7, డిసెంబర్ 2022, బుధవారం

దత్తాత్రేయాష్టోత్తర శతనామావళి

 వేదధర్ముడు సందీపకునికి ఉపదేశించిన దత్తాత్రేయాష్టోత్తర శతనామావళి 


నమస్తే పుండరీకాక్ష దత్తాత్రేయ జగద్గురో! 

సిద్ధులు కూడా ఎవరి వలన సిద్ధిని పొందుతున్నారో అటువంటి స్వామికి నమస్కారం అంటూ అష్టోత్తర శతనామావళిని ఉపదేశించారు వేదధర్ముల వారు. ఇది పరంపరాగతమైన, ఋషిప్రోక్తమైన అష్టోత్తర శతనామావళి. 


స్వామిని స్మరిస్తే చాలు అనుగ్రహిస్తాడు, స్మరించిన వారి హృదయాన్ని తన నివాసంగా చేసుకుంటాడు. తినేదానిని ఒక్కసారి స్వామికి నివేదన చేస్తే అదే ఆయనకు మహానైవేద్యం. తినేటప్పుడు దత్తస్మరణ చేసుకొని తింటే మహాదానం చేసిన ఫలం లభించగలదు. ఇంద్రాదులకు కూడా దుర్లభమైన ఐశ్వర్యం లభిస్తుంది. రక్షణ లేని స్థలాలలో ఒక్కసారి స్మరిస్తే చాలు రక్షణనిస్తాడు. రాజద్వారాలయందు, అడవులలోను, దుర్గమమైన ప్రాంతాలలో ఉన్నప్పుడు దత్తుని నామాలు స్మరిస్తే చాలు. ఈ నామాలను స్మరిస్తూ ఆయా అవయవాలను స్పృశిస్తే ఆ అవయవాలలో ఉన్న రోగములు కూడా పోతాయి. కాళ్ళు, చేతులు కడుక్కొని ఆచమనం చేసి దత్తధ్యానపూర్వకంగా ఈ నామాలను పఠించాలి. 


శ్రీ దత్తాయ నమః; దేవతద్దాయ నమః; బ్రహ్మదత్తాయ నమః; విష్ణుదత్తాయ నమః; శివదత్తాయ నమః; అత్రిదత్తాయ నమః; ఆత్రేయాయ నమః; అత్రివరదాయ నమః; అనసూయాయ నమః; అనసూయాసూనవే నమః; అవధూతాయ నమః; ధర్మాయ నమః; ధర్మపరాయణాయ నమః; ధర్మపతయే నమః; సిద్ధాయ నమః; సిద్ధిదాయ నమః; సిద్ధిపతయే నమః; సిద్ధిసేవితాయ నమః; గురవే నమః; గురుగమ్యాయ నమః; గురోర్గురుతరాయ నమః; గరిష్ఠాయ నమః; వరిష్ఠాయ నమః; మహిష్ఠాయ నమః; మహాత్మనే నమః; యోగాయ నమః; యోగగమ్యాయ నమః; యోగాదేశకరాయ నమః; యోగపతయే నమః; యోగీశాయ నమః; యోగాధీశాయ నమః; యోగపరాయణాయ నమః; యోగిధ్యేయాంఘ్రిపంకజాయ నమః; దిగంబరాయ నమః; దివ్యాంబరాయ నమః; పీతాంబరాయ నమః; శ్వేతాంబరాయ నమః; చిత్రాంబరాయ నమః; బాలాయ నమః; బాలవీర్యాయ నమః; కుమారాయ నమః; కిశోరాయ నమః; కందర్పమోహనాయ నమః; అర్థాంగాలింగితాంగనాయ నమః; సురాగాయ నమః; విరాగాయ నమః; వీతరాగాయ నమః; అమృతవర్షిణే నమః; ఉగ్రాయ నమః; అనుగ్రరూపాయ నమః; స్థవిరాయ నమః; స్థవీయసే నమః; శాంతాయ నమః; అఘోరాయ నమః; గూఢాయ నమః; ఊర్ధ్వరేతసే నమః; ఏకవక్త్రాయ నమః; అనేక వక్త్రాయ నమః; ద్వినేత్రాయ నమః; త్రినేత్రాయ నమః; ద్విభుజాయ నమః; షడ్భుజాయ నమః; అక్షమాలినే నమః; కమండలధారిణే నమః; శూలినే నమః, డమరుధారిణే నమః; శంఖినే నమః; గదినే నమః; మునయే నమః; మౌనినే నమః; శ్రీవిరూపాయ నమః; సర్వరూపాయ నమః; సహస్రశిరసే నమః; సహస్రాక్షాయ నమః; సహస్రబాహవే నమః; సహస్రాయుధాయ నమః; సహస్రపాదాయ నమః; సహస్రపద్మార్చితాయ నమః; పద్మహస్తాయ నమః; పద్మపాదాయ నమః; పద్మనాభాయ నమః; పద్మమాలినే నమః; పద్మగర్భారుణాక్షాయ నమః; పద్మకింజల్కవర్ఛసే నమః; జ్ఞానినే నమః; జ్ఞానగమ్యాయ నమః; జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః; ధ్యానినే నమః; ధ్యాననిష్ఠాయ నమః; ధ్యానస్థిమితమూర్తయే నమః; ధూళిధూసరితాంగాయ నమః; చందనలిప్తమూర్తయే నమః; భస్మోద్ధూళితదేహాయ నమః; దివ్యగంధానులేపినే నమః; ప్రసన్నాయ నమః; ప్రమత్తాయ నమః; ప్రకృష్టార్థప్రదాయ నమః; అష్టైశ్వర్యప్రదాయ నమః; వరదాయ నమః; వరీయసే నమః; బ్రహ్మణే నమః; బ్రహ్మరూపాయ నమః; విష్ణవే నమః; విశ్వరూపిణే నమః; శంకరాయ నమః; ఆత్మనే నమః; అంతరాత్మనే నమః; పరమాత్మనే నమః!! 

శ్రీదత్తాత్రేయాయ నమోనమః!! అనఘాయై నమః!! అనఘాయ నమః! అనఘానఘాభ్యాం నమః!!


ఈ నామములు పఠించే ముందు చదవవలసిన శ్లోకం – 

పీతాంబరాలంకృత పృష్ఠభాగం భస్మావగుంఠామలరుక్మదేహమ్!

విద్యుత్సదాపింగ జటాభిరామం శ్రీదత్తయోగీశమహంనతోఽస్మి!!

కామెంట్‌లు లేవు: