మౌలికంగా భగవత్ శక్తిని తెలియాలి అంటే ఎలా? యీ ప్రశ్న సమస్త జీవరాసులకు కలిగే సంశయం. యిట్టి సంశయం కలుగుట వాసన యని వేదం తెలుపు చున్నది. యిది అభ్యాసం వలననే. అదియును సత్సంగం
వలననే. అయిన వేదం పారాయణ వలన తెలియదు. ఎందుకనగా పారాయణ ఙ్ఞానం నకు తొలి మెట్టు. మూల సూత్రము లు తెలియవు. కనుక దానికి సమానము భాగవతమను వేదమును పారాయణ చేయుటయు కలియుగంలో వజ్రాయుధం. వేదము అనంత మైనది కావున. దాని వివరణను భాగవతం వలన సులువుగా సూక్మంగా తెలియ వచ్చును. బాల్యం నుండే మనకు పద్యాల ద్వారా అభ్యాసం చేయుటకు పెద్దలు వ్యవహారిక విద్యతో ఆముష్మికమునకు మెూక్షమునకు కూడా సాధనా పూర్వకంగా తెలిపారు. అట్టి దానిని తిరిగి ఆరంభం చేద్దాం. కలియుగంలో కాల లక్షణము వలన కలుగు ధర్మచ్యుతిని తిరిగి సులువుగా రక్షించుటకు వకు సోపానం భాగవతం. భా ప్రకాశవంతమైన శక్తి కలిగిన చరిత్రలను తెలియుటే భాగవత మూలము. పూర్ణమని కూడా దీనికి కలదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి