3, ఫిబ్రవరి 2022, గురువారం

కందుకము

 శ్లోకం:☝️

*యథా కందుకపాతే నో*

   *త్పతత్యార్యః పతన్నపి l*

*తథా త్వనార్యః పతతి*

   *మృత్పిండపతనం యథా ll*

    - భతృహరి


కందుకము వోలె సుజనుడు

గ్రిందంబడి మగుడ మీఁదికిన్నెగయుఁజుమీ !

మందుడు మృత్పిండము వలె

గ్రిందబడి యడగి యుండుఁగృపణత్వమునన్


భావం: బంతి నేలకేసి కొడితే ఎలా తిరిగి మీదికి లేస్తుందో, అలాగే ధీరుడు ఒక వేళ ఓటమి పాలయినా తిరిగి పుంజుకుని లేస్తాడు. బద్ధకస్థుడు మాత్రం నేల కేసి కొట్టిన మట్టిముద్ద లాగా మరింక పైకి లేవడు.

కామెంట్‌లు లేవు: