*👌Tit for Tat 👌*
*♦️ ఒక నాస్తికుడికి కరోనా సోకింది. తీసికెళ్ళి ఆస్పత్రిలో వేశారు! సిలిండర్ తీసుకొచ్చి ఆక్సిజెన్ పెట్టారు ! ఈ లోపల భార్య గుడికెళ్ళి భర్త పేరు మీద అర్చన చేయించి ఆస్పత్రికి వచ్చింది. ఆమె నాస్తికురాలు కాదు! ఆస్పత్రి కొచ్చి భర్తతో అన్నది. "హేమండీ.. గుళ్లో మీ పేరు మీద అర్చన చేయించి అమ్మవారి కుంకుమ తీసుకొచ్చాను.. పెట్టుకోండి. ఇది పెట్టుకుంటే మీరు త్వరగా కోలుకుంటారు!*
*♦️ నాస్తికుడు:- (కోపంగా..) నీకేమన్నా పిచ్చా.. నా సంగతి తెల్సు కదా నీకు ? సరే.. ఒక మాట అడుగుతాను నాకు జవాబు చెప్పు. (హేళనగా..)మీ దేవుడు సర్వత్రా అంతటా వ్యాపించి ఉంటాడు కదా.. అలాంటప్పుడు దేవుడికి గుడి ఎందుకు? భార్య అమాయకం గా ఇలా అడిగింది." ఏమో నాకేం తెలుసండి.. కాని నాకూ మీలాగే ఒక డౌటు. దానికి మీరు చెప్పండి జవాబు. అదేంటంటే ఆక్సిజన్ కూడా అంతటా వ్యాపించే ఉంటుంది కదా.. మరి మీకు ఆక్సిజెన్ ఇవ్వటానికి సిలెండరు ఎందుకు?*
*👽 ఇంకేముంది.. మొగుడు గుడ్లు తేలేసి గుటకలు మింగాడు 👽*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి