ఓజస్సు అనగా ఓంకారమును పుట్టించు జీవశక్తి యనబడు ధాతువు. ఇది సప్తధాతువులు కాక ఎనిమిదవది. ఇది భౌతిక ధాతువు కాదు. ప్రాణజనకమైన ప్రజ్ఞా స్వరూపముగా నుండును.
ఓంకారమును 'సో౭హం' అనబడు ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలుగా జీవులలో ప్రతిష్ఠించును గనుక దీనికి ఓజస్సు అని పేరు వచ్చినది. ఓ + జ = ఓంకారమును జనింపజేయునది. ఓంకారమున జన్మించునది. "తల్లి గర్భమున శుక్రధాతువు ద్వారా జీవుని ప్రతిష్ఠించు మొదటి సారము ఓజస్సు. ఇది గర్భసారము యొక్క సారము" అని ఆయుర్వేద శాస్త్రము చెప్పుచున్నది.
✍🏼 *మాస్టర్ ఇ.కె.*
భాగవతము 4-501
పృథు చక్రవర్తి కథ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి