తియ్యని తెలుగుదనము ఇప్పుడు క్షేనించి పోతున్నది గ్రాంథిక భాష విశ్వవిద్యాలయాల్లో తలదాచు కొంటున్నదని గతంలో ఎవరో అన్నట్లు గుర్తు కాని నేటి పరిస్థితి చూస్తే విశ్వవిద్యాలయాలు కూడా గ్రాంథిక భాషకి ఆశ్రయం ఇవ్వటం లేదు ఎక్కడ చుసిన గేయ కవిత భావ కవిత అంతే కానీ ఛందో బద్ద కవిత చూద్దామన్న కానరావటం లేదు. మన తెలుగును ఆ దేముడే కాపాడాలి. ప్రతి గేయ కవి తనొక కవి సామ్రాట్ను అనుకుంటున్నాడు పేపర్లలో పేరు రావాలను కుంటున్నాడు తప్ప మనము ఈ సమాజానికి ఏమి అందిస్తున్నాం అని అలోచిన్చట్లేదు. నేటి కవులకు పూర్వ కవుల సాహిత్యం అవసరం లేదు. పట్టుమని పది పద్యాలను కూడా తెలియని వాళ్ళు గేయ కవులుగా, భావ కవులుగా చెప్పుకుంటున్నారు. అంతేకాదు వారికీ తెలిసిందే సాహిత్యం అనే భావనలో వుంటున్నారు. ఓ భగవంతుడా నేవే ఈ తెలుగు సాహిత్యాన్ని కాపాడాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి