ఒక జమిందారుగారు మధ్యాహ్నం బాల్కనీలో నిలుచొని వాక్కిలి వైపు చూస్తుంటే ఒక పండితుడు కళ్ళకి చెప్పులు కూడా లేకుండా తన ఇంటివైపు రావటం గ్రహించి క్రిందికి దిగి ఎదురేగి ఎవరు స్వామి మీరు ఇంత ఎండలో నడుచుకుంటూ మా ఇంటికి వచ్చారు అన్నారట దానికి ఆ పండితుడు క్రింది పద్యం చెప్పాడట
నడవక నడిచి వచ్చితి నడిచిన నేనడచి రాను
నడవక నడుచుటెట్ల
నడవక నడిపింపుము నరవర
ఇల్లు నడవక నేను ఇక్కడకి నడుచుకుంటూ వచ్చాను. ఇల్లు గడిస్తే రావలసిన పని లేదు. నేను నడవకుండా ఇల్లు ఎలా గడుస్తుంది? నేను నడవకుండా ఇల్లు నడిపింపుము అంటే తగిన సాయం చేసి నన్ను ఆడుకో అని అర్ధం.
తెలుగు భాష లోని పద ప్రేయోగాలకి అనేక పద్యాలు వున్నాయి. ఈ పద్యంలో ఏమైన దోషాలు ఉంటే సవరించగలరు.
1 కామెంట్:
I like this article. Thank you so much for sharing your knowledge with us.. Its is very helpful.
Star Naukri
కామెంట్‌ను పోస్ట్ చేయండి