23, జులై 2020, గురువారం

*సంస్కృతాంధ్ర సాహితీసౌరభం*



*श्लोकम्*  :
*अजीर्णे भेषजं वारि जीर्णे वारि बलप्रदम् ।*
*अमृतं भोजनार्धे तु भुक्तस्योपरि तद्विषम् ।।*

*శ్లోకం:*
*అజీర్ణే భేషజం వారి, జీర్ణే వారి బలప్రదం ।*
*అమృతం భోజనార్థే తు భుక్తస్యోపరి తద్విషం ।।*


*ప్రతిపదార్థం:*
అజీర్ణే = జీర్ణమునందు, భేషజం = మందు, వారి = నీరు, జీర్ణే = జీర్ణమునందు, జీర్ణం అయిన తరువాత; వారి = నీరు, బలప్రదం = బల వర్థకం, భోజనార్థే = భోజన్మ్ మధ్యలో, అమృతం = అమృతము, తు = కాని, భుక్తస్య = భుజించిన వానికి, ఉపరి = తరువాత, తత్ = అది, విషం = విషము

*Meaning:*
When having indigestion, drinking the water serves as medicine. After the digestion, water helps getting strength. While in the midst of taking food, it does miracle. But, drinking water immediately after eating food, then it is like having poison, means it harms.
  
తాత్పర్యం:
అజీర్ణముగా ఉన్న వానికి నీరు త్రాగడం అనేది ఒక మందులాగ పని చేస్తుంది. తిన్న ఆహారము జీర్ణమైన తరువాత అదే నీరు శక్తినిస్తుంది. బోజనం చేసేటప్పుడు మధ్యలో నీళ్ళు త్రాగితే అది అమృత తుల్యం. కానీ, భోజనం చేసిన వెంటనే మాత్రం నీళ్ళు త్రాగితే అది విషముతో సమానము. అంటే హాని చేయును.

శరీరములో నూటికి 70 శాతం నీరే ఉంటుంది. నీళ్ళు త్రాగమని డాక్టర్లు కూడా సలహా ఇస్తూ ఉంటారు. కాని ఎప్పుడెప్పుడు ఆ నీళ్ళు తగినంత త్రాగితే ఉపయోగమో ఈ సుభాషిత కర్త వివరంగా తెలియజేస్తున్నాడు. 

ఇది మన ప్రాచీన ఆయుర్వెద విజ్ఞానములోని విషయము.

************************************

కామెంట్‌లు లేవు: