శివునికి అభిషేకం చేయుట వలన ఫలితం వక పరిశీలన. జలం నారాయణ స్వరూపం. ప్రకృతిని ప్రకృతి పరంగా ఆరాధన. అనగా ప్రకృతి సిద్దమైన లింగం ప్రకృతిపరమైన జలంతో అభిషేకం. దీని ఫలితం అవభృధ స్నాన ఫలితం. యీ స్నానము అశ్వమేధ యాగంలో వక భాగం. యిది లేనిదే యాగ ఫలితం లేదు. అందుకే రుద్రంలో మంత్రపూరిత అభిషేకం అవభృధశ్చమే స్వగాకారశ్చమే యని కలదు. స్వయంగా దేహ ధారి యైన జీవునికి ప్రకృతిని వుపాశన చేయుట. అభిషేక ప్రక్రియ. లింగారాధన నిర్గుణ రూప ప్రకృతిని ప్రకృతిపరమైన జలం ద్వారా సగుణోపాశన వలన సృష్టి ధర్మమని తెలియుచున్నది. దీని ఫలితం ప్రకృతి చైతన్యం.జల తత్వం లక్షణ మైన భూమి నిర్వీర్యం మహా ప్రళయం. భూమి కూడా దహించబడి సూక్ష్మ రూపం దాల్చి హవిస్సు పూర్వకంగా మారుట. అనగా సర్వం నారాయణ తత్వం లో కలియుట.తిరిగి పునః సృష్టిలో సృష్టి నారాయణ సంకల్పంతో మాత్రమే. అనగా జల తత్వమే నారాయణ స్వరూపమని తెలియును. సృష్టి మూలం ముందు తెలియదు లేదు. సృష్టించిన తరువాతనే దాని లక్షణము తెలియును.అప్పుడే మాయతో అహంకారం ప్రబలును. యిది ఆదిలో నారాయణ తత్వం బ్రహ్మకుకూడా తెలియలేదు. సాధన వలన దీనిని తెలిసికొని పిదప సృష్టి సంకల్పము. మనకు లింగారాధన ద్వారానే సృష్టి ధర్మం తెలియుట. నారాయణ తత్వం పరమేశ్వర తత్వం. దీనికి లింగభేదం లేదు. బ్రహ్మ సృష్టి తరువాతనే ప్రకృతి పరమైన లింగభేదం తెలిసినది. తెలుసుకుంటూనే వుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి