13, జూన్ 2021, ఆదివారం

రాంప్రసాద్ బిస్మల్

 ఒకానొకరోజు....

1927 షాజాహాన్ పూర్ ..అర్థరాత్రి సమయం ఓ 30 యేండ్ల యువకుడు పూరింటి ముందున్న వసారాలో కూర్చున్నాడు...ఇంటికి తలుపు గడియపెట్టలేదు..కొంచెం తటపటాయిస్తూ తలుపుపై చిన్నగా తట్టాడు...లోపల నుండి ఒక పెద్దావిడగొంతు ఎవరంటూ అడిగింది... అమ్మా...చాలా ఆకలిగావుంది,, తినడానికి ఏమైనా పెట్టగలరా? అని అడిగాడు ఆ యువకుడు.. ఓ 20 నిమిషాల తర్వాత ఒక పెద్దావిడ రెండుజొన్న రొట్టెలు తీసుకొచ్చి అతనికి ఇచ్చింది..చాలాపేదవారిలాఉన్నదామె. ఇంకా ఎవరెవరుంటారు ఇంట్లో అడిగాడు ఆ యువకుడు..తనుా తన కోడలుంటారని చెప్పింది.. అబ్బాయి ఎక్కడ అన్నాడు?? విప్లవవాది అని బ్రిటీష్ వాళ్ళు కాల్చిచంపారన్నది కన్నీళ్ళొత్తుకుంటూ... తింటున్న రోటీముక్క నోట్లోంచి జారిక్రిందపడిపోయింది ఆయువకుడికి.. ఇంతలో పెద్దామే లోపలికి వెళ్ళింది..కాసేపటి తర్వాత తలపై పైట చెంగు కప్పుకొని ఒకామె వచ్చి మజ్జిగ గ్లాసు ఇచ్చింది త్రాగమని... మజ్జిగ తీసుకుంటూ ఆమె కట్టుకున్న చీరవంక చూసాడా యువకుడు..అనుమానం వచ్చింది.. మీ అత్తయ్యను రమ్మనండి అన్నాడు...ఆమె వెళ్ళినకొంతసేపటికి

 అత్త వచ్చింది..ఆమె కట్టుకున్న చీరవంక తేరిపారిచూసాడు...అతని అనుమానం నిజమైంది..ఒక్కచీరనే వాళ్ళు మార్చుకుంటున్నారు...ఆ యువకుడి కళ్ళలో సన్నని కన్నీటి పొర...కాసేపు ఆలోచించి ..అమ్మా..రేపటితో మీ బాధలు కొంతవరకు తీరవచ్చు..అన్నాడు

ఉదయాన్నే వేకువజామున పెద్దావిడను పిలిచి ఒక కాగితం పై ఏదో రాసి ఆ ఊరి పోలీసుస్టేషన్ లో ఇవ్వమన్నాడాయువకుడు...ఆమె అది తీసుకొని ఆయన చెప్పినట్లే చేసింది..ఆ కాగితం చూసిన పోలీసాఫీసర్ మొహంలో ఏదో కంగారు..వెంటనే పోలీసులను ఆయుధాలు తీసుకొని రమ్మని శరవేగంగా ఆ ఆవిడ ఇంటివైపు దూసుకుపోయాడు..

     ఇమె ఇంటికి వెళ్ళి ఆయువకుడిని తుపాకులతో చుట్టిముట్టి అదుపులోకి తీసుకున్నాడాఫీసర్ ..చిరునవ్వుతో వచ్చి జీప్ ఎక్కాడాయువకుడు...అతని ఆచూకీ చెప్పినందుకు ఆ ఇంటావిడికి ₹10000

 బహుమతి లభించింది..

  ఆ యువకుడే *రాం ప్రసాద్ బిస్మల్* ..భారతస్వతంత్ర సమరయోధుడు, ప్రసిద్ధ హిందీ,ఉర్థూ కవి.

అష్ఫుల్లాఖాన్ ,చంద్రశేఖర్ అజాద్ ,భగత్ సింగ్ , రాజగురు,సుఖదేవ్ ,రోహన్ సింగ్ లాంటీ వీరులకు గురువు ఈయనే.. గాంధీజీ సహాయనిరాకరణోద్యమాన్ని ఎందుకు ఆపివేయాల్సివచ్చిందో  సమాధానం చెప్పాలని ప్రశ్నించిన మొదటి వ్యక్తి ఇతనే.  సాయుధపోరాటంద్వారా స్వాతంత్రం సంపాదించాలనుకుంది. దానికి అవసరమైన ఆయుధసంపత్తి కోసం ప్రభుత్వ ఆయుధసముపార్జన కోసం బ్రిష్ ఖజానా సంస్థలను,ఆర్థిక సంస్థలను కొల్లగొట్టాలని ప్లాన్ చేసింది. దీనిలో భాగంగా 1925 ఆగష్టు9 లో ప్రజలను పీడించి పన్నులరూపంలో వసాలు చేసిన ధనాన్ని రాంప్రసాద్ బిస్మల్ తో పాటు అష్ఫుల్లాఖాన్ ,భగత్ సింగ్ ,చంద్రశేఖర్ అజాద్ ,రాజగురు,సుఖదేవ్ ,రోహన్ సింగ్ ,శంకర్ సింగ్ వాడ్గేవార్ మొత్తం పదిమంది "కాకోరి" స్టేషన్ దగ్గర కొల్లకొట్టినారు.. దీనిని సీరియస్ గా తీసుకున్న బ్రిటీష్ ప్రభుత్వం మొత్తం 40 మంది మీద కేసుపెట్టింది..ఒక్క చంద్రశేఖర్ అజాద్ ను తప్ప అందరినీ వివిధ పద్దతులలో అరెస్టు చేయగలిగింది. మొదటి ముద్ధాయి అయిన రాం ప్రసాద్ బిస్మల్ ను 1927 డిశంబర్ 29 ఉరితీసింది. రాంప్రసాద్ ను రక్షించేందుకు మొత్తం దోపిడీ ప్లాన్ అంతా నాదేనని నేరమంతా తనపై వేసుకున్న అష్ఫల్లాఖాన్ ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది.

"భారత స్వాతంత్ర ఉద్యమచరిత్రలో రాంప్రసాద్ -అష్ఫల్లాఖాన్ మైత్రీబంధం చాలా గొప్పదని చరిత్రకారుల అభిప్రాయము!!"" 

1897 జూన్ 11 న పుట్టిన రాంప్రసాద్ బిస్మల్ తన 30 యేట ఈ దేశం కోసం ఉరికొయ్యకు వ్రేలాడారు.


ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము!!!

               🙏  🙏  🙏

కామెంట్‌లు లేవు: