#కరోనా - రాజకీయాలు
అసలు హెల్త్ రాష్ట్ర సబ్జెక్టు..తమ రాష్ట్రంలో ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి, ఎంత మంది డాక్టర్లు ఉన్నారు, ఎంత మంది మిగతా సపోర్టింగ్ స్టాఫ్ అంటే నర్స్ లు టెక్నిషియన్స్ వున్నారు. మన రాష్ట్ర జనాభాకు సరిపోతారా? ఎన్ని ICU బెడ్స్ ఉన్నాయి ఇలా మొత్తం సమాచారం అంతా రాష్ట్రాల వద్దే ఉంటుంది. ప్రతీ సం. రాష్ట్ర బడ్జెట్ లో కేటాయింపులు చేస్తూ ఏవి తక్కువ అయితే అవి ఏర్పాటు చేసుకోవాలి. అవసరం అయితే కేంద్ర సహాయం కోరవచ్చు.
కానీ రెండో వేవ్ పీక్ గా వచ్చేసరికి మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆరోగ్య శాఖ కేంద్రం మాత్రమే నిర్వహిస్తున్నట్లు, అసలు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు, ఆరోగ్యశాఖా మంత్రులు లేనట్లు అన్ని రాష్ట్రాల్లో ఉన్న హాస్పిటల్స్ లో లోటుపాట్లకు కేంద్ర ప్రభుత్వానిది మాత్రమే బాధ్యత అన్నట్లు ప్రతిపక్షాలు, మీడియా ఒక్క కేంద్రం మీదే ఆరోపణలు చేస్తూ దాడులు మొదలు పెట్టారు. ఎలా అంటే
దేశంలో తగినన్ని....
హాస్పిటల్స్ లేవు
ICU బెడ్స్ లేవు
వెంటిలేటర్లు లేవు
ఆక్సిజన్ సప్ప్లై లేదు
తగినంత మంది డాక్టర్లు లేరు
సపోర్టింగ్ స్టాఫ్ లేరు
టెక్నికల్ స్టాఫ్ లేరు
అని గోల గోల చేశారు.
(అవును స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి గత 70 సం.లుగా మోడీ యే ప్రధానిగా మరియు అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రి గా చేసాడు. దేశ జనాభాకు తగ్గ పై సదుపాయాలు 67 సం.లలో కల్పించలేకపోయినవి ఈ 7 సం.లలో కల్పించక పోవడం మోడీ తప్పే)
ఎందుకు ఇంత గొడవ జరిగింది అని ఆరా తీస్తే కాంగ్రెస్ తమ కార్యకర్తల కోసం ఒక "టూల్ కిట్ " తయారు చేసింది.
అసలు ఈ టూల్ కిట్ అంటే ? ఏమి లేదు. ప్రణాళికా బద్దంగా ఎప్పుడు ఏమేమి ఎలా చేయాలి అని రాసి పెట్టుకున్న ప్రణాళిక అన్న మాట.
కరోనా రెండో వేవ్ సమయంలో ప్రధాని మోడీని, బీజేపీని ఇరుకున పెట్టడానికి దేశ విదేశీ మీడియాలో ప్రధాని మోడీ పై వ్యతిరేక వార్తలు వచ్చేటట్లు స్నేహపూర్వక మీడియాతో ఎలా వ్యాసాలు, వార్తలు రాయించాలి, నగరాల్లో బెడ్స్ ఎలా బ్లాక్ చెయ్యాలి, ఈద్ ని వదలి ఒక్క కుంభమేళాను మాత్రమే ఎలా బదనాం చెయ్యాలి ఇలా పలు అంశాలతో కాంగ్రెస్ తన కార్యకర్తలకు పలు వివరమైన సూచనలు ఇస్తూ ఒక "టూల్ కిట్ "తయారు చేసింది. దానిలో ముఖ్యాంశాలు :
1. బీజేపీ చేతకానితనంతో పోలిస్తే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు సహాయం చేయడంలో ఎలా ముందుంటారు అని చూపించడం
దీని కోసం -
a) దీనికోసం ఒక సోషల్ మీడియా టీమ్ తయారు చేసి ఇబ్బందులలో ఉన్న వారిని నేరుగా సంప్రదించడం
b) సంప్రదించిన తరువాత వారిచే సోషల్ మీడియాలో యూత్ కాంగ్రెస్ ను దాని లీడర్స్ ని టాగ్ చేస్తూ సహాయం చేయమని పోస్టులుపెట్టమనడం
c) స్నేహపూర్వక విలేకరులతో ఈ సమాచారాన్ని పెద్దగా వ్యాప్తి చేయడం
d) నగరాల్లో లోకల్ లీడర్ల సహాయం తీసుకొని వారికి తెలిసిన ఆసుపత్రులలో బెడ్స్ ఇతర సదుపాయాలు బ్లాక్ చెయ్యడం, కాంగ్రెస్ అనుమతితోనే వాటిని రిలీజ్ చేసేటట్లు చూడడం
e) సోషల్ మీడియాలో యూత్ కాంగ్రెస్ ని టాగ్ చేసిన వారికి మాత్రమే సహాయం అందాలి అని
f) జర్నలిస్టులు ఇతర మీడియా ప్రముఖులు మరియు సంఘంలో బాగా పరపతి కలిగిన వారి సహాయ అభ్యర్ధనలను ముందుగా చేపట్టడం
g) బీజేపీ సంస్థలతో పోల్చి యూత్ కాంగ్రెస్ సేవలు మెరుగైనవిగా చెప్పడం
2. ప్రధాని మోడీ ఇమేజ్ - ఇంత పెద్ద ఎత్తున క్రైసిస్ వచ్చినా అపసవ్యంగా నిర్వహించినా మోడీ అప్రోవల్ రేటింగ్స్ తగ్గటం లేదు. అందుకే మోడీ ఇమేజ్ నాశనం చేయడానికి అతని పాపులారిటీ తగ్గించడానికి ఇది మనకు ఒక అవకాశం. దానికి చేయవలసిన పనులు :
a) బిజెపి మోడీ మద్దత్తు దారులుగా కనిపించే హ్యాండిల్స్ ని సోషల్ మీడియాలో సృష్టించి మోడీ చేతకానితనాన్ని ఎద్దేవా చేయండి
b) మోడీ చేతకానితనం ప్రతిబింబించేటట్లుగా అంతర్జాతీయ మీడియాలో వచ్చేటట్లు చూడడం. దీని కోసం విదేశీ విలేకరులు, దేశ విదేశీ పత్రికల్లో వ్యాసాలు రాసేవారితో లయజన్ మైంటైన్ చేసి ఇటువంటి వారికి వివరాలు అందించడం
c) ఇప్పటికే విదేశీ మీడియాలో వస్తున్న నాటకీయ ఫోటోలు అంటే శవాలు, శవ దహన ఫోటోలు వంటివి విరివిగా ఉపయోగించడం. అటువంటి విలేకరులకు మన పార్టీ లోకల్ లీడర్స్ ఇటువంటి ఫోటోలు మొదలగునవి అందేటట్లు చూసి ప్రచారం బాగా కల్పించడం
d) మనతో స్నేహపూర్వకంగా వుండే మేధావులతో మోడీని వికృత భాషలో విమర్శించేటట్లు చూసుకొని రాజకీయంగా వాడుకోవడం
e) రెండో వేవ్ లో వచ్చిన ఈ 'మ్యుటంట్" అన్ని చోట్లా "ఇండియన్ మ్యుటంట్ " గా పేర్కొనడం, సోషల్ మీడియా వలంటీర్లు దీనిని "మోడీ స్ట్రెయిన్" గా ప్రచారం కల్పించడం
ఇతర విషయాలు - ఏం చేయాలో తెలియని ఈ బిజెపి ప్రభుత్వం అంటూ ప్రచారం విస్తృతంగా చేయడం. దాని కోసం...
a) ఈ పదాలు విరివిగా ఉపయోగించడం. అంటే 'మిస్సింగ్ అమిత్ షా", 'క్వరంటైన్డ్ జై శంకర్ ',
"సైడ్ లైన్డ్ రాజనాధ్", "సున్నితత్వం లేని నిర్మల సీతారామన్" మొదలగునవి
b) మన అనుకూల వారపత్రికలలో "కనిపించని ప్రభుత్వం" అంటూ వార్తలు వ్యాసాలు
c) భావోద్రేక సలహాలు కొన్ని సాధారణ కామన్ సెన్స్ అంశాల కలగలుపుతో రెగ్యులర్ ఇంట్రవల్స్ లో మోడీకి లేఖలు రాయడం...
గత నెల రోజుల్లో దేశ విదేశీ మీడియాలో వస్తున్న వార్తలు, కధనాలు, వ్యాసాలు,శవాల దహనాల, స్మశానాల ఫోటోలు, కావాలని ఢిల్లీ వంటి చోట్ల ఆక్సిజెన్ కృత్రిమ కొరత సృష్టించడం, కుంభమేళాను మాత్రమే టార్గెట్ చేస్తూ రైతుల ధర్నాను, ఈద్ ని విస్మరించడం వంటివి చూస్తూ ఉంటే ఈ టూల్ కిట్ ఎంత పకడ్బందీగా అమలు చేస్తున్నారో అర్ధం అవుతుంది.
ఈ టూల్ కిట్ గుంపులో కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కనుసన్నలలో ఉండే కొన్ని దేశ విదేశీ మీడియా సంస్థలు, ప్రముఖ జర్నలిస్టు లు, కాలం రైటర్స్, కొన్ని NGOల సభ్యులు ఉన్నారు.
ఈ సభ్యులే ముందులో వాక్సిన్ మీద దుష్ప్రచారం చేశారు. అందరికి ఇవ్వడానికి తగినంత స్టాక్ లేకపోయినా 45 సం.ల వారికి 18 స.ల వారికి కూడా వాక్సిన్ ఇవ్వాలి అని ప్రభుత్వం పై వత్తిడి తెచ్చి ప్రభుత్వ ముందస్తు ప్రణాళిక అయిన హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్స్, 60+ వారికి ముందుగా ఇవ్వాలి అనే ప్రణాళికకు గండి కొట్టారు.
బిజెపి ఈ టూల్ కిట్ విషయం బయటపెట్టింది.
ఒక పక్క దేశం భయంకరమైన కరోనాతో పోరాడుతూ ఉంటే కాంగ్రెస్ ఇలా ప్రభుత్వాన్ని బదనాం చెయ్యడానికి ప్రయత్నిస్తోంది అని బీజేపీ ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేసింది.
ఈ ఆరోపణలు మీద కాంగ్రెస్ ఘాటుగా స్పందిస్తూ ఈ టూల్ కిట్ బిజెపి సృష్టి. కాంగ్రెస్ ని అప్రతిష్ట పాలు చేయడానికి బిజెపి పన్నిన కుట్ర అని తిరిగి ఆరోపించి సందీప్ పాత్ర మొ. బీజేపీ నాయకుల మీద ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ గొడవ జరుగుతూ వుండగానే ట్విట్టర్ లో బీజేపీ నాయకులు ఈ టూల్ కిట్ పై పెట్టిన ట్వీట్స్ ని "manipulated' ట్వీట్స్ (అంటే నమ్మదగినవి కావు అనే అర్థం వచ్చేలా) అని ట్విట్టర్ మార్క్ చేసింది. దాంతో ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ కి నోటీసులు ఇచ్చారు. మీరు ఈ ట్వీట్స్ ని యే ఆధారంతో manipulated tweets గా నిర్ణయించారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వండి అని అడిగారు. భారత్ ట్విట్టర్ ఆఫీస్ లో ఏ సమాచారం ఉండదు. అమెరికా లో ఉన్న హెడ్ క్వార్టర్స్ ని అడగమని భారత్ లో ట్విట్టర్ ఆఫీస్ చెప్పింది. ఇంకా ఢిల్లీ పోలీసుల దర్యాప్తు జరుగుతూ వుండగానే కాంగ్రెస్ బీజేపీ నాయకులపై ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వాపసు తీసుకొని తమ రాష్ట్రం అయిన ఛత్తీస్ ఘర్ లో కొత్తగా ఫిర్యాదు చేసింది.
ఇప్పుడు దేశంలో కరోనా కేస్ లు తగ్గుముఖం పట్టాయి కేంద్రం దృష్టి వాక్సినేషన్ మీద పెట్టడంతో కాంగ్రెస్ టూల్ కిట్ లో రెండో అంకం మొదలయ్యిందా అనే అనుమానాలు వస్తున్నాయి. అందరికి వాక్సినేషన్ కోసం కేంద్రం పెట్టిన "కొవిన్" ఆప్ మీద ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడం. అసలు చదువు రాని వారు ఈ ఆప్ ఎలా వాడతారు? పల్లెల్లో ఇంటర్నెట్ ఉండదు కదా! వారికి వాక్సిన్ ఇవ్వరా? అందుకని కోవిన్ ఆప్ లో రిజిస్టర్ చేసుకోకపోయినా వాక్సిన్ సెంటర్స్ కి నేరుగా వచ్చిన అందరికి వాక్సిన్ ఇవ్వాలి అని కొత్త ప్రచారం మొదలు పెట్టారు.
బహుశా అలా అయితే కేంద్రం ఫ్రీగా ఇచ్చిన వాక్సిన్స్ కి లెక్క చెప్పక్కర లేదు. పంజాబ్ రాష్ట్రంలో లాగా ప్రైవేట్ హాస్పిటల్స్ కి అమ్ముకోవచ్చు అని వారి ఉద్దేశ్యామో లేక వాక్సినేషన్ కి ఏదోలా గండి కొట్టి అడ్డంకులు సృష్టించాలి అనే తపనో తెలియడం లేదు. అప్పుడే కాంగ్రెస్ కి మద్దతుగా ఈ కోవిన్ పై కొంత మంది ప్రముఖులు ట్వీట్ చేయడం మొదలు పెట్టారు..
కాని వాక్సిన్ కొరత వున్నప్పుడు ఈ కోవిన్ ద్వారా ముందస్తు బుకింగ్ చేసుకుని వెళ్తే వాక్సిన్ సెంటర్స్ వద్ద రద్దీ ఉండదు. అలా కాక ముందస్తు బుకింగ్ అవసరం లేదు, వాక్ ఇన్ లో వచ్చిన వారికి వాక్సిన్ వేస్తాం అంటే అక్కడ క్యూలు, తోసుకోడాలు..మళ్లీ కరోనాలు..అదే కావాలా ప్రతిపక్షాలకు?
ఇక చదువురాని వారు కోవిన్ ఎలా వాడతారు అంటున్నారు వారు ఏమి చెయ్యక్కరలేదు వాక్సిన్ ఇవ్వడానికి వచ్చిన వారే సమాచారం కోవిన్ ఆప్ లో నింపి తరువాత వాక్సిన్ ఇస్తారు. కోవిన్ లో సమాచారం నింపకపోతే మొదటి డోస్ ఎప్పుడు ఇచ్చారు, ఎంత మందికి ఇచ్చారు, ఏ వాక్సిన్ ఇచ్చారు? మళ్ళీ రెండో డోస్ ఏ వాక్సిన్ ఎంతమందికి సరఫరా చేయాలి అని డేటా ప్రభుత్వం దగ్గర ఉండదు.
"కోవిన్" అప్ మీద ముందస్తు రిజిస్ట్రేషన్ మీద కాంగ్రెస్ దాని ముఠా నడుపుతున్న వ్యతిరేక ప్రచారం నిజంగా ప్రజల కోసమేనా?
...చాడా శాస్త్రి...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి