1, ఏప్రిల్ 2024, సోమవారం

సంసారం

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

సంసారం 17-03-24


నేను నాభార్య వెళ్లి ఒక ఇల్లు అద్దెకు తీసుకొని - అందులోనికి గృహ ప్రవేశం చేసాము . ఆమె వెళ్లి ఇరుగు పొరుగు ఆడవాళ్ళకి - ఫైవ్ స్టార్ చాకోలెట్ ఇచ్చి - నవ్వి వచ్చింది .


రొండో రోజు ఉదయం - ఒక పెద్దావిడ - మా ఇంటికి కి వచ్చింది మాతో పరిచయం కోసం మరియు కాలక్షేపం కోసం అనుకుంటాను .. మేము వీపులు గోడలకి ఆనించి - చతికల పడి కూచొని విశ్రాంతి తీసుకొంటూ వున్నాము . రాండి .. పెద్దమ్మా - రండి కూచోండి -అని ఆమెను ఆహ్వానం చేసి - మాపక్కనే చతికిల పడమన్నాము. సామాను రాలేదా ? ముందుగా కుర్చీలు తెచ్చుకోవాల్సింది " అని ఆమె కూడా మాతో పాటు కూచుంది [] 

" మాకు సామాను ఉండదు - వున్నా సామాను తెచ్చేసాము. మేమిద్దరమూ - యిల్లాగే కూచుంటాము . సంసారం సింపుల్ చేసుకున్నాము- అని చెప్పాను . 

" సామాను లేకపోతే కాఫీ టీలు యెట్లా ?

" ఇద్దరమూ ఉద్యోగాలు చేస్తాము - వెళుతూ టీ - టిఫిన్లు కానించేసి వెడతాము . మాకు పాలు టీ పొడి చెక్కర డబ్బాలు వుండవు "

" బట్టలు వేసుకోవటానికి - తాడు కూడా కట్టలేదు " అన్నది ఆమె 

" మాకు బట్టలు ఉతుక్కునే పని ఉండదు . ఆమెకూ నాకూ వేరు వేరు మెడికల్ లాబ్ లో పని . వెళ్ళగానే మా ఒంటి మీద బట్టలు విప్పి కంపెనీ వాళ్లకి ఇచ్చి - వాళ్ళిచ్చిన - శానిటైజ్ చేసిన డ్రెస్సులు వేసుకుంటాము. కంపెనీ వాళ్ళు - మేము విప్పి ఇచ్చిన మాడ్రస్సులు ఉతికి - శానిటైజు చేసి అక్కడపెట్టేస్తారు .అవి అక్కడనే ఉంటవి . మరునాడు వెళ్లి వేసుకుంటాము . అందువల్ల మాకు బట్టల తాడూ , బట్టల కోసం అలమరాలు - కలరా ఉండలు - సబ్బు బిళ్ళలు వుండవు . అని నేను చెప్పాను .

" టీవీ తేలేదా ? అని ఆ పెద్దామె అడిగింది .

" ఎవరి ఫోన్లు వాళ్ళకున్నాయి . అవ్వే మాటీవీలు . మాకు డిష్ లక్కరలేదు . కేబుల్ అక్కరలేదు "

" మంచి నీళ్ల బిందె కూడా లేదు "

" వారానికి సరిపడా వాటర్ ప్యాకెట్లు - కొని గూట్లో పెట్టుకుంటాము . మాకు బిందెలు కడవలు - చెంబులు బక్కెట్లు కూడా వుండవు . మా కంపెనీ రూలు ప్రకారం లాబు నుండి బయటకు వస్తూనే - తల దగ్గరనించీ - వళ్ళంతా శుభ్రం గా కడుక్కోవాలి . వాళ్ళే మెడికేటెడ్ సోపు షాంపూ ఇస్తారు .ఇహ అదే మా స్నానం. అక్కడే మాటాయిలెట్ - అట్లాగే అలవాటు చేసుకున్నాము.మరీ ఏదన్న ఎమర్జెన్సీ వస్తే పనికొస్తాయి లెమ్మని - నాలుగు ఎడల్ట్ డైపర్లు వుంచుకుంటాము"  

" ఒక్క గిన్నె కానీ - గ్లాస్ గాని - స్టవ్ గానీ కనపడదేంటి ?''

" ఇద్దరమూ క్యాంటీన్లలో తింటాము . అక్కడ నచ్చక పోతే స్విగీ లో ఆర్డర్ ఇచ్చుకుంటాము. రాత్రిళ్ళు ఇంటికి వస్తూ బండి దగ్గర చపాతీలు తిని లస్సీ తాగుతాము . "మాకు గిన్నెలు - కుక్కర్లు - పాలగిన్నెలు - అంట్ల సబ్బులు వుండవు "

" బండి తెచ్చుకున్నారా ?

" లేదు - అరకిలో మీటర్ మార్నింగ్ వాక్ చేస్తే - అక్కడికి కంపెనీ బస్సు వస్తుంది .అట్లాగా జాబుకి వెళ్లి వస్తాము . ఇంకా ఎక్కడికన్నా వెళ్లాలంటే ఎవరన్నా లిఫ్ట్ ఇస్తే ఎక్కి పోతాము - వస్తాము. కాదంటే షేర్ ఆటో ఎక్కుతాము. లేదంటే నడుస్తాము . మాకు బండ్లు - దానికి మెకానికు - అందులోకి పెట్రోల్ - టైర్లలోకి గాలీ అవసరం ఉండదు .

" అసలు మీకున్న సామాను ఏమిటి ?

" మూడు పెద్ద ట్రాలీ బ్యాగ్లు .. ఒక దాంట్లో మెత్తటి బొంతలు - ఎయిర్ పిల్లొలు - పక్క దుప్పట్లు - కప్పుడు దుప్పట్లు - టవల్స్ పెట్టుకుంటాము . సాధ్యమైనంత వరకూ నేలమీద న్యూస్ పేపర్ పరుచుకొని - తలకింద పుస్తకం పెట్టుకొని పడుకుంటాము . మాకు మాసిన గలీబులు - దుమ్ము పట్టిన దుప్పట్లు వుండవు . జిడ్డు పట్టిన దిండ్లు గూడా వుండవు .అందుకని ఏదీ ఉతుక్కోవటం అనేది కూడా ఉండదు "

" మిగతా రొండింటిలో - ఏముంటాయి ?

"నీలం రంగు దాంట్లో ఆమె బట్టలు - నల్ల రంగు దాంట్లో నా బట్టలు ఉంటాయి .ఎవరిదీ వాళ్లు సర్దుకుని రెడీ గా వుంచుకుంటాము . ఆమెకు పోవాలనిపించినపుడు - బ్యాగు లాక్కుంటూ వెళ్లి - వాళ పుట్టింటి కి బస్సు ఎక్కు తుంది .నేను అంతే . ఇద్దరం కలిసి ఏదన్న యాత్రకు వెళ్లినా అంతే . విడిగా వెళ్లినా అంతే .. మాకు ప్రయాణపు హడావుడి - బట్టలు సర్దుకోవటం వుండవు ". 


" చివరికి చీపిరి కూడా లేనట్లుంది ? ''  

" ఒక పనమ్మాయికి పురమాయించాము .మా ఒప్పందం ప్రకారం దాని సొంత చీపురు - సొంత మాపు - ఒక బకెట్ నీళ్లు తెచ్చుకొని - ఇల్లు తుడిచి వెళ్లి పోతుంది [] మాకు డెట్టాలు - లైజాల్ , విమ్ము - రిమ్ములు వుండవు "

" ఏందో నాయనా ? అంతా కలికాలం లాగుంది . ఏమీ సామాన్లు లేని - ఏ కస్టాలు నష్టాలు లేని మిమ్మల్ని చూసి - మీది ఓ సంసారం అనాలని పించటం లేదు . ఏమనుకోవద్దు నాయనా . పెదముండను అడుగుతున్నాను .మీరు నిజంగా పెళ్లి అయినా వాళ్లేనా ? లేక లేచి పోయి వచ్చిన వాండ్రా ? అని అడిగింది పెద్దామె . 

మాఆవిడ వెంటనే తన ఫోను ఓపెన్ చేసి - మా పెళ్లి ఫోటోలు చూపింది .  

ఆమె సంతృప్తి పడలేదు - ఏందో నాయనా ఫొటోల్లో మ్యాజిక్ ఉంటుందంటగా ? అని నోరు చప్పరించింది .

మా ఆవిడా కు స్పోర్టివ్ నెస్ ఎక్కువ నే . వెంటనే పర్సులో వున్నా తాళి తీసి " "దీన్ని - ఈ పెద్దమ్మ ఎదురుగా ఇంకో సారి కట్టండి ... ఏమవుతుంది ? ఆమె మూలకంగా - మనము నిజమైన భార్య భార్య భర్తలమని - మనదీ సంసారమే నని ఈ సమాజానికి రుజువు అవుతుంది " అన్నది. 


మా కోరిక మీద మా నూతన వధూ వరులను దీవిస్తూ, ఆ పెద్దావిడ ఒక సెల్ఫీ దిగింది - అట్లాగే ఆమెను మా మధ్యన పెట్టుకొని మేమూ ఒక సెల్ఫీ దిగాము [] మీకు షేర్ చేస్తాను . చూద్దురు గాని .

 *ఇట్లు వారణాసి శ్రీ రామకృష్ణ అమరావతి.* 

🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు: