29, నవంబర్ 2022, మంగళవారం

తెలుగు అభివృద్ధి సమితి

 *తెలుగును ప్రాణాలతో ఉంచుదాం*


ఇందేమిటి తెలుగును ప్రాణాలతో ఉంచుదాం అంటున్నారు, ఏమిటి ఇది అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవలసిందే.


1. మనకు తెలియకుండా మనమే తెలుగును చంపేస్తున్నాము. అంటే మనం రోజూ తెలుగు మాట్లాడుతున్నాము కదా ఎలా ప్రాణాలు పోతాయి అనుకుంటున్నారు కదా. అంతవరకే కాని మనం తరచి చూస్తే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు తెలుగు చదవడము వ్రాయడము చేయలేకపోతున్నారు. మీ కుటుంబములోనే పరిశీలించుకొని చూసుకోగలరు. చాల మందికి రాదు. ఏదో చిన్న పిల్లలు మాట్లాడినట్లు కొన్ని పదాలతో కాలం గడిపేస్తున్నాము. నిజముగా భాష తియ్యదనాన్ని ఆస్వాదించలేక పోతున్నాము. కారణం ఆంగ్లము మనను కమ్మేససింది.

2. ప్రభుత్వము కూడా ఇప్పుడు ఆంగ్ల మాధ్యమంలో భోదన మొదలు పెట్టింది ఇక పిల్లలను తెలుగు మాధ్యమంలో చదివిద్దాము అనుకునే వారికి పాఠశాలలు వుండవు.

3. ఇంతవరకైతే ఫరవాలేదు కాని ఇప్పుడు తెలుగు భాషనే పాఠశాలలకు, ఇంటర్ మీడియట్ కళాశాలకు, డిగ్రీ కళాశాలలకు, పిజి కళాశాలలకు, పి హెచ్ డి లకు దూరం చేసే ప్రయత్నం చేయడం జరుగుతున్నాది. ఇది ఎలా అంటే ఆయా కళాశాలలో *తెలుగు అనే సబ్జెక్టు* అసలు చెప్పక పోవడమే దానికి బదులుగా సంస్కృతము, ఫ్రెంచ్, జర్మన్ ఇలా ఇతర భాషలను భోదిస్తున్నారు. ఆ భాషలవల్ల మన జీవితాలలో ఎటువంటి ఉమపయోగము లేదు. ప్రస్తుతాని ఇది ప్రైవేట్ కళాశాలలో వ్యాప్తి చెంది పట్టణాలలో వుంది, ఈ విధానం గ్రామీణ, జిల్లాల్లో కూడా త్వరలో జరగబోతుంది.


ఇలా అయితే తెలుగు భాష చావడం ఖాయం. విత్తలనాల ఉత్పత్తే ఆగిపోతే ఆ species మొత్తం అంతరించి పోతుంది. దానితో మన సంస్కృతి, మన అస్తిత్వం (గుర్తింపు), మన సంస్కారాలు అన్నీ నశించి పోతాయి చివరకు మనందరము భాషా హంతకులగా మిగిలి పోతాము.


ఆలోచించండి ఏమి చేద్దాం. భాషను ప్రాణాలతో ఉంచుదామా వద్దా?


ప్రాణాలతో వుంచే భాషా వైద్యులు అవ్వాలనుకు వారందు ఈ క్రింది సమూహంలో చేరి మా ఈ ప్రయత్నంలో భాగస్వమ్యులు కాగలరు.


లేదు మన తెలుగు చస్తే మంచిదే చంపేసి భాషా హంతకునిగా మారుతాను అనుకునే వారు ఈ సంమూహంలో చేరకండి.


మీ ఇష్టం.


*తెలుగు అభివృద్ధి సమితి*వాట్సప్ సమూహం లో చేరండి *తెలుగు భాషా వైద్యులు* మారండి. తెలుగును ప్రాణాలతో నిలపండి. మీరు భాషా పండితులు అవ్వాల్సిన అవసరం లేదు. తెలుగు వారు అయితే చాలు.


జై భారత్, జై హింద్


జై తెలుగు జైజై తెలుగు


తెలుగు వైద్యుడను అవుతాను అనే సంకల్పం చేసుకొని ఈ *తెలుగు అభివృద్ధి సమితి* లో చేరగలరు.


మేక రవీంద్ర




https://chat.whatsapp.com/ElDcc48YDyS6lgHMrOVSpy

కామెంట్‌లు లేవు: