అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ -4 .
ఇప్పటివరకు మీకు అష్టస్థాన పరీక్షలలో మొదటిదైన నాడీపరీక్ష గురించి వివరించాను . ఇప్పుడు మిగిలినవాటి గురించి వివరిస్తాను .
* స్పర్శము -
స్పర్శము అనగా తాకుడు . రోగి యొక్క శరీరాన్ని తాకి చల్లదనము , గరుకుతనము , చమట , ఆవిరి మున్నగు వాటిని గుర్తించుట .
వాతము -
వాతము నందు శరీరము యొక్క స్పర్శ ఆరిపోయి చిన్నగా చల్లదనం పెరుగుచుండును .
పిత్తము -
పిత్తము నందు శరీరము వేడిగా ఉండును .
శ్లేష్మము -
శ్లేష్మము నందు శరీరము చల్లగా ఉండును .
జ్వరము నందు శరీరము పొగలుగా , తాపముగా , ఉష్ణము మరణముగా ఉండును . చనిపోవువానికి శరీరము కొయ్య బారిపోవును .
* రూపము -
వాతము నందు శరీరము నలుపు , పిత్తము నందు పసుపుపచ్చ , శ్లేష్మము నందు తెలుపు వర్ణములు కలిగి కనపడును . ఆయా వ్యాదులను బట్టి రోగి యొక్క ఆకారము తెలుపు మున్నగు రంగులను కలిగి ఉండును . పాండు వ్యాధి నందు శరీరము తెల్లని రంగు కలిగి పాలిపోయి ఉండును . క్షయ వ్యాధి యందు శరీరము ఆరిపోవును . శరీరము నందు కొవ్వు ఉండదు . కామెర్ల వ్యాధి నందు శరీరము పచ్చగా ఉండును . ఇలా ఆయా వ్యాధులను బట్టి శరీరం రూపము మారుచుండును .
* శబ్దము -
శబ్దము అనగా రోగి యొక్క మాట్లాడు ధ్వనిని వాతము నందు శబ్దము నందు హెచ్చు తగ్గులు కలిగి ఉండి నిలకడ లేకుండా ఉండును . పిత్తము నందు అధికంగా , ఉత్సాహముగా ధ్వని ఉండును. శ్లేష్మము నందు హీనస్వరము కలిగి ఉండును . భ్రమ , అపస్మారము , పైత్యజ్వరము , సన్నిపాతము మున్నగు వ్యాధుల యందు రోగి అతిగా ధ్వని కలవాడై ఉండును . అనగా అతిగా మాటలాడువాడై ఉండును . వికృతముగా అరుచును . రహస్యములు అన్నియు పైకి చెప్పును . భయము , సిగ్గు , దుఃఖము మున్నగు వాటి యందు శబ్దము క్షీణించి ఉండును . ఇలా అన్నింటికి తెలుసుకొనవలెను .
* నేత్రములు -
ఇది అత్యంత ముఖ్యమైన పరీక్ష . వాతము నందు కండ్ల చుట్టూ గుండ్రని నలుపు బయలుదేరును . వీర్యనష్టము నందు కూడా ఇటువంటి లక్షణాలు కనిపించును . వాతము నందు బూడిద వర్ణముగా కొంచం నీరు కూడా చేరుచుండును . పిత్తరోగము నందు నేత్రములు పసుపుగాను , ఎర్రగాను త్వరగా పూసులు కట్టును . శ్లేష్మము నందు బరువుగాను తెల్లని పూసి కలిగి నీరు కారుచుండును .
* మల పరీక్ష -
వాతరోగము నందు మలబద్దకం కలుగును . మరియు పురీషము ( మలం) నల్లనై మిక్కిలి కఠినంగా ( గట్టిగా ) వెడలుచుండును . పిత్తవ్యాధి యందు పసుపుపచ్చగానైనా ఎర్రగా రక్తముతో కూడినదై ఉండును . మరియు మృదువుగా ధారాళముగా విరేచనమగును . శ్లేష్మ వ్యాధుల యందు మలము తెల్లగనను , అజీర్తిగను , బంకగను , నురుగుతో గట్టిగా వెడలుచుండును . ఏవైనా రెండురకాల దోషముల యందు రెండు రెండు లక్షణములుగా ఉండును. వేడిచేసినప్పుడు గుదము పుండై మలము రక్తచారలు కలిగి గాని రక్తముగాని వెడలును . జ్వరము నందు సాధారణముగా మలబద్ధకముగా ఉండును . అనాహము , ఆధ్మానము మున్నగు వ్యాధుల యందు మలము ప్రేగుల యందు బంధించబడి పొట్ట ఉబ్బు చేయును . కడుపునొప్పి కలిగించును . అతిసారం మున్నగు వ్యాధుల యందు మలము జలధాతువుతో కలిసి పల్చనై ప్రేగులంతట నిండి బుడబుడమనే ధ్వనితో పలుమారు వెడలుచుండును .
పాశ్చాత్య వైద్యులు మలమును నీటి యందు వేసి పరీక్షించెదరు . నీటి యందు మలము వేసినప్పుడు విడిపోయిన , పైకి తేలినను వాతమనియు , కలిసిపోయిన పిత్తమనియు , నీటి అడుగుపోయిన శ్లేష్మము అనియు తెలుసుకొనెదరు . మలము యొక్క వాసన వర్ణము ( రంగు ) పరిమాణము బట్టి కూడా దోషములను వ్యాధులను పరీక్షించెదరు .
తరవాతి పోస్టు నందు మరింత విలువైన సమాచారం మీకు అందిస్తాను . ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
గమనిక -
నేను రచించిన నా మూడొవ గ్రంథం అయిన " సర్వమూలికా చింతామణి " యందు అనేక రకాల మొక్కల గురించి అత్యంత విపులముగా , వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది . మా వంశపారంపర్య రహస్యయోగాలు మాత్రమే కాకుండా అత్యంత పురాతన , అరుదైన గ్రంథాలు మరియు కొన్ని తాళపత్రాల నుంచి తీసుకోబడిన ఎన్నొ విలువైన యోగాలు అన్ని ఎంతో పరిశోధించి మీకు ఇవ్వడం జరిగింది . ఒకటి మాత్రం ఖచ్చితముగా చెప్పగలను . ఈ గ్రంథములో లభ్యమయ్యే సంపూర్ణ సమాచారం మరియు అత్యంత సులభయోగాలు మరే గ్రంథములో మీకు దొరకవు . ఈ ఒక్క గ్రంథం రచించుటకు సుమారు సంవత్సన్నర సమయం కేటాయించడం జరిగింది . 50 రకాల మొక్కల గురించి ఈ ప్రథమ భాగములో ఇవ్వడం జరిగింది . కేవలం మొక్కల గురించియే కాకుండా యే వ్యాధికి ఏమి పథ్యం చేయవలెనో కూడ వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది .
ఈ గ్రంథం ఎక్కువ కాలం మన్నికగా ఉండుటకు కుట్టించి ఇవ్వడంతోపాటు 90gsm పేపర్ వాడటం జరిగింది . మొక్కల యొక్క రంగుల ఫొటోస్ తో పాటు సంపూర్ణ సమాచారం ఇందులో మీకు లభ్యం అగును . దీని ఖరీదు 550 రూపాయలు ( ఆంధ్ర మరియు తెలంగాణ ) మరియు వేరే రాష్ట్రమునకు పంపుటకు మరొక్క 50 రూపాయలు అదనంగా ఖర్చు అగును .
ఈ గ్రంథము కావలసిన వారు 9885030034 నంబర్ కి phoneపే , google pay or paytm చేసి ఇదే నంబర్ కి whatsup నందు screenshot పెట్టి మీ Adreass pincode and landmark తో సహా ఇవ్వగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు .
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి