23, జులై 2020, గురువారం

*భక్తి అనగా*

ఒక గ్రామంలో ఒక పశువుల కాపరి ఉండేవాడు. అతడు పరమ భక్తుడు. కాని అక్షరశూన్యుడు. 

పగటిపూట పశువులను మేలుకుని సాయంత్ర  మయ్యేసరికి పురాణం వినడానికి గుడికి వెళ్లేవాడు.  

అక్కడ ఒక పౌరాణికుడు పురాణంచెబుతూ 
భక్తిమార్గాన్నిబోధిస్తున్నాడు.

ఆయన ఒక రోజు మహావిష్ణువు యొక్క స్వరూపమును,లక్షణములను 
వివరిస్తూ నల్లనివాడు, తెల్లనిగ్రద్ద నెక్కేవాడు, తెల్లని నామం ధరించేవాడు, భక్తుల కోర్కెలు తీరుస్తాడని, వారు పెట్టే నైవేద్యం స్వీకరిస్తాడని, నమ్మినవారిని తప్పక అనుగ్రహిస్తాడని బోధించాడు

పశువుల కాపరి ఈ మాటలు శ్రద్ధగా విన్నాడు.

 ఆ పౌరాణికుడు వర్ణించిన విష్ణు రూపం హృదయంలో గాఢంగా హత్తుకు పోయింది. ఏవిధంగానైనా ఆదేవుణ్ని
చూసి తరించాలని సంకల్పం
కలిగింది

మరునాడు పశువుల కాపరి యధాప్రకారం ఉదయమే లేచి మధ్యాహ్న భోజనమును మూటగట్టుకుని పశువులతో బయలుదేరాడు. 

పశువులను మేతకుతోలి తానుఒకచెట్టునీడలోకూర్చున్నాడు.తాను తెచ్చుకున్న చల్లకూడును నారాయణునికి నైవేద్యం పెట్టి--

"తెల్ల గ్రద్ద నెక్కిన నల్లనయ్యా!
చల్లత్రాగ మెల్లగాను రావయ్యా"

అని ప్రార్థించడం మొదలుపెట్టాడు.

భగవంతుడు రాలేదు. నైవేద్యం ఆరగించలేదు. భగవంతుడు ఆరగించని చల్లకూడును తానూ తినకూడదని నిశ్చయించుకుని నిరాశతో ఇంటికి తిరిగి వచ్చాడు. 

ఈ విధంగా పదకొండు రోజులు గడిచాయి. పశువుల కాపరి కృంగి, కృశించి బలహీనుడైపోయాడు. కాని ధ్యానము మానలేదు.

మహావిష్ణువు అతని నిష్కళంక భక్తికి చలించిపోయాడు.
ఒకముసలి
బ్రాహ్మణరూపంలో కనిపించాడు.

"నేను నారాయణుణ్ని. నీవు ప్రార్థించావు కదా వచ్చాను."
అన్నాడు. 

పశువుల కాపరికినమ్మకం
కలగలేదు.

"ఇతడు దేవుడా? కాదా? సుందర రూపం లేదు. ముఖం నల్లగా లేదు. తెల్లని గ్రద్దపై రాలేదు."

పశువుల కాపరి : "ఓ ముసలి బ్రాహ్మణుడా! నీవు రేపు ఏడు
గంటలకు ఏటి ఒడ్డుకు రా! "

భగవానుడు: "సరే!"

పశువుల కాపరి హడావిడిగా పౌరాణికుని దగ్గరకు వెళ్లాడు. విషయం చెప్పి రేపు ఏడుగంటలకు ఏటిఒడ్డుకు రమ్మని అభ్యర్థించాడు.

 విషయం గ్రామస్తులకు తెలిసింది. వారుకూడా ఉత్సాహం చూపారు.

ఉదయం ఏడింటికల్లా అందరూ ఏటిఒడ్డుకు చేరుకున్నారు.

అందరూ ఎదురు చూస్తూండగానే ముసలి బ్రాహ్మణుడు ఒక్కసారిగా తిరిగి ప్రత్యక్ష మయ్యాడు. 

పశువులకాపరి 
ఉత్సాహంగా అరిచాడు.

" ఇదిగో! ఇతడే నిన్న వచ్చిన
ముసలి బ్రాహ్మణుడు."

బ్రాహ్మణ రూపంలో వున్న భగవంతుణ్ని పౌరాణికునితో సహా అక్కడ గుమిగూడిన గ్రామస్తు లెవ్వరూ చూడలేకపోయారు.

వారు పశువుల కాపరిని గేలిచేస్తూ, కోపంతో కొట్టడం ప్రారంభించారు. 

పశువుల కాపరికి ఒళ్లు మండింది. దేవునికేసి తిరిగి--

" బాపనయ్యా!నాకు ఈ గతి పట్టించడానికా నీవు వచ్చావు?
నాకు కనపడినట్లుగా వారికెందుకు కనిపించవు?" అని అరిచాడు.

మరుక్షణం జగన్మోహనాకారంతో చిరునవ్వు ముఖంపై పూసుకుని ధగధగ మెరిసే మణిభూషణాదులతో
పీతాంబర శోభతో గరుడవాహనంపై
మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు.

పశువుల కాపరి ఆనందానికి అంతు లేదు. కళ్లనుండి కన్నీటిధారలు!

" తెల్ల గ్రద్దనెక్కిన నల్లనయ్యా!
నా కన్నతండ్రీ! నన్ను కరుణించి 
వచ్చావా!"

ఇంతలో ఆకాశం నుండి విమానం దిగడం, ప్రియ భక్తుణ్ని అధిరోహింప జేసుకుని రివ్వుమని ఎగిరిపోవడం క్షణాల్లో జరిగిపోయింది.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁

సాధకుడు మొదట శాస్త్రం ద్వారా లేదా గురురూపేణా
దైవం యొక్క స్వరూప స్వభావాలను 
వింటాడు. 

ఇది 'జ్ఞాతుం.' అనగా తెలుసుకోవడం. 

తరువాత ఆ స్వరూప స్వభావాలను ధ్యాన ప్రక్రియలద్వారా కొంతకాలంతర్వాత
ప్రత్యక్షంగా దర్శించి కొంతవరకూ తృప్తి పడతాడు.

 ఇది ' ద్రష్టుం.' 


కాని పూర్తి సంతృప్తిని చేకూర్చేది 
భగవంతునిలో చేరిపోవడం . ఇది ' ప్రవిష్టుం'. 

దీన్నే ద్వైత, విశిష్టాద్వైత,
అద్వైత స్థితులని చెబుతారు.

******************************

కామెంట్‌లు లేవు: