2, ఆగస్టు 2022, మంగళవారం

ఉసిరికాయతో వైద్యం

 ఉసిరికాయతో వైద్యం - 


 * ఉసిరి , తాని , కరక్కాయ ( త్రిఫల ) చూర్ణాన్ని ఆవునెయ్యితో కలిపి ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే మధుమేహ వ్యాధి తగ్గుతుంది . 


 * ఉసిరిక మురబ్బాను లేదా పూటకు రెండు లేదా మూడు ఉసిరికాయల చొప్పున తీసుకుంటే అన్ని రకాల పైత్యాలు తగ్గుతాయి.


 * ఉసిరికాయ రసం 1 టీ స్పూన్ , క్యారెట్ రసం 1 గ్లాస్ , తేనే 1 టీ స్పూన్ కలిపి రోజుకు ఒకటి రెండు సార్లు ఈ మిశ్రమాన్ని తీసుకున్నట్లు అయితే క్యాన్సర్ వ్యాధికి , కోబాల్ట్ చికిత్స తీసుకున్న వారికి నీరసం తగ్గి ఉత్సాహం గా కూడా ఉంటారు. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.


 * ఉసిరిక రసము ఒక టీ స్పూన్ , కొబ్బరి పాలు ఒక కప్పు కలిపి రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే జీర్ణకోశంలో గల నులిపురుగులు , బద్దెపురుగులు , కొంకి పాములు , ఎలిక పాములు వంటివి నశిస్తాయి. 


 * ఉసిరిక రసము 1 టీ స్పూన్ , తేనే 1 టీ స్పూన్ కలిపి ప్రతిరోజు ఉదయం తీసుకుంటూ ఉంటే ఉబ్బసం , స్కర్వీ వ్యాధి , రక్తహీనత ( ఎనిమియా ) వంటివి తగ్గుతాయి . 


 * సాధారణ జలుబు , జ్వరం ఉన్నవారు కూడా ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం తీసుకుంటూ ఉంటే వాటిని తగ్గించవచ్చు. 


 * ఉసిరికాయలు , పెద్ద ఉల్లిగడ్డలను సమానంగా తీసుకుని వాటిని నూరి రసమును తీసి ఆ రసాన్ని ప్రతిరోజు తాగుతూ ఉంటే రక్తం అభివృద్ధి చెంది శుద్ది చేయబడుతుంది.


 * ఉసిరిక వగరు , ద్రాక్షాపళ్లు ఈ రెండింటిని సమభాగాలుగా శొంఠిని కూడ కలిపి నూరి దానిని తేనెతో కలిపి తీసుకుంటే నోటి అరుచి తగ్గుతుంది .


 * ప్రతిరోజు ఒక ఉసిరికాయని తిన్నట్లైతే అన్నిరకాల పైత్యాలు తగ్గుతాయి . 


 * ప్రతిరోజు ఉసిరికాయని తింటూ ఉంటే కఫము తగ్గును . మేధస్సు పెరుగుతుంది. నేత్రవ్యాధులు తగ్గుతాయి . 


 * పాత ఉసిరికాయల పచ్చడిని తింటూ ఉంటే గర్భిణి స్త్రీలకూ ఎంతో మంచిది. 


 * ఉసిరికాయ చెట్టు వేరుతో కషాయాన్ని కాచి త్రాగుతూ ఉంటే అతిదాహం తగ్గుతుంది . 


 * పచ్చి ఉసిరికాయలు దొరకనప్పుడు ఎండు ఉసిరికాయలు వాడవచ్చు. 


 * ప్రతిరోజు ఉసిరికాయను తింటూ ఉంటే మూలవ్యాధులు తగ్గిపోతాయి . ఆయుష్షు పెరుగును .


 * జీర్ణశక్తి పెరుగుతుంది. 


 * పాత ఉసిరిక పచ్చడిని తినడం వలన విరేచనాలు నివారించ వచ్చు. వాతవ్యాధులు ను తగ్గిస్తుంది.

 

 * ఉసిరిక వగరు తినడం వలన మెదడు నందు చేరిన చెడు నీరు తగ్గిపొతుంది.


 * కడుపులో తిప్పడం ఉన్నవారు ఉసిరిక ని ఆహారంలో బాగం చేసుకొండి. 


 * ఎండిన ఉసిరికాయల రసాన్ని కాచి దానిని చర్మం మీద పొక్కులు , చర్మవ్యాదులు , వాపులు ఉన్న ప్రదేశంలో రాసినట్లైతే మంచి ప్రభావం కనిపిస్తుంది.


 * పండు ఉసిరికాయల రసాన్ని తీసుకుంటూ ఉంటే ఉబ్బువ్యాధులు తగ్గుతాయి . 


 * ఉసిరికాయలోని గింజలను నీటితో కలిపి నూరి దానికి తగినంత చక్కర కలిపి తీసుకుంటూ ఉంటే కుసుమవ్యాధులు తగ్గుతాయి . 


 * ఉసిరిక లేహ్యాన్ని తీసుకుంటే భయంకరమైన దగ్గులు నివారించబడతాయి. క్షయ వ్యాధిలో వచ్చే దగ్గు కూడా నివారించబడుతుంది. 

కామెంట్‌లు లేవు: