11, సెప్టెంబర్ 2021, శనివారం

ప్రశ్న పత్రం సంఖ్య: 29 జవాబులు

  ప్రశ్న పత్రం సంఖ్య: 29  కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. 

ఇది వినాయకచవితి ప్రత్యేకం. దయచేసి ఇందులోని ప్రశ్నలను పూరించటానికి ప్రయత్నించండి.   

  1. వినాయక చవితి ఏ తిధినాడు వస్తుంది.-- జ .  ప్రతి సంవత్సరం, దక్షణాయణం, భాద్రపద మాసం, శుక్ల పక్షం, చవితి నాడు వస్తుంది. అందుకే వినాయక చవితి అన్నారు. 
  2. గజాననునికి విఘ్నదిపత్యాన్ని ఇవ్వటానికి పరమేశ్వరుడు పెట్టిన పరీక్ష ఏమిటి.-- జ . మూడు లోకములలో వున్న పుణ్యనదులలో స్నానమాడి రావాలని 
  3. విఘ్నధిపతిగా ఉండటానికి ఎవరు ఎవరు పోటీ పడ్డారు. --జ . 1) గజాననుడు 2) కుమారస్వామి. 
  4. శ్రీ కృష్ణుడు అడవిలో ఎవరితో మల్లయుద్ధం చేసారు, ఎన్ని రోజులు. --- జ . జాంబవంతునితో 28 రోజులు. 
  5. సత్రాజిత్ సోదరుని పేరు ఏమిటి. --- జ . సుసేనుడు 
  6. సమంతకమనోపాఖ్యానం ఏ యుగములో జరిగింది.--- జ . ద్వాపర యుగములో  
  7. శ్రీ కృష్ణుడు తన నగరమున యేమని చాటింపు చేయించారు.--- జ . ఈ రోజు వినాయక చవితి కావున ఎవరు ఆకాశంలో చంద్రుని చూడరాదని.  
  8. వినాయక వ్రతకధలో శ్రీ కృష్ణుల వారు ఎందరిని వివాహమాడారు, వారి పేర్లు ఏమిటి--. జ . శ్రీ కృష్ణుల వారు ఇద్దరినీ వివాహమాడారు వారు 1) జాంబవతి 2) సత్యభామ. 
  9. రామాయణంలోని ఒకరు  వినాయక్ వ్రతకధలో కనపడతారు ఎవరు. ---జ . జాంబవంతుడు 
  10. నేను తొందరగా వెళ్ళాలి ఈ రాజు వినాయక చవితి అని శ్రీ కృష్ణునితో ఎవరు అన్నారు. -- జ . నారద మహర్షి 
  11. పార్వతి దేవి గృహ ద్వారము వద్ద ఎవరు వున్నారు. --- జ . గజాననుడు 
  12. వినాయకుని ఎవరు తయారుచేసారు, వాడిన పదార్ధం ఏమిటి.-- జ . జగన్మాత పార్వతీదేవి తయారుచేసారు,  వాడిన పదార్ధంనలుగుపిండి  
  13. వినాయకునికి అతికించిన శిరస్సు ఎవరిది.--- జ . గజాసురునిది 
  14. శమంతక మణి దినమునకు ఎన్ని బారువుల బంగారమును వసగును. --- జ . దినమునకుఎనిమిది బారువుల బంగారమును వసగును. 
  15. తల్లిదండ్రులకు ప్రణమిల్ల కష్టపడుతున్న వినాయకుని చూసి నవ్వినది ఎవరు. --జ .  చంద్రుడు 
  16. ఒక్క అరుంధతి వేషము తప్ప ఇతర ఋషి పత్నుల వేషము ధరించినది ఎవరు. ---జ . అగ్ని దేముని భార్య స్వాహా దేవి 
  17. శ్రీ కృష్ణ భగవానునికి కలిగిన నీలాపనిందలు ఏమిటీ. ---జ . సుసేనుని చంపి సమంతకమానికి అపహరించినాడని . 
  18. వినాయక చవితి రాత్రి ఎవరిని చూడకూడదని చెపుతారు. --- జ . చంద్రుని 
  19. వినాయకుని కనిష్ట సోదరుని పేరు ఏమిటి. -- జ . కుమారస్వామి. 
  20. విజ్ఞేషుని భార్యల పేర్లు ఏమిటి. -- జ . సిద్ది,బుద్ధి . 
  21. వినాయకుని వాహనం ఏమిటి పేరు తెలపండి. --జ . అనింద్యుడు 
  22. వినాయకునికి ప్రియమైన వంటకం ఏమిటి. --- జ . మోదకం అనగా కుడుములు. 
  23. ఋషి పత్నులకు కలిగిన నీలాపనిందలు ఏమిటి. -- జ . అగ్ని దేమునితో వున్నది తమ పత్నులే అని ఋషులు వారి భార్యలను విడనాడిరి. 
  24. మనం చేసే ప్రతి పూజకు ముందుగా ఆరాధించే దేముడి పేరు ఏమిటి. -జ . గణపతి 
  25. శ్రీ మహావిష్ణువు ఏ ఏ వాద్య పరికరాలను ధరించినట్లు మనం కధలో తెలుసుకున్నాం --జ . చిరుగంటలు, సన్నాయి 
  26. వినాయక చవితి అంటే నాకు ఇష్టం ఎందుకంటె.-- జ . ఇది మీ స్వంత అభిప్రాయము. 

కామెంట్‌లు లేవు: