. *💥సుప్రీమ్ కోర్టులో మంచి తీర్పు. ఇన్నాళ్ళకు ఇచ్చిన ఒక అతి ముఖ్యమైన తీర్పును నిన్న RRR కేసులో పడి ఎవరూ.. గమనించలేదు*
*అతి ముఖ్యమైన తీర్పు అయినా పత్రికలో అసలు రానేలేదు*
*దేశ ఆర్థికవ్యవస్థకు , ముఖ్యముగా బ్యాంకులకు ఉపయోగపడే ఒక తీర్పు ఇచ్చింది సుప్రీమ్ కోర్ట్ .*
*ఒక కంపెనిపెట్టి ఆ కంపెనీ పేరుమీద బ్యాంకు లోన్ తీసుకుని ఆ తరువాత ఆ కంపెనీని దివాళా తీయిస్తారు (ఈ పనులు ఎక్కువగా రాజకీయ నాయకులు ,వారి సహకారము వున్నవాళ్లు చేస్తుంటారు*
*ఉదాహరణకు రాయపాటి సాంబశివరావు ,లాంకో రాజగోపాల్ )ఆ కంపెనీ దివాళా తీస్తే ,బ్యాంకులు ఆ కంపెనీ ఆస్తులు స్వాధీనము చేసుకుంటాయి (అప్పటికే కంపెనీకి ఎలాంటి ఆస్తులు లేకుండా జాగ్రత్త పడతారు )కానీ లోన్ తీసుకునేసమయములో హామీదారులుగావున్న వ్యక్తుల ,వ్యక్తిగత ఆస్తులజోలికి పోవటానికి వీలులేదు ఇదీ ఇప్పటివరకు ఉన్నచట్టము*
*దీనిని మారుస్తూ ,కంపెనీ దివాళాతీసినప్పుడు ,ఆ కంపెనీ పేరుమీద వున్న ఆస్తులు ,అప్పుకు సరిపోకపోతే ,ఆ కంపెనీ అప్పుతీసుకున్న సమయములో హామీదారులుగావున్న వ్యక్తుల ,వ్యక్తిగత ఆస్తులు కూడా స్వాధీనము చేసుకుని ,బ్యాంకులు తమ అపులక్రింద జమ వేసుకోవొచ్చును ,అని మోడీ ప్రభుత్వము 2018 లో ఒక చట్టము తెచ్చింది*
*దానిపై కొంతమంది సుప్రీమ్ కోర్ట్ లో పిటిషన్ వేశారు ౩సం.ల విచారణ అనంతరము పిటిషన్ కొట్టివేస్తూ కేంద్రము తెచ్చిన చట్టాన్ని బలపరుస్తూ తీర్పు చెప్పింది .*
*ఇకపై లొనులపేరుతో ఆర్థిక అరాచకాలకు పాల్పడుతున్న నాయకుల అరాచకానికి అడ్డుకట్ట పడనుంది .*
*ఎప్పుడూ చిల్లర రాజకీయాలపై తప్పించి ,ఇలాంటి అతి ముఖ్యమైన విషయాలపై , మీడియాకు గాని ,మేధావులు అనబడే సోకాల్డ్ మేధావులకు గాని దృష్టిపెట్టరు . ఎందుకంటారు ?*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి