🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
*ద్వితీయ స్కంధము*
*నానాస్థావరజంగమ ప్రకరముల్ నాయంత నిర్మింప వి*
*జ్ఞానం బేమియు లేక తొట్రుపడ నిచ్చన్ నాకు సర్వానుసం*
*ధానారంభవిచక్షణత్వము మహోదారంబుగా నిచ్చె ము*
*న్నేనా యీశ్వరు నాజ్ఞ గాక జగముల్ నిర్మింప శక్తుండనే?*
నాయనా! నారదా! ఈ విశ్వం అంతా పెక్కువిధాలయిన వ్యక్తులతో, వస్తువులతో నిండి ఉన్నది. అందులో కొన్ని స్థావరాలు. కదలిక లేక నిలిచి ఉండేవి. కొన్ని జంగమాలు. కదలుతూ ఉండేవి. ఇలా ఉండే వానినన్నింటినీ నా అంత నేను సృష్టిచేసే విజ్ఞానం కొంచెం కూడా లేక తికమకపడుతున్నాను. అప్పుడు తనకు తానుగా నాకు సాక్షాత్కరించి ఆ పరమేశ్వరుడు అన్నింటినీ కూర్చుకొని నిర్మింపగల వివేకాన్ని చాలా గొప్పగా నాకు కలుగజేశాడు. ఆయన ఆజ్ఞ లేకపోతే నేను ఈ లోకాలనన్నింటినీ నిర్మించే శక్తి కలవాడనా?
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి