4, ఫిబ్రవరి 2021, గురువారం

సాధన

 తొందరపాటు అన్నది ఏ పనైనా వెంటనే చేసేయాలని అనిపిస్తుంది. భయం అన్నది ఒక చిన్న ఆపద కలగగానే డీలా పడిపోయేలా చేస్తుంది. ఆవేశం అన్నది ఇతరులపై కోపం కలగగానే అక్కసు వెళ్లగక్కడానికి ప్రయత్నిస్తుంది. నిరాశ అన్నది బాధ కలగగానే కుమిలి పోవడానికి ప్రోత్సహిస్తుంది. దురాశ అన్నది తరతరాలు కూర్చుని తినడానికి వీలుగా తరగని సంపదని కోరుకొంటుంది. సాధన అన్నది ఒక్క రోజు ధ్యానం చేసి 'నేను బుద్ధుడు కావాలి' అని ప్రేరేపిస్తుంది. 


అయితే వీటన్నిటిని అధిగమించడానికి సాధనతో పాటు కాస్తంత ‘సహనం’తో ప్రయత్నిస్తే అంతిమంగా ‘విజయం’ సాధించవచ్చు. సహనం అనేది ఒక నిగ్రహశక్తి, ఒక మానసిక పరిపక్వత గల స్థితి.

కామెంట్‌లు లేవు: