: *ఆత్మానమేవ మన్యేత కర్తారం సుఖ దుఃఖయోః|*
*తస్మాత్ శ్రేయస్కరం మార్గం ప్రతిపద్యేతనత్రచేత్||*
ఆరోగ్యంగా ఉండడానికైనా, రోగాలబారిన పడడానికైనా ఎవరికివారే బాధ్యులు. అందుచే, శ్రేయస్కరమైన దారిని వెతుక్కోవాలి. అప్పుడే, ఆరోగ్యాన్ని గురించిన చింత ఉండదు.
*🙏🙏సర్వే జనాః సుఖినోభవంతు 🙏🙏*
:
ఈశ్వరుడు అష్టవిధ మూర్తి. కాళిదాస మహాకవి ఈశ్వరుడి అష్టమూర్తి తత్త్వాన్ని ఇలా స్తోత్రం చేశాడు. యా సృష్టిః స్రష్టురాద్యా వహతి విధి హుతాం యా హవిర్యా చహోత్రీ యే ద్వే కాలం విధత్తః శ్రుతి విషయగుణా యా స్థితా వ్యాప్య విశ్వమ్|| యామాహుః సర్వభూత ప్రకృతిరితి యయా ప్రాణినః ప్రాణవనః ప్రత్యక్షాభిః ప్రపన్నస్తనుభిరవతు వస్తాభిరష్టాభిరీశః || 'నేల, అగ్ని, నీరు, గాలి, ఆకాశం అనే పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, 'నేను' అనే యజమాని- ఈ ఎనిమిది రూపాలలో ఈశ్వరుడు విరాజిల్లుతున్నాడు. విశ్వరూపుడు, మహత్తర శక్తి కలిగిన పరమాత్మ అయిన రుద్రుడిని ఏకాదశ రుద్రాభిషేకాలతో ప్రసన్నుడిని చేయడం వల్ల ప్రకృతి ప్రశాంతత పొందుతుంది' అని వివరించాడు కాళిదాస కవి.
:
స్నేహితుని సహాయం
ఈ రథయాత్ర అప్పుడే మరొక భక్తుడు తనకు జరిగిన సంఘటనను కూడా అక్కడున్నవారితో పంచుకున్నాడు. ఈ సంఘటన పరమాచార్య స్వామివారి అపార కరుణకు నిదర్శనం.
పేదరికం అతణ్ణి ఎన్నో కష్టాలపాలు చేసింది. అదే సంవత్సరం 1984లో పరమాచార్య స్వామివారు తిరుమంగలక్కుడిలో మకాం చేస్తున్నప్పుడు, ఈ పేదవాడు రోజూ ఆ చోటుకు వెళ్ళేవాడు. ఇతనికి పరమాచార్య స్వామివారు ఎవరని కాని, మహాస్వామి వారి గొప్పతనం కాని తెలియదు. కనుక అతనికి స్వామివారిపై ప్రత్యేకమైన భక్తి ఏమీ లేదు. కాని పేదరికం వల్ల రోజూ కనీసం ఒక్కపూట భోజనం కూడా లేకపోవడంతో, కేవలం ఉదర పోషణార్థం అతను అక్కడకు వెళ్ళేవాడు. అక్కడకు వెళ్ళడం వల్ల కడుపు నిండినా పేదరికం పోలేదు.
మహాస్వామివారు అక్కడినుండి వేరోక్కచోటుకు వెళ్తే, అతనికి ఆ ఒక్కపూట భోజనం కూడా దొరకదు. అయిదు మంది ఉన్న కుటుంబాన్ని పోషించలేక, అప్పులు ఎక్కువై, ఆదాయం లేక చివరకు ఆత్మహత్య తప్ప వేరొక దారి లేదని నిశ్చయించుకున్నాడు.
నిర్ణయం తీసుకుని చివరిసారిగా చనిపోయే ముందు అందరూ గొప్పగా చెప్పుకునే కంచి పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకుందామని వెళ్ళాడు.
అంజలై లాగే ఇతను కూడా నమ్మకంతి కాకుండా ఊరికే స్వామివారిని చూసి తరువాత చనిపోదామని కంచి చేరుకున్నాడు.
ఏమి మాట్లాడకుండా పరమాచార్య స్వామి వారి ముందర నిలబడ్డాడు.
అందరినీ చూసే కరుణాపూరితమైన చూపులతో స్వామివారు అతణ్ణి చూశారు. సర్వజ్ఞులైన స్వామివారు అతణ్ణి ఒక ప్రశ్న అడిగారు, “నీ తరువాతి కార్యక్రమమ ఏమిటి?”.
జీవితం చివర్లో నిలబడియున్న ఆ నిరుపేద ఏమని సమాధానం చెబుతాడు. తాను జీవితాన్ని చాలించాలని నిశ్చయించుకున్నట్లు చెప్పగలడా? “ఏమి చెయ్యాలో నాకు తెలియదు సామి! నేను నా స్థానాన్ని చేరుకోవాలి” అని జీవితం పైన ఆశ చచ్చిపోయిన స్వరంతో, నిరాశ నిస్పృహలు తొంగిచూస్తున్న మాటలతో చెప్పాడు.
“నేను నీకు బస్సుకు డబ్బులు ఏర్పాటు చేస్తాను. నేరుగా నీ ఊరికి వెళ్ళవద్దు. ఇక్కడి నుండి సరాసరి మద్రాసుకు వెళ్ళు. అక్కడ ప్యారీస్ కార్నర్ లో బస్సు దిగి, అక్కడి నుండి మీ ఊరికి బస్సులో వెళ్ళు” అని ఆజ్ఞాపించారు స్వామివారు.
అక్కడే ఉన్న శిష్యులకు ఇక్కడి నుండి మద్రాసుకు, అక్కడి నుండి తన ఊరికి సరిపడా డబ్బులు ఇవ్వమని ఆదేశించారు.
ఎందుకు ఈ సామి పడమరన వేలూరుకు దగ్గరలో ఉన్న తన ఊరికి వెళ్ళడానికి తూర్పున ఉన్న మద్రాసుకు వెళ్లి మరలా అక్కడి నుండి ఊరికి వెళ్ళమని చెబుతున్నారో అతనికి అర్థం కాలేదు. కాని స్వామివారి ఆదేశం కాబట్టి పాటించాడు.
చెన్నైలో ప్యారీస్ కార్నర్ లో దిగి తన ఊరికి వెళ్ళే బస్సు కోసం వెతుకుతున్నాడు. భగవంతుడు పంపినట్టుగా అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను ఇతని స్నేహితుడే! చాలా కాలం తరువాత ఇతన్ను చూడడంతో అతను చాలా సంతోషించాడు. దగ్గరలో ఉన్న హోటలుకు తీసుకునివెళ్ళి ఆహారం ఇప్పించాడు. చాలా అకాలితో ఉండడంతో సంతోషంగా తినేశాడు. తన గురించి, కుటుంబం గురించి అడగడంతో, ఇక తట్టుకోవడం చేతకాక ఏడుస్తూ తన గోడు వెళ్ళబోసుకున్నాడు.
ఇతను సాక్షాత్తు పరమేశ్వరుడు పంపిన స్నేహితుడు కదా మరి. అతణ్ణి ఓదార్చి మంచి మాటలతో అనునయించాడు. అతని అప్పులన్నీ తీర్చి, కొద్దిగా ధన సహాయం కూడా చేసి కుటుంబాన్ని కూడా ఆదుకుంటానని మాటిచ్చాడు.
అంతటి దీనస్థితి నుండి స్నేహితుని సహాయం వల్ల బయటపడి, ఉద్యోగం కూడా పొంది ఇరవైఅయిదేళ్ళ తరువాత కుమార్తె వివాహం కూడా చేశాడు. పరమాచార్య స్వామివారి ఇప్పుడు రథయాత్రలో శిలా రూపంలో ఇటు రావడంతో కృతజ్ఞతతో కళ్ళ నీరు కారుస్తూ, తన కథను చెప్పుకున్నాడు.
అంతటి కరుణారూపమైన ఈ భగవంతునిపై మనకున్న భక్తి చేత స్వామివారే మనల్ని ఆశీర్వదించి, మనలను కాపాడి, అన్ని సౌఖ్యాలు కలగజేస్తారు.
--- “శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా మహిమై” పత్రిక నుండి
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/KPDSTrust
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి