పంచభూత క్షేత్రం
పంచభూతాలు అనగా నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం . ఈ పంచభూతాలకు అధిపతి పరమేశ్వరుడేనని,పంచ భూతాత్మక మైన ఈ దేహం ఈశ్వర సేవలో తరించాలని పెద్దలు చెబుతారు. పంచభూతాలకు పంచలింగాలు ప్రసిద్ధి చెందాయి. ఆయా భూతతత్వాలతో స్వామి ఆయా క్షేత్రాలలో దర్శనమిస్తాడు.
కంచిలో పృద్వీలింగం , జంబుకేశ్వరం లో జలలింగం, తిరువన్నామలై లో తేజోలింగం, శ్రీకాళహస్తి లో వా యులింగం, చిదంబరంలోఆకాశలింగం- ఈ అయిదు పంచభూత లింగాలుగా ప్రసి ద్ధి కెక్కాయి. వీటిలో నాలుగు ఆలయాలు తమిళనాడులో ఉండగా, వాయులింగ స్వామీ ఆలయము ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది.
కాంచీపురం (కంచి) ..;పృద్వీలింగం
కాశీ, కంచి పమేశ్వరునికి రెండు కళ్ళు అని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. ఇక్కడ పంచభుతాలలో ఒకటైన పృద్వికి ప్రతీక గా ఏకాంబరేశ్వరుడు మృత్తికా లింగంగా దర్శనమిస్తాడు. అభిషేక ప్రియ: శివ: శివుడు అభిషేక ప్రియుడు అని అంటారు. కాని ఇక్కడ మాత్రం స్వామికి అభిషేకం లేదు. పుష్పాలతో పూజ చేస్తారు. ఆలయము లోని మామిడి చెట్టు కింద పార్వతి దేవి తపస్సు చేసిందని, ఆమె మట్టితో ఒక శివ లింగం చేసి పూజ చేసింది అని అంటారు.ఆ మట్టి తో చేసిన లింగమే ఈ రోజు పూజ లు అందుకుంటోంది.
ఇక్కడ ఉన్న మామిడి చెట్టు సుమారు మూడు వేల ఐదు వందల సంవస్తరాల వయస్సు కలదని అంటారు . శాఖోప శాఖలుగా విస్తరించిన ఈ చెట్టుకి ఉన్న కొమ్మలలో, నాలుగు కొమ్మలు నాలుగు రుచులు గల ఫలాలను ఇవ్వటం విశేషము. సంతానము ఇచ్చే మహిమాన్విత వృక్షం గా ఈ చెట్టు ప్రసిద్ధి చెందింది.
( మామిడి చెట్టుక్రింద వెలసిన స్వామి )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి