020821B0549. 030821.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*పుత్రుడు...*
➖➖➖✍️
*ప్రతి తండ్రీ తన కొడుకుని ప్రేమగానే చూసుకుంటాడు.. కాని ఆ కొడుకులు మాత్రం 5 రకాలుగా ఉంటారు అని మన ధర్మ శాస్త్రాలు చెప్తున్నాయి.*
*1. #శత్రు_పుత్రుడు :- *
*ఇతడు చిన్నతనం నుంచి తండ్రి చేసే ప్రతి పనికి వ్యతిరేకిస్తూ, ఏ పనితోను తండ్రికి ఆనందం కలిగించక పోవడమే కాక తండ్రి మరణించే వరకు ప్రతి పనితోను తండ్రిని భాదిస్తూనే ఉంటాడు.*
*గత జన్మలలో ప్రబలమైన శత్రుత్వం కలవాడే ఈ జన్మలో శత్రు పుత్రుడిగా జన్మిస్తాడు.*
*2. #మిత్ర_పుత్రుడు :-*
*ఇతడు చిన్నతనం నుంచి తండ్రితో ఒక స్నేహితుని వలె సంబంధాన్ని కొనసాగిస్తాడు.. కాని ఒక పుత్రుడు తండ్రికి ఇచ్చే ఏ సంతోషాన్ని అతడు తండ్రికి ఇవ్వలేడు. *
*గత జన్మలలో ఆప్త మిత్రుడు ఐనవాడే ఈ జన్మలో మిత్ర పుత్రుడుగా జన్మిస్తాడు.*
*3. #సేవక_పుత్రుడు :- *
*ఇతడు అన్ని విషయాలలోనూ రాణిoచక పోయినా తండ్రి చెప్పిన మాటని తు.చ. తప్పకుండా పాటిస్తాడు. తండ్రి చేయవలసిన పనులను కూడా ఇతడు చేస్తూ ఉంటాడు. తండ్రికి కేవలం సేవ చేయడానికి మాత్రమే జన్మిస్తాడు.*
*పూర్వ జన్మలలో సేవకుడిగా ఉండి యజమాని నుండి పొందిన లబ్ధికి కృతజ్ఞత పూర్వకంగా తన జీవితాంతం ఉండి ఈ జన్మలో సేవక పుత్రుడు గా జన్మిస్తాడు.*
*4. #కర్మ_పుత్రుడు :-*
*ఇతడు కేవలం ఒక కొడుకుగా తండ్రికి చేయవలసిన కర్మ కొరకు మాత్రమే జన్మిస్తాడు. చిన్నతనం నుంచి తండ్రికి దూరం గానే ఉంటాడు. అప్పుడప్పుడు తప్ప మిగిలిన అన్ని సందర్భాలలో తండ్రికి దూరం గానే ఉంటాడు. కేవలం అంత్యేష్టి కొరకు మాత్రమే జన్మిస్తాడు.*
*ఇతడిని కర్మ పుత్రుడు అంటారు.*
*5. #నిజ_పుత్రుడు :-*
*ఇతడు పుట్టిన దగ్గరనుంచి తన ప్రతి పని తోటి తండ్రిని ఆనందింపచేస్తూ తండ్రికి అభేదంగా ఉంటాడు .ఇతడిని విడిచి తండ్రి క్షణకాలం కూడా బ్రతుకలేడు. చివరికి తన అంత్యకాలము నందు కూడా తన కొడుకు చేతిలోనే సంతోషంగా ఏ భాధ లేకుండా అనాయాసమైన మరణాన్ని తన తనయుడి ఒడిలోనే పొందుతాడు. ఇతను తండ్రి పోయాక తండ్రికి మర్చిపోకుండా మాసికం పెడతాడు. తప్పకుండా తద్దినం పెడతాడు., గయ లో శ్రార్ధం పెడతాడు. తండ్రికి పుణ్యలోకాలు కలిగేలా చేస్తాడు. ప్రతి క్షణం ప్రతి పనిలోనూ తన తండ్రినే స్మరిస్తాడు. అరమరికలు లేకుండా తండ్రి పోలికల తోటే ఉండి తండ్రి లాగే ప్రవర్తిస్థూ తండ్రి కోసమే బ్రతుకుతాడు.*
*ఇతడిని మాత్రమే శాస్త్రాలు నిజ పుత్రుడు అన్నాయి..*✍️
. 🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
ఇలాటి మంచి విషయాలకోసం...
*“భగవంతుని విషయాలు గ్రూప్ “* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...944065 2774.
లింక్ పంపుతాము.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి