*లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడని విషయాలు*.
(అంటే డబ్బు నిలకడ ఉండక ధననష్టంకు కారణం అయ్యే విషయాలు)
*విప్రకీర్ణాని ధాన్యాని*
👉 నిర్లక్ష్యంగా ధాన్యాన్ని ఇళ్లలో చెల్లాచెదురుగా ఉంచడం
*అపావృతం పయో౽తిష్ఠత్*
👉 పాలపై మూత పెట్టకపోవడం
*ఉచ్చిష్టాశ్చాస్పృశన్ఘృతమ్*
👉 ఎంగిలి చేతితో నెయ్యిని ముట్టడం
*భక్ష్యమాసీదానావృతమ్*
ఆహారపదార్థాలపై మూతలు పెట్టకపోవడం
*ఉచ్చైశ్చాభ్య వదన్రాత్రౌ*
👉 రాత్రుళ్ళు పెద్దగొంతుతో అరుస్తూ గొడవలు..వాదనలు చేసుకోవడం
*ద్రవ్యోపకరణం సర్వం నాన్యవైక్షత్కుటుంబినీ*
👉 గృహిణులు ఇంటివస్తువులను సరిగ్గా ఉంచుకొనక చిందరవందరగా పారేసుకోవడం
*అవర్తన్కలహాశ్చత్ర దివారాత్రం గృహే గృహే*
👉 రాత్రి పగలు ఎప్పుడూ కలహాలు చెలరేగుతుండడం
👉 ఈ లక్షణాలు కనిపిస్తూ ఉన్నప్పుడు లక్ష్మీ ఆ ఇంటి నుండి వెళ్ళిపోతుంది.
*సప్తదేవ్యో జయాష్టమ్యః వాసమేష్యంతి తే౽ష్టధా*
👉 లక్ష్మీ ఉన్న దగ్గరే జయలక్ష్మీతో కలిపి అష్టలక్ష్మిలు నివసిస్తూ ఉంటారు.
👉 వాళ్ళుకూడా లక్ష్మీ దేవినే అనుసరిస్తారు.
ఇతరులను నిందించడం లేనిపోని చాడీలు చెప్పడం
*మహాభారతం*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి