*11.09.2021*
*వందేమాతరం*
*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏
*రోజుకో పద్యం: 2258(౨౨౫౮)*
*10.1-1374-వ.*
*10.1-1375-*
*శా. జంఘాలత్వముతో నగోపరి చరత్సారంగ హింసేచ్ఛను*
*ల్లంఘింపన్ గమకించు సింహము క్రియన్ లక్షించి పౌరప్రజా*
*సంఘాతంబులు తల్లడిల్ల హరి కంసప్రాణహింసార్థి యై*
*లంఘించెం దమగంబు మీఁదికి రణోల్లాసంబు భాసిల్లఁగన్.* 🌺
*_భావము: ఇలా కంసుడు మంత్రులకు ఆజ్ఞలిస్తుండగానే, కొండ మీద వేగంగా పరిగెత్తే జింక మీదికి దూకటానికి ఉత్సాహపడే సింహం లాగా, కంసప్రాణ హరణము కొరకు ఎదురు చూస్తున్న శ్రీకృష్ణుడు సమరోత్సాహంతో కంసుడు కూచున్న మంచె మీదికి దూకాడు. ఇది చూచిన ప్రజలు కలవరపాటుకు లోనయ్యారు._* 🙏
*_Meaning: As Kamsa was commanding his ministers, like the lion cub jumping on to a speedy deer, Sri Krishna leapt on to Kamsa’s throne. Seeing this, there was an uproar in the onlookers.”_*🙏
*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*
*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*
*Kiran (9866661454).*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి