15, నవంబర్ 2019, శుక్రవారం

దేముడు

 దేముడు అనగానే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెపుతుంటారు.  దానికి కారణం ఎవరు ఏమి చెప్పినా అన్ని కూడా దేముడే కాబట్టి.  " మహర్షి మతయచ్ఛ బిన్నాహా " అనే నానుడి ననుసరించి మేధావులైన వారు వారి అనుభవంతో గాంచిన దానిని వక్కాణిస్తూ వుంటారు. కాబట్టి దేనిని మనం కాదనలేము.  కానీ ప్రతిదానిని పరిశీలించి చూసినప్పుడు మాత్రమే మనకు యదార్ధం గోచరమవుతుంది.  

 దేముడి లక్షణాలు ఏమిటి 
దేముడు నామ (పేరు) రూప (ఆకారం) గుణ (లక్షణం) లేని వాడు.  అంతే కాక కాలంలో లేని వాడు (శాస్వితుడు).  ఇప్పుడు ఈ విషయాన్నీ కూలంకుషంగా చూద్దాము. 
మనం చుసే ఈ చెరా చెర జగత్తులో మనకు ఒకటి గోచరిస్తూ వున్నది అదే మనకు కనబడే ప్రతి దానికి ఒక నిర్దుష్టమైన రూపం ఉండటమే . కాబట్టి  మనం ప్రతిదానిని చూసి గుర్తుంచుకోగలుగుతున్నాం.  మనం గుర్తుంచుకోటానికి ప్రతి దానికి ఒక పేరు ఇస్తున్నాము.  మనకు ప్రత్యక్షముగా ఏది తెలియకపోయిన ఒక పేరుతొ ఒక వస్తువును గుర్తు పట్టగలుగుతున్నాము. మనం చూస్తున్నాము కాబట్టి అది మనకు గోచరిస్తుంది.  దానినే ప్రత్యక్షము అంటాము. మన ప్రత్యేక్ష జ్ఞ్యానం కలిగినది ప్రతిదీ వికారం చెందేది అంటే మార్పు చెందేది.  మార్పు మూడు రకాలు 
 1)జననం (ఆది) అంటే మనం చూసే ప్రతి వస్తువే కానీ మనిషే కానీ కాక ఏ ఇతర జంతువే కానీ ఏదో ఒక రోజు జన్మించి వున్నదే. 
 2) వికారం(మధ్య) అంటే మనం చూసే ఈ దృశ్యమాన జగత్తు అంతా మార్పు చెందుతూ వున్నది.  నిన్న చూసింది నేడు లేదు.  అంటే నిన్న చూసిన్ది మనకు ఈ రోజు కుడా కనపడుతున్నది కానీ ఎంతో కొంత మార్పు చెంది కనబడుతున్నది. నిన్న మనకువిత్తనంగా గోచరించింది భూమిలో నాట గానే రెండు మూడు రోజులలో మొలకగా కనబడుతున్నది.  తరువాత చెట్టుగా లతగా పెరగటం చూస్తున్నాం. ఈ పెరుగుదల ఒక్క మొక్కలకే కాదు అన్ని ప్రాణులలో చూస్తున్నాం. మరి నిర్జీవుల విషయంలో వాటి రూపాలు కాలాంతరంలో మారటం చూస్తున్నాము.  కొన్ని త్వరగా మార్పు చెందవచ్చు కొన్ని ఆలస్యంగా మార్పు చెందవచ్చు. కానీ మార్పు చెందటం మాత్రం సత్యం. 

3) మరణం (అంతం.) మార్పు చెందిన ప్రతిదీ నశించిపోవటం చూస్తున్నాం ఇదే అంతం. జీవులు ప్రాణాలని కోల్పోయి మరణిస్తున్నాయి.  మరణానంతరం జీవ రహిత శరీరాలు పంచ భూతాలలో కలసి పోతున్నాయి. నిర్జీవులు నిత్యం ప్రకృతిలో అనేక రసాయనిక చర్యలు చెంది వాటి ఉనికి కోల్పోయి పంచభూతాలలో ఐక్యం అవుతున్నాయి.  ఉదా :  మనం ఒక కారు చూసాం అది కొంత కాలం కారు రూపంలో వుంది పయనిస్తూ ఉంటుంది.  తరువాత దాని యంత్ర సామాగ్రి అంతా  చెడిపోయి దాని లక్షణాన్ని (నడిచే స్వభావం) కోల్పోతుంది. చివరికి పూర్తిగా తుప్పు పట్టి రూపాన్ని కుడా కోల్పోతుంది ఈ ప్రక్రియ జరగటానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు కానీ నశించక మాత్రం ఉండదు.  మనం చూసే ఈ దృశ్యమాన జగత్ మొత్తము నశించేదే "ఎత్ దృశ్యం తత్ నశ్యం "  కనబడేది ప్రతిదీ ఏదో ఒక రోజు నశించి పోయేదే. దీన్ని బట్టి మనకు గోచరించేది ఏమిటంటే ఈ జగత్తు శాశ్వితము  కాదు అని. 

దేముడి స్వభావం:  మనం ఈ జగత్తును పరిశీలిస్తే అది మనకు ఆది, మధ్య, అంతాలతో గోచరిస్తూ వున్నది.  మనం ముందే చెప్పుకున్నాం దేముడు ఆది మధ్య అంత రహితుడు అని.  కాబట్టి దేముడు మనకు కనపడడు  ఎందుకంటే కనపడేవి అన్ని కూడా ఫై మూడు లక్షణాలు కలిగినవి.  ఎప్పుడైతే ఈ మూడు లక్షణాలు లేవో అట్టి దేముడు మనకు కనపడటానికి ఆస్కారం లేదు.  దేముడు కనపడితే, దేముడే కాదు. 

ఇతిహాసాలు పరిశిలిస్తే మనకు ఒక విషయం గోచరిస్తుంది.  అది ఇక్కడ తెలుసుకొందాము.  రామాయణంలో మనకు రావణబ్రహ్మ గారు తప్పస్సు చేస్తే పరమ శివుడు ప్రత్యక్షమయి వరాలు ఇచ్చినట్లు తెలుస్తుంది.  ఇది త్రేతాయుగం.  ఆ తరువాత ద్వాపర యుగంలో భారతంలో పాండవ మధ్యముడు ఐన అర్జనులవారు ఇంద్రకీలాద్రి మీద తప్పస్సు చేస్తే పరమ శివుడు ప్రత్యక్షమై పాశుపతాస్త్రం బహుకరించినట్లు చదువు కున్నాము.  ఇప్పుడు మనము విశ్లేషణ చేస్తే అక్కడ త్రేతాయుగంలో రావణ బ్రహ్మ గారికి ప్రత్యక్ష మైన పరమ శివుడు ఇప్పుడు ద్వాపర యుగంలో అర్జనుల వారికీ ప్రత్యక్షము ఐనా పరమ శివుడు ఒక్కరే. త్రేతా యుగంలో రావణ బ్రహ్మ గారు గతించారు ద్వాపర యుగంలో అర్జనుల వారు గతించారు.  కానీ పరమ శివుడు ఆ రెండు కాలాల్లో ప్రత్యక్షము అయినట్లు మనకు ఇతిహాసాలు చెపుతున్నాయి. ఇప్పుడు మనం కూడా అచంచల దీక్షతో తప్పస్సు చేస్తే ఆ పరమ శివుడు మనకు కూడా ప్రత్యక్షము కాగలరు.   దీనిని బట్టి మనకు ఒక విషయము బోధ పడుతుంది. అదేమిటంటే ఆ పరమ శివుడు కాలంలో లేరని ఆ దేముడు కాలాతీతుడని.  కాలాతీతుడు ఐన దేముడు మరి ఎలా ప్రత్యక్షం అవుతాడు.  ఇప్పుడు ప్రత్యక్షం అంటే ఏమిటో తెలుసుకుందాము. 

ప్రత్యక్షం: అంటే ఏదైనా మనము చూడటముని ప్రత్యక్షం అని మనం అనుకుంటాము.  కానీ ప్రత్యక్షం అనే పదానికి అర్ధం ఏదైతే మన ఇంద్రియాలకు గోచరం అవుతుంతో అది ప్రత్యక్షం.  మన పంచేద్రియాలకు తెలుస్తుందో అది ప్రత్యక్షం.  ఈ జగత్తులో మనకు కనిపించనిది  ఒక కారణం చేత కనిపించుటే ప్రత్యక్షం.  ఆ దేవదేవుడు సర్వ కాల సర్వావస్థలలో ఉండి ఉండి కేవలము తన భక్తులకు తాత్కాలికంగా గోచరించటమే ప్రత్యక్షం.  కాబట్టి దేముడు కాలంలో లేడు.  కాలమే తనలో వున్నది.  

ద్వయిత ప్రపంచం : అంటే మనం చూస్తున్న ఈ ప్రపంచం మొత్తం తనకన్నా భిన్నంగా గోచరిస్తుంది.  ఈలా వున్నదానిని ద్వైత జగత్తు అంటారు.  అంటే ఇందులో నేను కానిది వున్నది.  అంటే నేను వేరు ఈ ప్రపంచం వేరు.  ఇలా రెండు రకాలుగా కనబడుతున్నది.  అంతే కాక మనకు ఇక్కడ ప్రతిదీ రెండుగా గోచరిస్తుంది. అది లింగ భేదం. రూప బేధం. ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క ప్రత్యకత కలిగి వుంది ఏ రెండు కూడా పూర్తిగా సారూప్యంగా మనకు కనపడవు.  కొన్ని స్థూలంగా ఒక్క రకంగా వున్నా మనం సూక్ష్మంగా పరీక్షిస్తే ఒకదానికి ఒకటి భిన్నంగా కనబడతాయి. ఇలాంటి ద్వయత జగత్తు నుండి విడివడటమే మోక్షం.  అదే అద్వయితం బోధిస్తుంది.

శ్రీ ఆది శంకరాచార్య: అద్వైత సిద్ధాంతం ఈ ప్రపంచానికి తెలియ చేసిన మహానుభావుడు ఆది శంకరుడు.  ఆది శంకరుని గూర్చి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన హిందూ వాగ్మయం రెండు రకాలుగా విభజించి వుంది.  అది మొదటిది వేదాలు.  వేదాలు మొత్తం నాలుగు+ఒకటి గా వున్నాయి.  ఈ వేదాలు కర్మ కాండను తెలియ చేస్తాయి.  ఏ కర్మ (పని) చేస్తే ఏ ఫలితం ఉంటుందో తెలుపుతాయి.  ఇక తరువాతది వేదాంతం.  వేదాంతం అంటే వేదాలకు చివర వున్నది అందుకే దీనిని వేదాంతం అన్నారు.  వేదాంతం మనకు ఉపనిషతుల వలన తెలియ బడుతుంది.  ఈ ఉపనిషత్తులు అన్ని మహర్షులు ఇతరులకు బోధించిన జ్ఞానం. 

నాస్తిక వాదం : నాస్తికులు దేముడు లేడు అని వాదిస్తున్నారు.  వారికి ఒక సూటి ప్రశ్న.  మనం రోజు చూసే జంతువే కానీ లేక మనిషీ కానీయండి మరణించిన కొద్దీ కాలానికే క్రుళ్లటం (decompose) కావటం చూస్తున్నాము.  కొన్ని బ్యాక్టీరియాలు ఆ శరీర అవయవాలు తినటం వలన ఆ కళేబరం క్రుళ్ళు తున్నది అని సైన్సు చెపుతున్నది.  అది నిజమైతే మరి ఆ జంతువు లేక మనిషి జీవించి వున్నప్పుడు క్రుళ్ల కుండా కాపాడుతున్నది ఎవరు?  ఈ ప్ర్రశ్నకి సరైన సమాధానం ఎవరు చెప్పుతారు. ఇది మన శాస్త్రానికి అంతు చిక్కని ప్రశ్న. జీవి బ్రతికి ఉండటానికి ప్రాణం కారణం అని అంటున్నారు.  ఐతే మరి ఆ ప్రాణం ఏమిటి.  మనకు కనపడదు ఎందుకు. కనపడని దానిని నమ్మటం ఎందుకు?.  సరే నమ్ముదామంటే దానికి ప్రమాణం ఏమిటి.  ఏదైనా ఒక పని జరగాలంటే ఆ పని చేసే వాడు ఉండాలి.  ఆ పని ఆ చేసేవాడి నైపుణ్యం మీద మాత్రమే జరుగుతుంది.  ఒక భవనం నిర్మించాలంటే భావన నిర్మాణ ఇంజనీరు మాత్రమే పని చేయాలి.  అదే ఒక యంత్రం నిర్మించాలంటే యంత్ర నిర్మాణ ఇంజినీర్ వల్లనే సాధ్యం అవుతుంది.  అలానే ఒక రుచికరమైన ఆహార పదార్ధం వండాలంటే వంట చేయగల వంట వాని వల్లనే సాధ్యం అవుతుంది.  ఈ రీతిగా ఒక్కొక్క పని చేయాలంటే ఆ పనిలో ప్రావిణ్యం వున్నవారు మాత్రమే చేయగలరు.  ఒక పని చూసిన వానికి ఆ పని చేసిన వాడు కనపడవచ్చు లేక కనపడక పోవచ్చు కానీ ఆ పని మాత్రం కనపడుతున్నది.  ఏప్పుడో వందల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయాలు ఇప్పడికీ మనకు గోచరిస్తూ వున్నాయి నిజానికి ఆ కళాఖండాలను నిర్మించిన కళాకారులు ఎవరో మనకు తెలియదు.  వాళ్ళ పని (work) మాత్రం మనకు కనపడుతున్నది.  దీనిని బట్టి మనం తప్పకుండా  నమ్మ వలసిన విషయం ఏమిటంటే ఎప్పుడైతే పని వున్నదో అప్పుడు పని చేసిన వాడు కుడా ఉండి ఉంటాడు. ఆ పనివాడు వున్నాడని నిరూపణే  అతను చేసిన పని.  కాబట్టి నియతి మనకు గోచరిస్తుంది కాన నియంత వుండివుండాలి.  మనముందు వున్న ఈ దృక్ గోచరాన్ని నమ్మక పోవటం కేవలం అవివేకం మాత్రమే అవుతుంది.   మనం చూసే ఈ జగత్తు మొత్తాన్నీ మనం సృష్ట్టి అని అంటున్నాము అంటే ఇది సృష్ట్టించబడినది.  అంటే ఎవరో ఒకరు సృష్ట్టించింది అని అర్ధం ఆ సృష్ట్టించిన వాడే సృష్టి కర్త.  ఆ సృష్టి కర్త ఎవ్వరన్నదే మన ఋషుల పరిశోధన.  అతనికే మనం పెట్టిన పేరు దేముడు.  దేముడు అనగానే పురుష శబ్దం కాబట్టి పురుషుడు అని అనుకోవచ్చు.  కానీ దేముడు పురుష స్త్రీ విభేదం లేని ఒక అద్వితీయ శక్తి అందుకే ఈ ప్రపంచం కన్నా భిన్నం అని మనం అనుకుంటున్నాము.  ఈ ప్రపంచం ద్వయత ప్రపంచం కాబట్టి స్త్రీ పురుష విబేధం కనపడుతున్నది.  


ఆస్తిక వాదంఇక ఆస్తికులు తమ ముందున్న ప్రపంచాన్ని చూసి దాని కారణమైన దాన్నివెతకటానికి వేల సంవత్సరాలనుండి ప్రయతిన్స్తున్నారు. మన దేశంలో ఋషులు వారి జీవిత కాలాన్ని వెచ్చించి ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో విషయాలను తెలుసుకున్నారు. ఆ ప్రకారం వెలువడ్డ జ్ఞ్యానమే మన వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు మరియు పురాణాలు.  ఇంత పెద్ద వాగ్మయం వున్న ధర్మం ఈ భూమి మీద మరొకటి లేదు అంటే అతిశయోక్తి కాదు.  కారణ భూతమైన శక్తిని దార్శనికులు తమ తమ జ్ఞానంతో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తెలుసుకొన్నారుఆలా తెలుసుకోటంతో విభిన్న దేవి దేవతలు, మతాలు ఏర్పడ్డాయిఇలా ఏర్పడటం మంచిదే కానీ ఎప్పుడైతే వేరు వేరు మతాలు, విశ్వాసాలు జనాల మధ్యన వచ్చాయో అప్పుడు నా దేముడు గొప్ప అంటే నా దేముడు గొప్ప అనే వివాదం తలయెత్తినదివీటి పర్యవసానమే మతాల, మధ్య పోరునిజానికి అందరికి వున్నది ఒకే ఒక దేముడు. విషయం తెలుసుకోక భిన్న భావాలతో వివాదాలు కొని తెచ్చుకుంటున్నారు


మత వాదంఒక జ్ఞాని తన సాధనతో తెలుసుకొని ఏర్పాటు చేసిందే మతమునిజానికి మతం ఏదైనా అది సర్వ మానవులకు ఆచరణ విధంగా అనుసరణీయంగా ఉండాలిఒక్కొక్క మతం ఒక్కొక్క ప్రాంతానికి చెందింది అయి వున్నా నేటి కాలంలో రవాణా సౌకర్యం వృద్ధి చెందటంతో మతాల వ్యాప్తి కుడా ప్రపంచమంతా  పెరిగిందిదాని వల్ల మానవులు సంస్కారం మరచిపోయి సంచరిస్తున్నారు. మతాలు రాజకీయతతో ముడి వేసి రాజకీయ నాయకులు తమ ప్రాబల్యం పెంచుకుంటున్నారుఇలా ప్రతిదీ వివాద హేతువు అవుతున్నాయి. మనుషులు కొన్ని సందర్భాలలో మానవత్వం మరచి ప్రవర్తిస్తున్నారువీరంతా నిజానికి దేముడనే మూసుగులో తమ పబ్బం గడుపుకునే సంస్కార హీనులుమీ దేముడి విగ్రహాలకి అపచారం చేస్తే మీ దేముడు ఏమి చేస్తాడు అని పరదేశ మత అవలంబులు అనటం మనం చూస్తున్నామువాళ్లకి దేముడు నాకు వేరుగా నీకు వేరుగా లేడని తెలియదు, అది మూర్ఖత్వం.  నిజానికి ఈ మాటలు అనే వానికి దేముడి మీద నమ్మకం లేదనే చెప్పాలి. దివత్వం మీద విశ్వాసం వున్న వారు `ఏకం సత్` అని తెలుసుకోగలుగుతారు. నిజానికి వీళ్ల మూర్ఖపు ప్రవర్తన సత్య దర్శనానికి చాలా దూరంగా ఉంటుంది.  వాళ్ళకి సత్య దర్శనామ్ గూర్చి గాని దానిని సాధించాలనే భావన కానీ ఉండదు.  కేవలం తమ మతం గొప్పది అనే మూర్ఖ భావం ఉంటుంది.  ఇతర మతస్తులను తమ మతానికి మర్చి తద్వారా పర దేశ్యాల నుండి ధన సముపార్జన చేయటమే వారి ధ్యేయం. ఇలాంటి వారి వల్ల వారు నమ్మే మతానికి మరియు ఇతర మతాలకు తీరని నష్టం వాటిల్లుతుంది.  అది గమనించే స్థితిలో లేని మూర్ఖులు వాళ్ళు.  సూర్య చెంద్రులు మనకు నిత్యం కనిపించే వాళ్ళువాళ్లకి నీ మతం నా మతం అని భేదం లేదుఎవరైనా పూజించాలి ఎందుకంటె సూర్యుడు లేనిది, చంద్రుడు లేనిది జగత్ లేదు.  మతం అనేది విశ్వాసం. విశ్వాసం నిరూపణకు దొరకక పోవచ్చు లేక దొరకను వచ్చునుకానీ భగవంతుడు విశ్వాసాలకి అతీతుడు.  
హిందువులు విగ్రహారాధకులాహిందుత్వం అనేది ఒక మతం కాదు.  ఎందుకంటె మనం మతం అనేది ఒక జ్ఞాని (ప్రవర్త) తన సాధనతో, అనుభవంతో ఏర్పాటు చేసిన విధానంగా పైన చూసాం.  హిందుత్వానికి ఒక   జ్ఞాని (ప్రవర్త) అని ఎవ్వరు లేరు.  ఇక మాత గ్రంధం విషయానికి  వస్తే ఒక్కొక్క మతానికి ఒక, ఒకే ఒక్క మాత గ్రంధం ఉండటం చూస్తున్నాము.  అది ఏ మతం ఆయన కానీ.  పైన పేర్కొన్నట్లు హిందూ ధర్మానికి ఎన్నో ఎన్నెనో ఆధ్యాత్మిక గ్రంధాలు వున్నాయి.  వాటికి అనుబంధంగా మహర్షులు, యోగులు వ్రాసిన టీకాలు, భాష్యాలు వున్నాయి.  హిందుత్వం అనేది అనేక వేల సంవత్సరాలనుండి ఆచరిస్తున్న ఒక మహోన్నత సంప్రదాయం, ఆచారం, పద్ధతి. ప్రపంచంలో వున్న అన్ని మతాల ప్రధానాంశాలను మనం హిందూ గ్రంధాలలో ఎక్కడో ఒక చోట చూడ గలం.  ప్రపంచంలో ఏ ములలో వున్నా జ్ఞాన జిజ్ఞాసులందరు ఈ రోజు హిందూ ధర్మం వైపు ఆసక్తిని చూపుతున్నారు. భగవంతుని యదార్ధ తత్వాన్ని తెలియ చేసింది హిందూ ధర్మం మాత్రమే. పైన దేముడి లక్షణాలను చూసాం. కాబట్టి దేముడు విగ్రహాలలో వుండే ప్రశక్తి లేదు.  మరైతే విగ్రహారాధన ఎందుకు.  యిది ఒక పెద్ద ప్రశ్న.  ఈ ప్రశ్నకు సమాధానం తెలియక ఎంతో మంది హిందువులు విగ్రహారాధకులు అని చెప్పటమే కాదు, విమర్శిస్తున్నారు. విగ్రహారాధన చేయటానికి గల కారణం.  మనస్సు చెంచలత్వం కలిగి వున్నది కావున నిర్గుణోపాసన ఎంతో సుదీర్ఘ సాధన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి చెంచలమైన మనస్సుని స్థిర పరచటానికి ఏర్పాటు చేసిన ప్రక్రియే ఈ విగ్రహారాధన. 

షోడచోపచార పూజ: భగవంతుడిని ఒక అతిధిగా భావించి పదహారు రకాలుగా సేవలు చేయటాన్ని షోడశోపచార పూజ అంటారు.  ఎప్పుడైతే భగవంతుని నిశ్చల భక్తితో ఆరాధిస్తాడో అప్పుడు భక్తుడు భగవద్ కైంకర్యంలో నిమగ్నుడైతాడు. కండ్లతో విగ్రహాన్ని చూస్తాడు.  అక్కడ వెలిగించి సుగంధ పరిమళ ఊదుబత్తుల సుగంధాన్ని ఆస్వాదిస్తాడు, స్వామికి అర్పించిన రంగు రంగుల పుష్పాల అలంకరణతో తాదాప్యం చెందుతాడు. మనస్సు తానూ చేస్తున్న అర్చన మీద ఉంచుతాడు, చెవులు మంత్రాలపై, దృష్టి స్వామిపై, చేతులు అర్చనపై వుంచు పూర్తిగా తాన పంచేంద్రియాలతో  భగవంతుడికి స్వాధీనుడు అవుతాడు. తన్ములంగా మనస్సుని భగవంతునిపై ఏకాగ్రత చేయగలుగుతాడు.  కానీ నిజానికి విగ్రహారాధనే అంతిమ గమ్యం కాదు. నిర్గుణోపాసనే కైవల్య ప్రధం అని ఉపనిషత్తులు గోషిస్తున్నాయి. విగ్రహారాధన ఎందుకు చేయాలో ఒక ఉదాహరణతో తెలుసుకుందాం. బాల్యంలో గురువుగారు విద్యార్థికి గణితం బోధించటానికి చేతి వేళ్ళని గణించమని చెపుతారు. ఇది మన అందరికి తెలిసిన విషయమే. వ్రేళ్ళని గణించటంతో చిన్న పిల్లవాడు కూడికలు, తీసివేతలు నేర్చుకుంటాడు.  మరి వాడు పెద్దయిన తరువాత వాడికి చేతి వేళ్ళు లెక్కించటం అవసరమా కాదు. కానీ బాల్యంలో చేతిమీద లెక్కలు నేర్చుకోటంతోనే నేడు గణితం అర్ధం చేసుకో గలుగుతున్నారు.  అదే విధంగా విగ్రహారాధన కుడా.  ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన అవసరం వున్నది.   
ఇంతమంది దేముళ్ళు ఎందుకు.  విగ్రహారాధన ఎందుకో తెలుసుకున్నాము. మరి ఇంతమంది దేముళ్ళు అవసరమా అని ప్రతి ఒక్కరి మదిలో ప్రశ్న మొదలవుతుంది. మన ఋషులు వారి మేధా శక్తితో మనకు అందించిన సంప్రదాయమే నేడు మనం ఆచరించే ఆచారాలు, ఆరాధనలు, పండుగలు మొదలైనవి. ఇంత మంది దేముళ్ళు ఎందుకు అవసరమో  ఒక చిన్న ఉదాహరణతో గమనిద్దాము. నీకు ఒక కలెక్టర్ ఆఫీసులో పని వుంది అనుకుందాము.  మనకు తెలిసి కలెక్టర్ గారే ఆ ఆఫీసుకి ముక్క్యులు.  నీకు కావలసిన పని కేవలము ఒక చిన్న సమాచారం అనుకుందాము.  అది ఫలనా రికార్డులో ఫలానా పేరు వున్నదో లేదో తెలుసు కోవాలి.  నీవు ఏమి చేస్తావు.  నేరుగా ఆ శాఖకు సంబందించిన గుమస్తా దగ్గరకి వెళ్లి సదరు విషయం తెలుసుకుంటావు.  కానీ నీకు కలెక్టర్ గారితో ఎలాంటి పని లేదు.  నీవు కలెక్టర్ గారిని కాలవ వలసిన అవసరంకూడా లేదు.  నీ పని అయిపోతుంది.  అదే మాదిరిగా నీకు ఏ శాఖకు చెందిన పని ఉంటే ఆ శాఖకు చెందిన గుమస్తా లేక శాఖా అధికారిని కలుసుకొని నీ పని చేసుకొంటావు.  అదే విధంగా కేవలం కలెక్టర్ గారితోనే అయ్యే పని అయితే అప్పుడు కానీ కలెక్టర్ గారిని కలవవు.  అదే మాదిరిగా మనకు దేముడికి సంబందించిన శాఖలు ఏర్పాటు చేసారు.  అవి ధనానికోసం లక్ష్మి దేవి, చదువుకి సరస్వతి దీవి. ధుర్యానికి దుర్గా దేవి.  అలానే విజ్ఞలను తొలగించటానికి గణపతిని.  ఈ విధంగా మనకు వేరు వేరు కోరికలను తీర్చటానికి వేరువేరు దేవతలు వున్నారు.  అదే నీకు కైవల్యం కావాలంటే ఆ పరబ్రహ్మయే శరణ్యం. 
పూజించేటప్పుడు శుచిగా ఉండటం  ఎందుకు.  : పూజ అనేది మానసిక ప్రక్రియ అంటే మనస్సుతో మాత్రమే మనం దేవి దేవతలను ఆరాధిస్తాము. ఆలా ఆరాధించాలంటే మనస్సు నిర్మలంగా ఉండాలి. ఎప్పుడైతే శరీరం పరిశుభ్రంగా ఉంటుందో అప్పుడు మనస్సుకూడ పరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి పూజించే వారు విధిగా స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలని ధరించి పూజకు కూర్చోవాలి. హిండవ సంప్రదాయం ప్రకారం విగ్రహారాధన అనేది 16 ఉపచారాలతో ఉంటుంది.  అందుకే షోడచోపచార పూజ అంటారు. 16 రకాలుగా దేవతారాధన చేయటం అని అర్ధం.  పూజ చేసేటప్పుడు చేతులు పుష్పాలు, అక్షింతలు, పత్రి, తోయం (నీరు) తో వినియోగించి అర్చిస్తుంటే, కళ్ళు ఆ దివ్య మంగళ విగ్రహాన్ని (రూపాన్ని) చూస్తూవుంటే చెవులు మంత్రాలు లేక నామాలు వింటూవుంటే మనస్సు అన్ని విధాల ఆ దివ్య మంగళ మూర్తిని స్మరిస్తూ ఉంటుంది.  అంటే పూజ చేసే భక్తుడు తన పంచేంద్రియాలను దేముడి మీదనే లగ్నాత చేసి అర్చిస్తాడు.  తద్వార త్రికరణ శుద్ధి సాధిస్తాడు.  ఈ రకమైన ఆరాధన ఏ ఇతర మతాలలో మనం చూడలేం.  

హిందూ ధర్మం అత్యంత ప్రాచీనమైనది, ప్రశస్తమైనది. అందుకే ఇప్పుడు ప్రపంచం మొత్తం హిందుత్వం వైపు మొగ్గు చూపుతున్నాయి మోక్షమార్గాన్నిచూపెట్టిన ఏకైక దర్మం హిందూ ధర్మం. దేముడిని సహేతువుగా చెప్పింది హిదూత్వం. దేముడు ఒక నమ్మకం కాదు ఒక నిజం.

ఓం శాంతి శాంతి శాంతిః 




ఇంకా వుంది  










కామెంట్‌లు లేవు: