ఒకనాడు కలలో భక్తునికి దేముడుకనిపించాడు. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు దేముడు అక్కడి కాలి అడుగులని చూపి ఇది నీ జీవితంలో గడచినాకాలం అని చెప్పాడు. ప్రతి చోట రెండు జతల అడుగులు వున్నాయి భక్తుడు అడిగాడు ఆ రెండవ జత అడుగులు ఎవరివని. దానికి ఒకటి నీ కాలిది రెండవది నాది అన్నాడు. మరి ఆ బురుజగా వున్నప్రదేశం ఏమిటని భక్తుడు అడిగాడు దానికి అది నీ జీవితంలో గడిచిన కష్ట కాలం అన్నాడు. మరి అక్కడ ఒకే జత అడుగులువున్నాయి అంటే నీవు నేను నా జీవితంలో మంచిగా వున్నప్పుడు నా వెంట ఉండి నేను కష్టంలో వున్నప్పుడు నన్ను వదలి వెళ్లవు అన్నమాట ఎంత మోసగాడివి నీవు అని దేముడిని భక్తుడు తప్పు పట్టాడు . దానికి దేముడు మందస్మిత వదనంతో నేను నిన్ను వదలి వెళ్ళలేదు ప్రియతమా నా కుమారా నిన్ను ఎత్తుకొని నడిచాను. ఆ అడుగుల ముద్రలు నీవి కావు నావి ఇంకొకటి కూడా చూడు నిన్ను ఎత్తుకోవటం చేత అడుగులు భారంగా పడ్డాయి అందుకే అవి లోతుగా వున్నాయి. ఆ సమాధానంతో భక్తుడు నిస్తేస్టుడైనాడు..
భక్తుడు త్రికరణ శుద్ధిగా ప్రార్ధిస్తే దేముడు ఎప్పుడు నీడలాగా వెన్నంటి ఉంట్టాడు. కావలసింది నిష్కల్మషమైన శ్రద్ధతో కూడిన భక్తి మాత్రమే.
ఒక ఆంగ్ల కవిత ఆధారంగా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి