరించునపుడు *ఓం ఐం హ్రీం శ్రీం పరమాయై నమః* అని అనవలెను🌻🌻🌻🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* అనుగ్రహముతో, వారి విరచితమైన *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది🙏🙏🌻🌻నేడు గురు (బృహస్పతి) వారము🔯🔯🔯గురువారమునకు అధిష్టాన దేవత గురుడు (బృహస్పతి)🌻🌻🌻 అందుకే గురువారమును బృహస్పతివారము🌹🌹🌹గురువారమునకు పసుపురంగు మంగళప్రదం🔯🔯🔯గురువారం లక్ష్మీప్రీతికరం గనుక గురువారాన్ని లక్ష్మివారం అనికూడా అంటారు🚩🚩🚩శుక్రవారంకూడా లక్ష్మీప్రీతికరమే  ఎందుచేతనంటే శుక్రవారానికి అధిదేవత శుక్రుడు🔱🔱🔱శుక్రుడు భృగువంశస్థుడు అదేవిధంగా లక్ష్మీదేవి కూడా భృగువంశమునకు చెందినది గనుక శుక్రవారము కూడా లక్ష్మీప్రీతికరము🙏🙏🙏ఇదేరోజున సాయినాథుని అర్చించుతాము అలాగే శ్రీగురు దత్తాత్రేయ స్వామిని కూడా ఆరాధిస్తాము🕉🕉🕉ఓం శ్రీగురు దత్తాత్రేయ స్వామినే నమః🚩🚩🚩ఓం శ్రీ సద్గురు సాయినాథాయ నమః🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
🌹🌹🌹🌹🌹మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉


కామెంట్‌లు లేవు: