23, జులై 2020, గురువారం

*చమత్కార పద్యాలు*

ఒకాయన శివుని ఇలా ప్రార్ధించాడట.

 *హిమగిరి తనయా హిమాంశులేఖా* 
 *సరిదతి శీతలా వాహినీ సురాణాం* 
 *త్రిభిరేతైరతి వేసి తో2 సి శంభో* 
 *మమహృది వివిశ త్రి తాపతస్తే* 

- ఓ పరమశివా! మీ సమీపంలో శీతలవస్తువులన్నీ వచ్చి చేరాయి , మీ ధర్మపత్ని హైమవతి - హిమవంతుని కుమార్తె [హిమాలయాలు ] , 

మీ శిరస్సుపై చంద్రుడు - చల్లనివాడు 

,మీ జటాజుటంపై గంగ - స్వచ్చానికి చల్లని నీరుకి పెట్టింది పేరు - 

ఇలా శీతల వస్తువులన్నీ మీ వద్ద వుండడంవల్ల మీ ఆరోగ్యరీత్యా ఏ మార్పు కలగకుండా , 

మహాప్రభో నా చిన్న సూచనను ఆలకించండి -

--- నా హృదయం తాపత్రయంతో కూడి ఉంది.

 ఆధ్యాత్మిక తాపం , ఆదిభౌతిక తాపం , ఆది దైవిక తాపం నా మనసులో చోటు చేసుకుని , ఈ మూడుతాపాలతో నాలో ఉష్ణం [వేడి ] ఎక్కువయ్యింది.

 కాబట్టి ఓ దేవాదిదేవా మీరు నా హృదయంలో వచ్చి కాపురం వుంటే ,అంతా సవ్యంగా జరిగి నాకు శాంతి కలుగుతుంది. నేను ధన్యుణ్ణి అవుతాను అంటూ ప్రార్ధించాడు.


చూశారా ఆ భక్తుడి చమత్కృతి ...

ఇదే మన భాషలోని గొప్పతనం.

 మన తెలుగుభాష చక్కదనాన్ని చాటి చెప్పడమే మన బాధ్యత..

కామెంట్‌లు లేవు: