17, జనవరి 2022, సోమవారం

 బెంగళూరును అతిచౌకగా అనగా కేవలం మూడు లక్షల రూపాయలకే అమ్మేసిన నాటి పాలకుడెవరు ?

.............................................................


(1) ప్రళయకావేరి అనగా ?


(అ) కావేరినదికి ఉపనది

(ఆ) కావేరి నదికే మరోపేరు

(ఇ) పులికాటు సరస్సు

(ఈ) చిలుకసముద్రం


(2) శ్రీకృష్ణదేవరాయలకు ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కొడుకులు.ఒక కూతురైన తిరుమళాంబను ఆళియ రామరాయలు మనువాడాడు.మరో కూతురును ఆళియరామరాయల తమ్ముడైన తిరుమలదేవరాయలు పెండ్లాడాడు. పెద్దకొడుకు పేరు తిరుమలయ్యదేవరాయలు. చిన్న కుమారుడి పేరు గురించి ఎక్కడా ప్రస్తావనలు లేవు, తెలియదు. మరి శ్రీకృష్ణదేవరాయల రెండో కూతురి పేరేమో చెప్పగలరా ?


(అ) తిమ్మాంబ

(ఆ) వెంగళాంబ

(ఇ) మంగాంబ

(ఈ) కృష్ణాంబ


(3) 1542 నుండి 1572 వరకు సదాశివరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించాడు. ఇతను పేరుకే రాజు, రాజ్యాధికారం ఆళియ రామరాజు, తిరుమలదేవరాయలుదే. సదాశివుడే తుళువవంశంలో చివరి చక్రవర్తి. ఇంతకు ఇతనేవరి కొడుకు ?


(అ) శ్రీకృష్ణదేవరాయల స్వంత తమ్ముడైన శ్రీరంగరాయల కొడుకు.

(ఆ) శ్రీకృష్ణదేవరాయల స్వంత అన్నయైన వీరనరసింహరాయల కొడుకు.

(ఇ) శ్రీకృష్ణదేవరాయల స్వంత తమ్ముడైన అచ్యుతరాయల కొడుకు.

(ఈ) తుళువ నరసరాజు కొడుకు.


(4) సాళువతిమ్మరాజు లేదా సాళువ తిమ్మరుసు (అప్పాజీ) తమ్ముడి పేరేమిటి ?


(అ) సాళువ గోవిందరాజులు

(ఆ) సాళువ మంగు

(ఇ) సాళువ గోపమంత్రి

(ఈ) సాళువ రామరుసు


(5) శ్రీకృష్ణదేవరాయల తండ్రైన నరసరాజు సాళువ నరసింగుని సేనాని, ఇతడు బెడందకోటపై దాడిచేసి దానినిసాధించాడు. బెడందకోట అనగా ఇప్పటి ?


(అ) ఆదోని

(ఆ) బీజాపురం

(ఇ) బీరారు

(ఈ) బీదరు


(6) శివాజీ సోదరుడైన ఏకోజి (మరోపేరు వెంకోజీ ) నుండి 3 లక్షల రుపాయలకు బెంగళూరును కొన్న మైసూరు పాలకుడెవరు ?


(అ) మొదటి కృష్ణరాజవడయార్

(ఆ) రెండోదేవరాజ వడయార్

(ఇ) మూడవ చామరాజ వడయార్

(ఈ) నాలుగవ చామరాజ వడయార్.


(7) ఒకసారి శ్రీకాళహస్తీలో మరోసారి తిరుమల శ్రీహరి సన్నిధిలో శంఖం నుండి జాలువారిన పవిత్ర జలంతో మరోసారి విజయనగరంలో ఇలా మొత్తం మూడుసార్లు పట్టాభిషక్తుడైన విజయనగర చక్రవర్తి ఎవరు ?


(అ) కంపన (కంపరాయలు)

(ఆ) మల్లికార్జున దేవరాయలు

(ఇ) విరూపాక్ష దేవరాయలు

(ఈ) అచ్యుతదేవరాయలు


(8) శివాజీ తనయుడు రాజారాం (సాహుజీ) ఔరంగజేబు చేతిలో ఓడిపారిపోయాడు. హిందూరాష్ట్ర స్థాపనకు కారకుడైన శివాజీ తనయుడు కష్టాలలో వున్నాడని ఈ రాణి విని, అతనికి తన రాజ్యంలో ఆశ్రయం కల్పించింది. దీంతో కోపించిన ఔరంగజేబు రాణిపై యుద్ధం ప్రకటించాడు. అజ్మత్ అరా నేతృత్వంలో మొగలుల భారీసేనలు దాడికి దిగాయి. ఈ రాణి ఆ సేనలను చిత్తుగా ఓడించింది.గతిలేక అజ్మత్ ఆరా ఆమెతో సంధిచేసుకొని వెనుదిరిగాడు. ఔరంగజేబునే ఎదిరించిన ఈ ధీరోద్ధాత రాణి గురించి మన పాఠ్యప్రణాళికలో లేకపోవడం దురదృష్టకరం.ఇంతకు ఆ రాణి పేరేమిటో మీకు తెలిసినట్టైతే చెప్పండి.


(అ) మహరాణి ఒనకే ఓబక్క

(ఆ) కెళదిరాణి చెన్నమాంబ

(ఇ) రాణిమంగమ్మ

(ఈ) రాణితిమ్మమాంబ


(9) వేలాపురానికి ప్రస్తుతమున్న నామధేయం ఏమిటి ?


(అ) వేల్పురము

(ఆ) వేలానగర్

(ఇ) గుడియాత్తం

(ఈ) వేలూరు (రాయవేలూరు)


(10) చావనైనా చస్తాను కాని మతం మారనని ధైర్యంగా ప్రశ్నించి ఔరంగజేబు చేతిలో చిత్రహింసలకు గురై మరణశిక్ష పొందిన ఛత్రపతి శివాజీ తనయుడెవరు ?


(అ) ఛత్రపతి సాహు

(ఆ) ఛత్రపతి రాజారాం

(ఇ) ఛత్రపతి శంభాజీ

(ఈ) ఛత్రపతి ఏకోజి

......................................................................... జి.బి.విశ్వనాథ.డిప్యూటి కలెక్టర్‌ (రిటైర్డ్) 9441245857, అనంతపురం.

కామెంట్‌లు లేవు: