*ఈ రోజు ఇద్దరు స్వాతంత్ర్య సంగ్రామంలో అవిరళ కృషి చేసిన ప్రఖర దేశభక్తుల జన్మదినం
లోక మాన్య బాల గంగాధర తిలక్ 23జూలై 1856 లో జన్మించారు. "#స్వరాజ్యమే_నా_జన్మహక్కు" అని నినదించారు. వారు ప్రముఖ హిందుత్వ జాతీయ వాది హిందూ ధర్మ సంస్కృతుల సంరక్షణ చేయటం ద్వారానే జన సామాన్యంలో జాతీయతను మేల్కొల్పాలి. హిందూ-సమాజ సంఘటన ద్వారానే స్వాతంత్ర్యం సాధించాలి. అని నమ్మిన వ్యక్తి ఎందుకంటే ఈ దేశంలో మెజారిటీ హిందువులే ఈ దేశం హిందువులదే గనక వారు సామాన్య జనంలో దేశభక్తి జాతీయత జాగృతం చేయటావికి "#గణేశ_ఉత్సవాలను"ఉపయెాగించుకు న్నారు. అంత వరకు నాలుగు గోడల మధ్యన వ్యక్తి గతంగా కుటుంబ పరంగా జరుపుకునే "గణేశ పూజలను" నాలుగు కూడలిల వద్ద బహిరంగంగా సామాజికంగా గణేశ నవ రాత్రులు జరుపుకుని సామూహికంగా నిమజ్జనం చేసే సాంప్రదాయాన్ని ప్రారంభించారు. అదే స్ఫూర్తితో మహా రాష్ట్ర ప్రాంతంలో ఈ ఉత్సవాలను సామూహికంగా ఘనంగా జరుపుకుంటారు పూణే ముంబాయి గణేశ ఉత్సవాలకు పెట్టింది పేరు. మన భాగ్య నగర్ లోకూడా అదే స్ఫూర్తితో "#భాగ్యనగర్_గణేశ_ఉత్సవసమితి" ఆధ్వర్యంలో ప్రపంచ ప్రసిధ్ధ ఉత్సవాలు జరుగుతాయనే విషయం మనందరికీ తెలుసు.*
*బాల గంగాధర తిలక్ గారిని ఒక విలేకరి ఒక ప్రశ్న వేసాడు. "స్వాతంత్ర్యం లభిస్తే ప్రభుత్వంలో ఏ పోర్టు పోలియో ఏ మినిస్ట్రీ తీసుకుంటారు" అని అడిగితే తిలక్ చెప్పిన సమాధానం " దేశానికి స్వతంత్రం వస్తే నేను ప్రభుత్వంలో చేరను నేను మా జిల్లా రత్నగిరికి వెల్లి ఇంతకు ముందు పని చేసిన పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరతాను"ఎందుకంటే*
*"జాతియెుక్క నిర్మాణం తరగతి గదిలోనే జరుగుతుంది"*
*"A Nation is making in class rooms only"*
*ఇదీ #లోకమాన్య_బాలా_గంగాధర_తిలక్ గారి గొప్పతనం*
****************************** **
*చంద్రశేఖర్ ఆజాద్ 23 జూలై 1906 లో జన్మించారు. స్వతంత్ర సంగ్రామంలో పోరాటం చేసిన వారిలో అతి వాదులు మిత వాదులు అని రెండు రకాలుగా వుండేవారు.అతివాద దేశభక్తులో భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ లు వీరి పేరు వింటేనే త్యాగం సమర్పణ భావం తెగింపు ధైర్యం ఒక సమున్నత లక్ష్యం కోసం తమ జీవితాలను తృణప్రాయంగా భావించి భారతమాత పాదాల చెంత తమ ప్రాణ కుసుమాలను అర్పణ చేసిన ఆ ఘటనలు వింటే మన శరీరాల పై వెంట్రుకలు నిక్క పొడుసుకుంటాయి. నూనుగు మీసాల నూతన యవ్వనంలో ఉరి తాళ్ళనే పూల మాలలుగ తుపాకీ గుండ్లనే పూల చెండ్లుగా భావించి వీరు చేసిన త్యాగం యువతకీ ఎంతో స్ఫూర్తిదాయకం*
*నీ తల్లి ఎవరు? స్వేఛ్ఛ!
నీ తండ్రి ఎవరు స్వతంత్రం ! అసలు నీ పేరేమిటయా బాబూ? అంటే
"ఆ జా ద్" అని
సింహంలా గర్జించి బ్రిటిష్ వారికి సమాధానం చెప్పిన మన #చంద్రశేఖర్ తివారీ (ఆజాద్) జన్మదినం మనకెంతో స్ఫూర్తి ప్రేరకం*
**************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి