23, జులై 2020, గురువారం

ఐకమత్యం

వాళ్ళు ఉండేది 25 ఫ్లాట్లు ఉన్న రెసిడెన్షియల్ అపార్ట్మెంట్,
అందరూ కలిసి ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్  ఏర్పాటు చేసుకున్నారు.  

ఆ ఫ్లాట్లలో ఎవరికైనా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయితే అసోసియేషన్ ప్రేసిడెంట్ కి ఫోన్లో తెలియజేసి, ఫామిలీ మొత్తం హోమ్ ఐసోలాషన్ కి వెళ్లిపోతున్నారు.  

మిగతా ఫ్లాట్ల వాళ్ళు ఆ 14 రోజులు వాళ్ళకి కావలసినవి అన్నీ సప్లై చేస్తున్నారు.

రోజుకొక ఫ్లాటు వాళ్ళు ఐసోలేషన్లో ఉన్న వారికి కావలసిన బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ వంటివి  సిద్ధం చేసి డిస్పోజబుల్స్ లో సర్ది ఐసోలేషన్లో ఉన్న వారి ఫ్లాట్ డోర్ దగ్గర బయట వైపు పెట్టి,  ఆ ఫామిలీకి ఫోన్ చేస్తున్నారు. 

వాళ్ళు అవి తీసుకుని లోపలకు వెళ్లిపోతున్నారు. అలా వాళ్ళు భయటకు వచ్చి ఇతరులకు స్ప్రెడ్ చేసే ప్రమాదం ఉండదు. పైగా మనకోసం ఇంత మంది ఉన్నారు అనే భరోసా కలుగుతుంది.

మన దగ్గరలో ఏ అపార్టుమెంట్లలో నైనా ఎవరికైనా పాజిటివ్ నిర్ధారణ అయితే వాళ్ళను వెలి వేసినట్లు వ్యవహరించకుండా వాళ్లకు సహకరించండి. ఎందుకంటే అలాంటి రేపటి రోజున మీకే రావొచ్చు.  అందుకే మనకోసం అందరూ, అందరికోసం మనం అనుకోవాలి.
 Dr.Maasi krishnamoorthy
Advocate,
Tirupathi.
ఇది వాట్స్ ఆప్ మెసేజ్ ఆధారంగా 
***************************

కామెంట్‌లు లేవు: