*తులసి ఆకు ప్రయోజనాలు.*.
⁍ చాలా మందికి నోటి దుర్వాసన సమస్య వేధిస్తుంటుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు ప్రతిరోజూ రాత్రి నీళ్లలో తులసి ఆకులను నానబెట్టి.. ఉదయాన్నే ఆ నీటితో పళ్లు తోముకోవాలి. ఇలా నిత్యం చేయడం వల్ల నోటి దుర్వాసన పోతుంది.
⁍ నోట్లో పొక్కులు, అల్సర్లు కూడా మానిపోతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
⁍ గొంతు నొప్పి సమస్య కూడా చాలా మందిని వేధిస్తుంటుంది. నీరు తాగినా.. ఏదైనా తిన్నా కాని తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు నీళ్లలో తులసి ఆకులు వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత గోరువెచ్చని తులసి నీటిని తాగితే.. గొంతునొప్పి తగ్గుతుంది.
⁍ తులసి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. తులసి, తేనెలో యాంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల చర్మ సమస్యలు దూరమవుతాయి.
⁍ ఇలా తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు కూడా తగ్గుతుంది.
⁍ నోటిపూత సమస్య ఉంటే ఉదయాన్నే కొన్ని తులసి ఆకులను నమిలి మింగితే.. తగ్గుతుంది.
⁍ రోజూ తులసి ఆకులను తింటే.. శరీరంలో కొవ్వును సైతం తగ్గించుకోవచ్చు. దీంతోపాటు శరీరంలో మలినాలు బయటకు వెళ్లి బరువు కూడా తగ్గుతారు.
⁍ నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రోజూ తులసి ఆకులను తింటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
⁍ జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడటంతోపాటు.. ఉదర సమస్యలు కూడా తగ్గుతాయి.
⁍ అందుకే ప్రతిరోజూ తులసి ఆకులను తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
⁍ తులసిని ఎలా తీసుకున్నా అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి