19, డిసెంబర్ 2020, శనివారం

మాయ

 మా అమ్మ మాయ తో కలది. మాయ కంటికి కనబడని అగ్ని తత్వం. సూక్మమైనది సత్యమైనది అనంత మైనది. దీనికి మూలమైన శక్తి రాహు కేతు తత్వం. నీడలా వుండే స్వభావం. నీడకు కూడా కదలిక వున్నది. నీడకు రూపు లేదు. అది కాంతి కనుక. కాంతి వస్తు లక్షణమే. వస్తువు ధాతు లక్షణము. ధాతువు వాసన పర మైనది. వాసన తవ్యాప్తం కలది. వ్యాప్తి అనగా చైతన్యం. చైతన్యం శరీర ధర్మం. లేనియెడల చైతన్యలక్షణమైన అగ్ని తత్వం తెలియదు. అగినికినమూలం కిరణం. కిరణ మునకు మూలం ఆత్మ ఆటమ్. మానవ నిర్మాణ క్రమం వక విచిత్రమైన లక్షణము కలది. ఏదైనా వస్తువు అన్నీ వక లాగే ఆకారము కాల్చును. కాని అన్నీ మనం సృష్టించినవాడు. సృష్టించింది మాయ లయం అగుట మానవ ధర్మం. మానవ నిర్మిత ములు లయమగుటయే వాటి ధర్మం. మాయకు శక్తిగల అమ్మ కూడా బధ్దురాలై యుండును. న అన్య పంథా వేరు మార్గం లేదు. అమృత తత్వము తప్ప వేరు మార్గము జీవమునకు లేదు. విద్య వలననే అమృతత్వం. అవిద్యగా నాశన హేతువు. అది భూమిపై మాత్రమే జీవ రూప మార్గమే తప్ప వేరు మార్గం లేదు. అమృతమస్తు. సర్వం అమృతమగుగాక. జీవుడు మృగమును తెలియుట అమృతము. దేహమును విడుచు స్వభావం తెలియుట అమృతము. దేవుడు కూడా దేహమును విడువవలెను. వేరు మార్గం లేదు.

కామెంట్‌లు లేవు: