4, ఆగస్టు 2021, బుధవారం

సనాతన ధర్మం - వర్ణాలు*

 *సనాతన ధర్మం - వర్ణాలు*

----------------------------------------


జన్మనా జాయతే శూద్రః

కర్మణా జాయతే ద్విజః

వేద జ్ఞానేషు విప్రాణాం

బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః


(ఋగ్వేదం - ఐదవ మండలం లోని ఆత్రేయ స్మృతి లోని 141-142 వాక్యాలు) 


భావం: పుట్టగానే అందరూ శుద్రులే (అనగా శిశువుకి జన్మతః జ్ఞానం అనేది అసహజం)..

కర్మ చేత మనిషి ద్విజుడవుతాడు..

వేదం నేర్చిన వారే విప్రులు..

బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులు.


అదేవిధంగా., "వేద విధులతో సంచరించక, దేవతలను పూజించక, వివేకములు లేక, కేవలం లౌకిక వాక్కులు నాశ్రయించువారు బ్రాహ్మణ కులంలో

పుట్టిన వారైననూ వారు బ్రాహ్మణులు కానే కారు. శూద్రులే అగుదురు.


----------------------------------------


వర్ణాశ్రమా అపి గుణకర్మాచరతో హిభవంతి.అత్రాహ మనుః

శూద్రే బ్రాహ్మణ తామేతి బ్రాహ్మణ శ్చైతి శూద్రతాం

క్షత్రియాజ్ఞాత మేవం తు, విద్యాత్ వైశ్యాత్తథైవచ"


(మను ధర్మ శాస్త్రం 10-65)


భావం: బ్రాహ్మణ గుణాలు కలిగిన శూద్రుడు బ్రాహ్మణుడే యగును.

శూద్రగుణాలు కలిగిన బ్రాహ్మణుడు శూద్రుడగును. అదేవిధంగా క్షత్రియజాతి, వైశ్యజాతి

కూడా కేవలం పుట్టుక వలనే కాక వారి వారి గుణ, కర్మాచరణల వలన యేర్పడును.


----------------------------------------

కామెంట్‌లు లేవు: