జయలక్ష్మి పిరాట్ల.హైదరాబాదు
చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు
ప్రసిద్ధ కవి నవలాకారులు అయిన చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారుపశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లి లో 1867 సంవత్సరం సెప్టెంబర్ 26న జన్మించారు వీరి తల్లిదండ్రులు రత్నమ్మ వెంకన్న వీరవాసరం గ్రామంలో ప్రాథమిక విద్యను నర్సాపురం లో సెకండరీ విద్యను అభ్యసించారు 1887లో రాజమండ్రిలో మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణులైన కొంతకాలం రాజమండ్రిలో ఉపాధ్యాయునిగా పనిచేసి ఆ తర్వాత పోలవరం జమిందార్ ప్రారంభించిన సరస్వతి పత్రిక కు సహాయ సంపాదకునిగా పనిచేశారు మీరు కొంతకాలం మనోరమ దేశమాత అనే పత్రికను కూడా నడిపారు చిలకమర్తివారు అనేక గ్రంథాలు రాశారు ఆయన రచనలు గణపతి రామచంద్ర విజయం హేమలత అహల్యాబాయి రాజస్థాన కథాకళి కర్పూర మంజరి ద్రౌపదీ పరిణయం గయోపాఖ్యానం ఇంకా ఎన్నోప్రహసనాలుమొదలగునవి రచనలు వీరు గొప్ప దేశ భక్తులు సంఘ సంస్కర్త 1914 సంవత్సరంలో జరిగిన కాంగ్రెస్ మహాసభ లో పాల్గొని దక్షిణాఫ్రికా సమస్యపై ఉపన్యసించారు ఆంధ్ర విశ్వకళా పరిషత్తు19 43 కళాప్రపూర్ణ బిరుదును ప్రదానం చేసింది బాధకర విషయం ఏమిటంటే చిలకమర్తివారువారికి 26సంవత్సరములప్పుడు సంపూర్ణ అంధులు అయినారు అయిన ను వీరు.లేఖకునిద్వారా తెలుగు సాహిత్యానికి యనలేని సేవ చేశారు వీరినిఆంధ్ర మిల్టన్ అని పిలిచేవారు బెంగాల్ విభజన జరిగిన సందర్భంలో బి.పి.న్ చంద్రపాల్ దొరతనం వారికి చర్యను ఖండించండి అను విషయం పురస్కరించుకుని కలకత్తా నుండి బయలుదేరి రాజమహేంద్ర వారు వచ్చి ఇన్నీస్ పేట లో ఉపన్యసించిరి అప్పటినుండిఆపేటకు పాల్ చౌక్ అని పేరు వచ్చింది బిపిన్ చంద్ర పాల్ గారి ఉపన్యాసము విని జనులు ఆ ఇంగ్లీష్ ఉపన్యాసం తమకు తెలుగులో చెప్పమనగాచెప్పితరువాతచిలకమర్తివారి ఈ క్రింది పద్యమును బహిరంగముగా చెప్పిరి
భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగదూడలై చుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియ గట్టి
ఈ పద్యం విని సంతోష పారవశ్యం తోప్రజలు బ్రహ్మాండం పగులు నట్లు చప్పట్లు కొట్టిరి
ఈ పద్యము అన్ని పత్రికలలోనూ ప్రచురించిరి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా రాసిన ఈ పద్యం ప్రజలందరూ ఆ రోజుల్లో పాడుకొనే వారట చిలకమర్తి వారికి మూఢ విశ్వాసము లపై నమ్మకం లేదుఆరోజులో బ్రిటిష్ వారు దేశాభిమాని మహా పురుషుడు అయిన లాలాలజపతి రాయ్ గారి ని పట్టుకొని నగరంలో ఖైదు చేసి రి లాలాలజపతి రాయ్ గారి ప్రవాస మును గురించి ఈ క్రింది పద్యం చిలకమర్తివారు రచించి చదివిరి
చెరశాలలు పృథు చంద్ర శాల.లె యగున్ చేదోయి గీలిపించు న
య్యర దండల్ విరి దండలయ్యడును. హేయంబైన చోడంబలే
పరమాన్నం బగు మోట కంబళ్ళు దాల్పన్ పట్టు సెల్లా lలగున్
స్ధిరు డై యేనరుడాత్మ దేశమును భక్తి గొల్పు నవ్వానికిన్
ఈ విధంగా కవితలు గ్రంథములు ఎన్నో ప్రహసనాలు వ్రాసి ఈ మహాకవి19 46 జూన్ 17న మరణించినారు చిలకమర్తివారు స్వీయ చరిత్ర కూడా రాసిరి కన్నులు లేకున్నను చిలమర్తివారుతెలుగు సాహిత్యానికి నిరూపమైనసేవచేసిరి🙏🙏🙏
జయలక్ష్మి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి